అన్వేషించండి

Special Gift to Prasanth Varma:'హనుమాన్‌' దర్శకుడు ప్రశాంత్ వర్మకు స్పెషల్ గిఫ్ట్ - వామ్మో, అన్ని కోట్లా?

Special Gift to Prasanth Varma: 'హనుమాన్‌' సినిమా సక్సెస్‌లో ప్రశాంత్‌వర్మ కీలక పాత్ర పోషించారు. దీంతో ఇప్పుడు ఆయన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు కోట్ల రూపాయల గిఫ్ట్‌ కూడా ఇచ్చారట.

Special Gift to Prasanth Varma: 'హనుమాన్‌' సినిమా చూసిన వాళ్లు.. దాంట్లో గ్రాఫిక్స్‌ చూసి.. కచ్చితంగా ఆ సినిమాకి బడ్జెట్‌ వందల కోట్లు దాటిపోయి ఉంటుంది అనుకుంటారు. ఆ రేంజ్‌లో ఉంటాయి సినిమాలో గ్రాఫిక్స్‌. కానీ, వాస్తవానికి చాలా తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రూపొందించారు ఆ సినిమాని. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలు అందుతున్నాయి. ఇప్పటికే దాదాపు రూ.265 కోట్లు కలెక్షన్లు దాటిపోయాయి. ఇంకా జనాలు థియేటర్లకు క్యూ కడుతూనే ఉన్నారు. 92 ఏళ్ల టాలీవుడ్‌ సినిమా చరిత్రనే తిరగరాసింది 'హనుమాన్‌'. సంక్రాంతి సందర్భంగా రిలీజైన సినిమాల్లో 92 ఏళ్ల తర్వాత ఇంత కలెక్షన్‌ రాబట్టిన సినిమాగా రికార్డ్‌ సృష్టించింది 'హనుమాన్‌'.     

విలువైన బహుమతి.. 

ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో మాత్రం ఒక వార్త తెగ వైరల్‌ అవుతోంది. అదే 'హనుమాన్‌' డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మకు విలువైన బహుమతిని ఇచ్చారట ప్రొడ్యూసర్‌ నిరంజన్‌రెడ్డి. సినిమా సక్సెస్‌ అయ్యి ఇలా ఊహించని రీతిలో కలెక్షన్స్‌ వస్తే.. కార్లు, ఇళ్లు లాంటివి బహుమతులుగా ఇస్తుంటారు టాలీవుడ్‌లో. అలా గతంలో చాలామంది ప్రొడ్యూసర్లు, హీరోలు తమ డైరెక్టర్లకు ఇలానే బహుమతులు ఇచ్చారు కూడా. ఇప్పుడిక ప్రశాంత్‌ వర్మకు కూడా నిరంజన్‌రెడ్డి దాదాపు రూ.6 కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ కారును బుక్‌ చేశారంట కూడా. ఇక డెలివరీనే ఆలస్యం అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో గిఫ్ట్‌ ఇచ్చే వరకు వేచి చూడాలి అంటున్నారు సినీవర్గాలు. 

'హనుమాన్‌' భారీ హిట్‌ అవ్వడంతో ఆ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటుంది టీమ్‌. దాంట్లో భాగంగానే యూఎస్‌లో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం నిర్వహించారు. దానికోసం ఇప్పటికే టీమ్‌ యూఎస్‌ చేరుకుంది. హీరో తేజ సజ్జతో పాటుగా హీరోయిన్‌ అమ్రిత్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, ప్రొడ్యూసర్లు నిరంజన్‌రెడ్డి తదితరులు అమెరికా చేరుకున్నారు. వరుసగా మూడు రోజుల పాటు బిజీ బిజీగా గడపనుంది టీమ్‌. ఇక సినిమా సక్సెస్‌ కోసం వెళ్లిన ప్రశాంత్‌ వర్మ.. మొదటిసారి యూఎస్‌ వచ్చాను అంటూ పెట్టిన ఇన్‌స్టాపోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

ఇక ఈ సినిమా సక్సెస్‌ కావడంతో పార్ట్‌ - 2పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించి వర్క్‌ మొదలుపెట్టేశారు ఇప్పటికే. 'హనుమాన్‌' లో తేజ సజ్జ ఒక చిన్న దొంగ కాగా.. మణి దొరకడంతో అతనికి హనుమంతుడి ద్వారా పవర్‌ వస్తుంది. అలా ఊరిని కాపాడుకుంటాడు. ఇక పార్ట్‌ - 2లో మాత్రం ఏకంగా హనుమంతుడే ఎంట్రీ ఇవ్వనున్నాడని చెప్పారు ప్రశాంత్‌ వర్మ. రామాయణానికి సంబంధించి తెలియని కొన్ని సన్నివేశాలను ఈ పార్ట్‌ - 2లో చూపిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సినిమా కోసం చిరంజీవిని, మహేశ్‌బాబును సంప్రాదించాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాట బయటపెట్టారు ప్రశాంత్‌.

Also Read:  ఫస్ట్ టైమ్ ఆ దేశంలో అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ - అంతా ‘హనుమాన్’ మహిమే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget