Brahmamudi October 14th: కళ్యాణ్ మాటలకి ఫీలైన అప్పు- భర్త ప్రేమకి మురిసిన కావ్య
రాజ్ ఆడుతున్న నాటకం గురించి కావ్యకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అందరూ హాల్లో ఉన్న సమయంలో స్వప్న కావాలని మెట్ల మీద నుంచి జారి పడిపోతున్నట్టు నటిస్తుంది. సమయానికి కావ్య పట్టుకోవడంతో స్వప్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది. దీంతో అందరూ అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని వరుస పెట్టి తిడతారు.
అపర్ణ: జరగరానిది జరిగి ప్రాణం పోయి ఉంటే అప్పుడు మమ్మల్నే కదా నిందించేది
ఇంద్రాదేవి: అపర్ణ అరిచినా తన కోపంలో అర్థం ఉంది. అమ్మ అనే అదృష్టం అందరికీ దక్కదు. నీకు దేవుడు అదృష్టం ఇచ్చాడు జాగ్రత్తగా చూసుకో
రుద్రాణి: ప్రెగ్నెంట్ గా ఉండి ఇంత నిర్లక్ష్యంగా ఉన్న అమ్మాయిని తననే చూస్తున్నా. ఒకసారి బొప్పాయి తిన్నది మరొక సారి డైటింగ్ పేరుతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడేమో ఇలా అసలు ఈ అమ్మాయిని చూస్తుంటే తల్లి అయ్యాననే ఆనందమే ఉండదు, కడుపుతో ఉన్నాననే సోయి ఉండదు.
ధాన్యలక్ష్మి: అత్తగా నువ్వే తనని చూసుకోవాలి కదా.
రుద్రాణి: నేను తన పక్కనే ఎప్పుడు ఎలా ఉంటాను.
Also Read: MD ( మై డార్లింగ్) - MH ( మై హార్ట్) అంటూ మురిసిపోయిన రిషిధార, శైలేంద్రకి ధరణి వార్నింగ్!
అపర్ణ: తాను చెప్పింది నిజమే ఎప్పుడు తన పక్కనే ఉండి బాగోగులు చూసుకునే విధంగా నర్స్ ని పెట్టడం మంచిది.
స్వప్న: బయట వాళ్ళు ఎందుకులే నాకు ఇబ్బందిగా ఉంటుంది. కావ్య ఉంది కదా నాకు సరిపోదు.
ధాన్యలక్ష్మి: మాకు సరిపోదు ఇప్పటికే పని మనిషి లేకపోవడం వల్ల ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది. ఇప్పుడు నీకు సేవలు చేస్తే ఎలా తను మరమనిషి కాదు.
కావ్య: అక్క కోసమే కదా చేస్తాను.
ఇంద్రాదేవి: నువ్వు పడుతున్న కష్టం చాలు. అపర్ణ చెప్పినట్టు నర్స్ ను చూసి పెట్టడం మంచిది.
అప్పు కళ్యాణ్ ని కలవడం కోసం ఒక షాపుకి వస్తుంది. అనామిక, కళ్యాణ్ సర్ ప్రైజ్ అని అనేసరికి అప్పు బిత్తరపోతుంది. తమ ఇద్దరినీ కలిపినందుకు అనామిక థాంక్స్ చెప్తుంది. తమకి సాయం చేసినందుకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్తారు. దీంతో అప్పు చేసేది లేక మౌనంగా ఉంటుంది. కళ్యాణ్ గిఫ్ట్ అప్పు చేతికి ఇస్తాడు. చీర బహుమతిగా ఇస్తారు. చీర కట్టుకుంటే అమ్మాయి బాపు బొమ్మలా ఉంటుందని అనామిక అంటుంది. అప్పు ఎప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉంటుందని కళ్యాణ్ అంటే అనామిక మాత్రం అమ్మాయిలు అలా పైకి మాత్రమే కనిపిస్తారని చెప్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం అనామిక అందాన్ని మెచ్చుకుంటూ అప్పుకి ప్రేమ లాంటివి ఏమి ఉండవని, అబ్బాయిలాగా కనిపిస్తుందని అంటాడు.
