అన్వేషించండి

Brahmamudi Serial Today February 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అనామికపై స్వప్న ఫైర్ – ఆవేశంతో కొట్టబోయిన కళ్యాణ్

Brahmamudi Today Episode: అనామికపై స్వప్న ఫైర్ అవ్వడం, కళ్యాణ్ భోజనానికి రాకపోవడం లాంటి ఇంట్రస్టింగ్ మలుపులతో ఇవాళ్టీ ఏపిసోడ్ జరిగింది.

Brahmamudi Serial Today Episode: అనామిక కూడా కోపంగా గార్డెన్‌ లోకి వెళ్లిపోవడం కావ్య చూసి. కావ్య కూడా గార్డెన్‌లోకి వెళ్తుంది. కళ్యాణ్‌ను బాధపెట్టొద్దని కళ్యాణ్‌ రాసిన కవితను అనామికకు ఇస్తుంది కావ్య. అతనికి వ్యాపారం అంటే పడదని, భర్త ప్రేమ అందరికీ దొరకదని, చెబుతుంది కావ్య. ఇది కవిత అనుకుంటావో, లవ్ లెటర్ అనుకుంటావో నాకు తెలీదు. కానీ భార్యాభర్తల బంధం ఇలా లెటర్స్‌లో కాదు. నమ్మకంలో ఉండాలి అని కావ్య అంటుంది.

అనామిక: మా ఆయన ఇలా పిచ్చి రాతలు రాసుకుంటూ కూర్చుంటే నువ్వు నీ భర్త అందలం ఎక్కాలని చూస్తున్నారా?

దూరం నుంచి కావ్య, అనామికలను గమనిస్తున్న స్వప్న వెంటనే కోపంగా

స్వప్న: ఏ మెంటల్.. నిన్ను కాదమ్మా.. నా చెల్లిని అంటున్నా. ఏమే కావ్య నీకు బుద్ధిందా.. ఇలాంటి మూర్ఖులకు ఎందుకే సూక్తులు చెబుతున్నావ్.. గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని కవితలు, ప్రేమ గురించి దీనికి ఎందుకే చెబుతున్నావ్. దీని వంకర బుద్ధి ఇంకా అర్థం కాలేదా. తన భర్తను ఆఫీస్‌లో అందలం ఎక్కించి ఇక్కడ ఇంట్లో తను మహారాణిలా చక్రం తిప్పుదామని అనుకుంటుందే.

అనామికి: ఏం మాట్లాడుతున్నావు స్వప్నా..

స్వప్న: చూశావా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది. దీనికి ఎంత పొగరు. ఇలాంటి దానికి నీతులు చెబుతావేంటో బుద్ధి లేని దానా. నిన్ను కాదమ్మా నా చెల్లిని

అంటూ స్వప్న తిడుతుంటే.. కావ్య స్వప్నను లోపలకి తీసుకెళ్తుంది. అనామిక కోపంతో రగిలిపోతుంది. మరోవైపు అందరూ భోజనం చేస్తుంటారు. కల్యాణ్, అనామిక రారు. కల్యాణ్ రాలేదా అని రాజ్ అడిగితే..  అవమానం జరిగాక ఎలా వస్తాడు అని రుద్రాణి అంటుంది. ఇంతలో రాజ్ లేచి వెళ్లిపోతుంటే.. నేను కవిగారిని తీసుకొస్తాను. మీరు కూర్చోండి అని కావ్య కల్యాణ్‌ను తీసుకురావడానికి వెళ్తుంది.

ధాన్యలక్ష్మీ: ఈ ప్రేమ తమ్ముడి జీవితంలో కూడా చూపిస్తే బాగుండేది రాజ్

ప్రకాశం: ఏ.. ఆపు.. కల్యాణ్‌ను మనం కన్నాం అంతే. వాన్ని చూసుకుంది రాజే. కల్యాణ్ చేసింది నీకు ఇప్పుడే తప్పుగా అనిపించిదా. ఇంతకుముందు లేదా. నీకు ఎవరు ఏం చెబుతున్నారో ఏమో నాకు అర్థం కావటం లేదు.

రుద్రాణి: ఏంటీ అన్నయ్య నన్ను చూస్తూ అంటున్నావ్. నీ భార్య ఏం చిన్నపిల్ల కాదు. చెబితే నమ్మేయడానికి

స్వప్న: మీరు ఎలాంటి వారినైనా మార్చేస్తారని అంకుల్ అంటున్నారు.

 అనగానే తన భర్త పై స్థాయిలో ఉండాలని అనామిక కోరుకోవడంలో కూడా తప్పులేదు అని ధాన్యలక్ష్మీ అనగానే.. వాడిని నేను మారుస్తాను అని రాజ్ అంటాడు. విన్నావుగా ధాన్యలక్ష్మీ ఇక మనస్ఫూర్తిగా తిను.. నీ కొడుకును రాజ్, కావ్య చూసుకుంటారు అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు కల్యాణ్‍కు కావ్య నచ్చజెబుతుంది. పేరు తెచ్చుకోవడం అంటే వ్యాపారం చేసే కాదు. కవితలు రాసి కూడా పేరు తెచ్చుకోవచ్చు. మీ లోని కవిని ప్రపంచానికి చాటిచెప్పండి అని కల్యాణ్‌ను భోజనానికి తీసుకొస్తుంది కావ్య. తర్వాత  తన ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదని అనామిక బాధపడుతుంది.

కళ్యాణ్‌: నేను నువ్వు చెప్పావని ఆఫీస్‌కు వెళ్లాను అంతే. నాకు నచ్చి కాదు. అర్థం చేసుకో. కానీ, నావల్ల బాధపడ్డావ్ కాబట్టి సారీ

అనామిక: చేసిందంతా చేసి ఇలా నాలుగు గోడల మధ్య సారీ చెబితే అయిపోతుందా. నా పక్క పంచుకుందామనే కదా ఇలా చేస్తున్నావ్.

అని అనామిక అనగానే  కళ్యాణ్‌ కోపంతో అనామికపై చేయి ఎత్తుతాడు. ఇంతలా నేను దిగజారుతాననుకున్నావా. ఇప్పటివరకు నీపై నమ్మకం ఉండేది. కానీ, ఇప్పుడు నీపై అసహ్యం వేస్తుంది. నీ అంతట నువ్ నచ్చి వచ్చేవరకు నీ నీడను కూడా తాకను అని కళ్యాణ్‌ వెళ్లిపోతాడు. తర్వాత కళ్యాణ్‌ను రాజ్‌ పిలిచి అగ్రిమెంట్‌ పేపర్స్‌ ఇచ్చి ఖైరతాబాద్ బ్రాంచ్ పేపర్స్. ఇక నుంచి ఆ బ్రాంచ్ నువ్వే చూసుకోవాలి. అని చెప్పగానే  ధాన్యలక్ష్మీ, అనామిక హ్యాపీగా ఫీలవుతారు. కల్యాణ్ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఇంతేనా అన్నయ్య అర్థం చేసకుంది అని కల్యాణ్ అంటే.. మీ మనసుకు నచ్చిన పని చేస్తూనే ఈ పని కూడా చేయండి అని కావ్య అంటుంది. నా వల్ల కాదు వదినా అని కల్యాణ్ అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. 

Also Read: మనశ్శాంతి లేదు.. ఎటైనా వెళ్లిపోవాలని ఉంది - 'ధృవ నక్షత్రం' వాయిదాపై గౌతమ్‌ మేనన్ ఆవేదన!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Embed widget