Brahmamudi Serial Today February 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కోర్టుకెళ్లిన రాజ్ – నాటకం ఆడిన లాయరు
Brahmamudi Today Episode: రాజ్‌ను కోర్టుకు తీసుకెళ్లడంతో రాజ్ లాయర్ ఫన్నీగా నాటకం ఆడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: ఇంటికి వచ్చిన అప్పును ధాన్యలక్ష్మీ తిడుతుంది. మా రాజ్‌ను అరెస్ట్ చేసిన నువ్వు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావు అంటూ నిలదీస్తుంది. రుద్రాణి కూడా అప్పును తిడుతుంది. అనామికతో ఎంత లంచం తీసుకుని రాజ్‌ను అరెస్ట్ చేశావు అంటుంది.
ధాన్యలక్ష్మీ: ఏ తప్పు చేయని రాజ్‌ను అరెస్ట్ చేస్తావా..? ఇందుకేనా నా కొడుకు నిన్ను పోలీస్ ను చేసింది.
అప్పు: మా బావను అరెస్ట్ చేయాల్సి వచ్చినందుకు నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు
కళ్యాణ్: అప్పు ఉన్న పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాగే చేసేవారు. అప్పు మన ఇంట్లో ఉంది కాబట్టి మీకు ఇంత కోపం వస్తుంది. తన తప్పేం లేదమ్మా.. తను రూల్స్ పాటించకపోతే ఉద్యోగానికి అన్యాయం చేసినట్టు అవుతుంది
అప్పర్ణ ఏడుస్తుంటే.. సుభాష్ ఓదారుస్తాడు.
సుభాష్: ఊరుకో అపర్ణ రాజ్ ఏ తప్పు చేయలేదు. చట్టం కానీ న్యాయ స్థానం కానీ నిర్ధోషికి శిక్ష వేయదు. నువ్వేం బాధపడకు
కావ్య: ఆయనకు ఏం కాదు దీని వెనక ఎవరున్నారో కనిపెడదాం. ఆయన్ని నిర్దోషిగా బయటకు తీసుకొద్దాం. నా చెల్లెలు చట్టానికి లోబడి తన డ్యూటి తను చేసింది. తనను ఎవరూ తప్పు పట్టకండి కవిగారు అప్పును లోపలికి తీసుకెళ్లండి
అని కావ్య చెప్పగానే.. కళ్యాణ్, అప్పును తీసుకుని లోపలికి వెళ్తాడు. తర్వాత లోపలికి వెళ్లిన అప్పు బాధపడుతుంది.
అప్పు: ఇందుకేనా నువ్వు పోలీస్ అయింది. నా వాళ్లనే నేను శిక్షించుకుంటున్నానా..
అని మనసులో అనుకుంటూ ఏడుస్తుంటే.. కళ్యాణ్ వస్తాడు.
కళ్యాణ్: అప్పు.. ఎందుకు ఏడుస్తున్నావు. ఇప్పుడేమైందని బాధపడుతున్నావు
అప్పు: నా వల్ల కావడం లేదు కూచి నేను పెద్ద తప్పు చేశాను. నాకు గిల్టీగా ఉంది.
కళ్యాణ్: ఒక పోలీస్‌గా ధైర్యంగా ఉండాల్సిన నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు
అప్పు: సొంత బావగారినే అరెస్ట్ చేసి ఎలా ధైర్యంగా ఉండగలను.. ఇలాంటి రోజు వస్తుందని తెలిస్తే అసలు నేను పోలీస్ అయ్యేదాన్నే కాదు.
కళ్యాణ్ : పోలీస్ అవ్వాలనేది నీ గోల్ ఇదంతా ఎందుకు అలోచిస్తున్నావు.
అప్పు: నా గోల్ నా సొంత వాళ్లనే బాధపెడుతుందంటే నాకు పోలీస్ జాబే వద్దు
కళ్యాణ్ : ఇలా కుంగిపోవడానికా..? నువ్వు పోలీస్ అయింది. భవిష్యత్తులో ఇంకా చాలా జరగొచ్చు అన్ని తట్టుకుని నిలబడాలి
అప్పు: నాకు భయంగా ఉంది. మన వాళ్ల మాటలు వింటుంటే చాలా భయంగా ఉంది
కళ్యాణ్ : నువ్వేం తప్పు చేయలేదు. అన్నయ్యను అరెస్ట్ చేసిన ఈ చేతులతోనే అన్నయ్యను బయటకు తీసుకురావడం గురించి ఆలోచించు అప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటారు.
అంటూ కళ్యాణ్, అప్పును ఓదారుస్తాడు. అప్పు కూడా ఆలోచనలో పడిపోతుంది. తర్వాత రాజ్‌ను కోర్టుకు తీసుకెళ్తుంది అప్పు. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సామంత్‌ను రాజ్ ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని వాదిస్తాడు. రాజ్ తరపు లాయర్ రాజ్ హత్య చేయలేదని సామంత్ ను ఎవరో మర్డర్ చేసి కావాలనే రాజ్ కారులో డెడ్ బాడీని పెట్టారని వాదిస్తాడు. అందుకోసం చిన్న నాటకం ఆడతాడు. ఇంతలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావ్యను బోనులోకి పిలిచి రాజ్.. సామంత్ ఇంటికి వెళ్లి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడా..? అని అడుగుతాడు. వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవమేనని కానీ ఆవేశంలో అన్నాడని రాజ్ అలాంటి వాడు కాదని చెప్తుంది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం రాజ్ వార్నింగ్ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగా సామంత్‌ను చంపేశాడు అని వాదిస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