కళ్యాణ్: ఏ కోణంలో అయినా అమ్మాయిలా కనిపిస్తుందా? బ్రో లో సున్నితత్వం స్పందించే హృదయం కానీ ప్రేమించే మనస్తత్వం కానీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే రాయికి బ్రోకి పెద్ద తేడా లేదు. దానికి ప్రాణం ఉండదు బ్రోకి ప్రాణం ఉంటుంది. అంతే తేడా అని అన్న మాటలకు అప్పు ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఫోన్ వచ్చినట్టు నటించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్లిపోతుంటే కళ్యాణ్ చీర అనామిక దగ్గర నుంచి తీసుకుని అప్పుకి ఇస్తాడు. బయటకి వచ్చి అవే మాటలు తలుచుకుంటూ బాధపడుతుంది.
Also Read: MD సీట్లో వసుని కూర్చోబెట్టిన రిషి, దేవయాని-శైలేంద్రకి పెద్ద షాకే ఇది!
కావ్య కాలు నొప్పితో నడవలేక ఇబ్బంది పడుతూ పడబోతుంటే రాజ్ పట్టుకుంటాడు. ఏమైందని అంటాడు. అక్కని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు కాలు బెణికిందని చెప్తుంది. రాజ్ తనని ప్రేమగా తిట్టి తన చేతిని భుజం వేసుకుని జాగ్రత్తగా నడిపిస్తాడు. బెడ్ మీద కూర్చోబెట్టి కింద కూర్చుని కావ్య కాలు తన మీద పెట్టుకుని ఆయింట్ మెంట్ రాస్తాడు. అది ఇంద్రాదేవి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ సీన్ చాలా బాగుంటుంది. సీతారామయ్య వాళ్ళని చూసిన కావ్య ఇదంతా తాతయ్య వాళ్ళ కోసం చేస్తున్నాడా? ఈ ప్రేమ నిజమైతే ఎంత బాగుండేదోనని మనసులో అనుకుంటుంది. తనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత దేవుడి ముందు కూర్చుని తన బాధ చెప్పుకుంటుంది.
కావ్య: నా భర్త నా కాలు బెణికింది అనగానే మందు రాసి నొప్పిని దూరం చేశారు. కానీ మనసులో ఉన్న నొప్పిని ఎవరు దూరం చేస్తారు. మనం ఇష్టపడుతున్న మనిషి మనల్ని ఇష్టపడుతున్నట్టు నటిస్తున్నట్టు తెలిసి కూడా ఇష్టపడటం చాలా కష్టంగా ఉంది. ఆయన నా మీద చూపిస్తున్న ప్రేమకి సంతోషపడాలా లేదంటే దానికి ఆయువు లేదని బాధపడాలా? నా భర్త విషయంలో ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా చివరికి బాధే మిగులుతుంది. ఆయన నటిస్తేనే ఇంత ఆనందంగా ఉంది నిజంగా ప్రేమిస్తే ఇంక ఎంత బాగుంటుంది. ఆయన నటనని నిజం చేసి ప్రేమ వైపు నడిచేలా చెయ్యి. ఆయన మనసులో స్థానం దక్కేలా ఒక్క అవకాశం ఇవ్వు.
తరువాయి భాగంలో..
కనకం స్వప్నని పుట్టింటికి తీసుకెళ్తానని రుద్రాణిని అడుగుతుంది. త్వరగా తీసుకుని వెళ్లిపోండి కాపాలా కాయలేకపోతున్నామని అంటుంది. దీంతో ఇంద్రాదేవి ఏమి అభ్యంతరం లేకపోతే కనకాన్ని తమ ఇంట్లోనే ఉండి స్వప్నని చూసుకోమని అడుగుతుంది. తొందర్లోనే తనకి సీమంతం చేయాలని అనుకుంటున్నట్టు చెప్పేసరికి కనకం సంతోషపడుతుంది. కావ్య లేని కడుపుకి ఇన్ని ఆర్భాటాలు అవసరమా అమ్మకి వెంటనే నిజం చెప్పేయాలని మనసులో అనుకుంటుంది.