Brahmamudi Serial Today February 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : మర్డర్ కేసులో క్లూ కనిపెట్టిన కావ్య – కోర్టులో అనామిక గురించి చెప్పిన రాజ్
Brahmamudi Today Episode: జైల్లో ఉన్న రాజ్‌ను కలిసి మర్డర్ కేసులో ఒక సాక్ష్యం సంపాదిస్తుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్‌ను అరెస్ట్ చేసి అప్పు ఇంత దూరం తీసుకొచ్చిందని అప్పును ధాన్యలక్ష్మీ, రుద్రాణి తిడుతుంటారు. తమ మాటలతో మానసికంగా టార్చర్ చేస్తుంటారు. దీంతో కావ్య కోపంగా వాళ్లిద్దరిని తిడుతుంది.
కావ్య: అప్పును టార్గెట్ చేయడం ఇక ఆపండి మేము ముగ్గురం మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా..?
రుద్రాణి: విన్నావా..? అన్నయ్య ఎలా మాట్లాడుతుందో
సుభాష్: ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇది కాదు. రాజ్‌ను బయటకు ఎలా తీసుకురావాలో ఆలోచించాలి. మనకు ఇంక 24 గంటల టైం మాత్రమే ఉంది. ఆ నేరస్తున్ని ఎలాగైనా పట్టుకోవాలి
అని చెప్పి సుభాష్ లోపలికి వెళ్లిపోతాడు. జైల్లో ఉన్న రాజ్‌కు కావ్య భోజనం తీసుకెళ్తుంది. రాజ్ భోజనం చేస్తుంటే.. కావ్య బాధపడుతుంది.
కావ్య: మీకు ధైర్యం పోయిందా..?
రాజ్: నా ధైర్యం నా ముందే కూర్చుంది
కావ్య: నాకు మాత్రం ఎందుకో ధైర్యం తగ్గుతుంది
రాజ్: ఏయ్ ఇలా బాధపడుతూ నన్ను జీవితాంతం జైల్లోనే కూర్చోబెడతావా ఏంటి.? నేను వెంటనే బయటకు రావాలి. మనం బూత్ బంగ్లాకు వెళ్లాలి. పిల్లల్ని కనాలి
కావ్య: ఏవండి మీరు మామూలుగా మీకు తెలిసిన కోణంలో చెప్పారు. అది కాదు. నేరం జరిగిన కోణంలో ఆలోచించాలి. మనం ఎక్కడో ఏదో వదిలేశామండి.. అదేంటో మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కసారి ఏం జరిగిందో మళ్లీ జ్ఞాపకం తెచ్చుకోండి.
రాజ్: చెప్పిందే గుర్తు ఉంది కళావతి
కావ్య: అలా కాదండి మీరు కారు ఎక్కడ పెట్టి వెళ్లారు..
రాజ్: బయటే పెట్టి వెళ్లాను
కావ్య: బయటకు రావడానికి ఎంత టైం పట్టింది.
రాజ్: ఒక పావుగంట ఇరవై నిమిషాలు అయ్యుండొచ్చు
కావ్య: సెక్యూరిటీ గార్డు గేటు దగ్గరే ఉన్నారు. సెక్యూరిటీని కాదని డెడ్ బాడీని కారులో పెట్టడం అంత ఈజీ కాదు. అయినా అ టైంలో అక్కడ ఎవరైనా అనుమానంగా కనిపించారా..?
రాజ్ : ఒక తాగుబోతు వచ్చి డబ్బులు అడిగిండు.
అని ఆరోజు రాత్రి ఫ్యాక్టరీ దగ్గర జరిగిన విషయం గుర్తు చేసుకుంటాడు రాజ్. ఇది చాలండి ఎలాగైనా ఆ క్వాటర్ కమలేష్‌ను పట్టుకుంటాము అని చెప్పి ఇంటికి వస్తుంది. ఇంట్లో అప్పు దగ్గరకు వెళ్లి క్వాటర్ కమలేష్ గురించి చెప్తుంది. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని ఇద్దరూ డిసైడ్ అవుతారు. తర్వాతి రోజు ఇంట్లో అందరూ కూర్చుని ఉంటారు. లోపలి నుంచి సుభాష్ వస్తాడు.
సుభాష్: ఇవాళ జడ్జిమెంట్ వచ్చే రోజు నువ్వు కోర్టుకు రావా..?
అపర్ణ: రావాలనే ఉంది.. కానీ భయంగా ఉంది. తీర్పు ఏమోస్తుందో తెలియదు. ఒకవేళ మనకు అనుకూలంగా రాకపోతే.. వాడికి శిక్ష పడితే అది విని తట్టుకునే శక్తి నాకు లేదు.
రుద్రాణి: అవును పాపం ఏ తల్లికైనా కొడుక్కి శిక్ష పడుతుందంటే తట్టుకునే శక్తి ఉండదు కదా..?
ధాన్యలక్ష్మీ: రాజ్‌ను నిర్దోషిగా నిరూపిస్తామని కావ్య, అప్పు వెళ్లారు. వాళ్లు ఏం సాధిస్తారో తెలియదు. ఆ హంతకుణ్ని నిజంగా పట్టుకుంటారో లేదో తెలియదు. అంతా అయోమయంగా ఉంది
ఇందిరాదేవి: అందరూ మంచి జరగాలని కోరుకోండి. న్యాయం జరగాలని కోరుకోండి.. అన్ని వ్యతిరేకంగా మాట్లాడ్డం ఆపండి వీలైతే ఈ కన్నతల్లికి ధైర్యం చెప్పండి లేదంటే నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చోండి
సుభాష్: ఈ ఇంట్లో ఏ సమస్య వచ్చినా అందరికన్నా ఎక్కువగా ధైర్యంగా ఉండేది నువ్వే అలాంటిది నువ్వే నెగటివ్‌గా ఆలోచిస్తే ఎలా కావ్య, అప్పు మీద నాకు నమ్మకం ఉంది వాళ్లు సాక్ష్యాలతో కోర్టుకు వస్తారు రా వెళదాం
అని అపర్ణను పిలవగానే అపర్ణ సరే అంటూ బయలుదేరుతుంది. కళ్యాణ్ కూడా నేను వస్తాను పెద్దనాన్నా అంటూ వారితో పటు బయలుదేరుతాడు. మరోవైపు అప్పు, కావ్య సాక్షిని వెతుకుతుంటారు. కోర్టులో రాజ్ ఇదంతా అనామిక కావాలనే చేస్తుందని చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















