Kasturi Shankar Comments: ఆమె నిజంగానే పోతే బాగుండు - పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్‌పై నటి కస్తూరి ఫైర్
Kasthuri Shankar Comments: ప్రస్తుతం దేశమంత పూనమ్ పాండే గురించే మాట్లాడుకుంటుంది. ఆమె మరణవార్త కంటే.. ఫేక్ పబ్లిసిటీ స్టంటే సంచలనంగా మారింది. ఆమె తీరుపై సినీ సెలబ్రిటీలు మండిపడుతున్నారు.
Kasthuri Shankar Comments on Poonam Pandey: పూనమ్ పాండే తీరుపై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. ఆమె చనిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేయించిన సంగతి తెలిసిందే. దీన్ని దేశమంత నమ్మింది. అయితే ఆ తర్వాత మరుసటి రోజే తాను బ్రతికే ఉన్నానని, సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానంటూ ఆమె చెప్పడంతో అంతా కంగుతిన్నారు. దీంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఆమె మరణవార్త కంటే.. ఫేక్ పబ్లిసిటీ స్టంటే సంచలనంగా మారింది. చెత్త పబ్లిసిటీ అంటూ సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు పూనమ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇలాంటి తప్పుడు ప్రచారం మంచిది కాదని, మనుషుల మనోభవాలతో ఆడుకోవడమే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక సినీ సెలబ్రిటీలైతే పూనమ్‌పై తమదైన తీరుతో విరుచుకుపడుతున్నారు. పూనమపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని, ఆమెను బాయ్‌కాట్ చేయాలంటూ కంగనా రనౌత్ నుంచి మందిర బేడీ వరకు ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా టీవీ నటి, సౌత్ ఫైర్ బ్రాండ్ కస్తూరి శంకర్ పూనమ్ వ్యవహరంపై ఘాటుగా స్పందించింది. ఆదివారం ఓ న్యూస్ ఛానల్‌తో జరిగిన డిబేట్‌లో పూనమ్ వ్యవహారంపై మండిపడింది. ఇదొక చెత్త పబ్లిసిటీ స్టంట్ అని ఇలాంటి వాటి వల్ల ఒరిగేదేం లేదంటూ కస్తూరి విమర్శించింది.
Also Read: కొండ చిలువను పెంచుకుంటున్న స్టార్ హీరోయిన్! - షాకవుతున్న నెటిజన్లు
పూనమ్ పాండే మరణం అంత పెద్ద వార్త కాదు..
"పూనమ్ పాండే మృతి అంత పెద్ద వార్త అని నేను అనుకోవడం లేదు. క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కంటే ఆమె మృతి పెద్ద విషయమేం కాదు. అయినా ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనుకుంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ మహమ్మారితో పారాడుతోన్న కొన్ని వేల మంది క్యాన్సర్ వారియర్స్‌కి ఆమె పెద్ద డొనేషన్ ఇచ్చి ఉండొచ్చు. తను అలా చేసి ఉంటే తనపై అందరిలో పాజిటివ్ అభిప్రాయం ఉండేది. ఆమెపై రెస్పెక్ట్ కూడా పెరిగింది. కానీ చనిపోయినట్లుగా నాటకం ఆడింది. గతంలో కూడా పూనమ్ ఇలాంటి చెత్త పబ్లిసిటీ డ్రామాలు ఆమె చాలా చేసింది. ఇప్పుడు ఇది కూడా అందులో ఒకటి అయిపోయింది. తన పబ్లిసిటీ కోసం బ్రెస్ట్ క్యాన్సర్‌ను వాడుకోలేదు సంతోషం" అంటూ ఘాటూ వ్యాఖ్యలు చేసింది.
ఆమె నిజంగానే పోతే బాగుండేది..
అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్యాన్సర్ పేషెంట్స్ కోసం తాను చేస్తున్న ఛారిటీ గురించి కూడా కస్తూరి వివరించింది. "క్యాన్సర్ అనేది చిన్న విషయం కాదు. పిడియాట్రిక్ క్యాన్సర్ చిన్నారుల కోసం నేను ఒక ఛారిటీ నడుపుతున్నాను. క్యాన్సర్ బాధితురాలైన మా అమ్మ, క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన నా కూతురి పేరు మీద ఈ ఛారిటీ నడుపుతున్నాను. అలాంటి నాకు పూనమ్ తన మ్రతిని అవగాహన కోసం చేసిన పనిలా అనిపించడం లేదు. ఇది కేవలం ఒక బుద్ధి లేని చెత్త పబ్లిసిటీగా మాత్రమే నేను చూస్తున్నాను. ఒక సీరియస్ ప్రాబ్లమ్‌ను తన సొంత పబ్లిసిటీ కోసం వాడుకుంది. అయినా తనేం పెద్ద సంఘ సంస్కర్త కాదు. క్యాన్సర్‌ని కూడా వాడుకొని పబ్లిసిటీ చేసుకుంది. సోషల్ మీడియాలో అయితే అందరూ ఆమె నిజంగా పోతే బావుండేది అంటున్నారు" అంటూ పూనమ్‌పై కస్తూరి శంకర్ ధ్వజమెత్తింది.