Brahmamudi Serial Today February 2nd - ‘బ్రహ్మముడి’ సీరియల్ : కోడళ్ల కోసం అత్తల మధ్య యుద్దం – శోభనం కోసం కళ్యాణ్ ఆరాటం
Brahmamudi Today Episode: కావ్యతో విడిపోవడానికి వంద కారణాలు ఉన్నాయన్న రాజ్ అవేమిటో బోర్డు మీద రాయడంతో కావ్య షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య ఏడుస్తూ నేను మీరే కావాలని కోరుకుంటున్నాను. మీతో సర్దుకుపోతున్నాను. అంటూ నిలదీస్తుంది. మనం విడిపోవడానికి గల కారణం ఏంటో ఇవాళ నాకు తెలియాలి అంటూ ప్రశ్నిస్తుంది. ఒక్కటి కాదు వంద కారణాలు ఉన్నాయి. రాసి చూపిస్తాను అంటూ రాయడానికి బోర్డు తీసుకుంటాడు రాజ్. అయితే రాసి చూపించండి అంటుంది. కావ్య. దీంతో ఏం రాయాలో ఆలోచిస్తూ ఉండిపోతాడు రాజ్. చూశావా వంద కారణాలని చెప్పావు ఒకటోది రాయడానికే ఆలోచిస్తున్నావు అంటుంది కావ్య. దీంతో ఇదే మొదటి కారణం అంటూ ప్రతి విషయంలో నీదే పైచేయిలా ఉంటావు. నాతో అడ్డగోలుగా వాదిస్తావు. స్టైల్‌గా రెడీ కావు నీ మాటలతో ఎదుటి మనిషికి చిర్రెత్తుకొచ్చేలా చేస్తావు. అంటూ ఇంతకన్నా ఎక్కువ అడగొద్దు అని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. హాల్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటారు.
అపర్ణ: కావ్య ఆఫీసుకు వస్తుంది కదండి ఎలా వర్క్ చేస్తుందంటారు.
ప్రశాష్: అబ్బా ఏం అడుగుతావులే వదిన సూపరో సూపరు..
ధాన్యలక్ష్మీ: మిమ్మల్నేం ఏమీ అడగలేదు లేండి అంతగా రెచ్చిపోకండి.
సుభాష్: నిజంగా కావ్యలాంటి డిజైనర్ ఈ జనరేషన్‌లో లేరు అపర్ణ. ఎప్పుడో మా చిన్పప్పుడు అలాంటి వాళ్లను చూశాను.
అందరూ కావ్యను ప్రశంసిస్తుంటే.. ధాన్యలక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. ప్రకాష్ ఏంటి ధాన్యం అలా వెళ్లిపోతున్నావు అనగానే నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? అంటుంది. దీంతో ఇందిరాదేవి ధాన్యలక్ష్మీని తిడుతుంది. నలుగురిలో భర్తను అలా మాట్లాడొద్దు అని చెప్తుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి తనకు ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదని బాధపడుతుంటే.. అందరూ కళ్యాణ్ ను ఆటపట్టిస్తుంటారు. ఇంతలో ధాన్యలక్ష్మీ, అపర్ణ మరోసారి గొడవ పడతారు. దీంతో వీళ్లిద్దరూ తిట్టుకుంటూ మరోసారి నా శోభనం వాయిదా వేస్తారేమో అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. మరోవైపు పిజ్జా డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళుతుంది అప్పు. ఇంట్లో డెలివరీ తీసుకునే మహిళ కంగారుపడుతూ డెలివరీ తీసుకుంటుంది. అప్పు ఎందుకు టెన్షన్ పడుతున్నారని అడుగుతుంది. ఇంతలో వాళ్ల పాపను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ఫోన్ చేసి బెదిరిస్తారు. ఇది గమనించిన అప్పు వెంటనే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండని చెప్తుంది. మరోవైపు బెడ్‌రూంలో పడుకున్న రాజ్ దగ్గరకు నోటికి ప్లాస్టర్ వేసుకుని కాఫీ తీసుకుని వెళుతుంది కావ్య.
రాజ్ నిద్ర లేచి కావ్య చూసి షాక్ అవుతాడు.
రాజ్: ఏంటీ ప్లాస్లరు ఏంటీ మ్యాటరు.
కావ్య: మీరు రాత్రి ఏమన్నారు. నేను అడ్డుగోలుగా వాదిస్తాను అన్నారు. నా మాట గెలవాలనుకుంటున్నాను అన్నారు. అసలు నేను మీతో మాట్లాడకుండా.. నోటికి ప్లాస్టర్ వేసుకుంటే ఎలా వాదిస్తాను. ఎలా నా మాట నెగ్గాలనుకుంటాను.
రాజ్: అంటే ఇప్పుడు తమరు ఈ బోర్డులో రాసినవన్నీ ఫాలో అవుతారన్నమాట.
కావ్య: ఏం డౌటా? మీకు నచ్చినట్టే ఉండాలి. మీరు మెచ్చినట్టే ఉండాలి. మీరు నొచ్చుకోకుండా మాట్లాడాలి. మీరు విసుగు తెచ్చుకోకుండా నేను చూసుకోవాలి. అలాగే ఇకనుంచి నేను మీకు అప్పలమ్మలా కనిపించను.
అంటూ కాఫీ ఇచ్చి వెళ్లిపోతుంది. దీని ఆత్మవిశ్వాసం చూస్తుంటే నిజంగానే సాధించేలా ఉంది అని మనసులో అనుకుంటాడు రాజ్. మరోవైపు అనామిక వాళ్ల అమ్మకు ఫోన్ చేసి కళ్యాణ్ శోభనం కోసం ఇంట్లో వాళ్లతో మాట్లాడి మూహూర్తం పెట్టించాడు. అని చెప్పగానే వాళ్ల అమ్మా ఒక సలహా ఇస్తుంది. దీంతో అనామిక సంతోషంగా వాళ్ల అమ్మకు థాంక్స్ చెప్తుంది. మరోవైపు కిడ్నాపర్లు పంపిన వీడియోను అప్పు మరోసారి చూసి అందులో ఉన్న స్కూల్ తనకు తెలుసని.. పాపను మనం రక్షించొచ్చని చెప్తుంది. అందుకోసం తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.