అన్వేషించండి

Guppedantha Manasu october 14th: MD ( మై డార్లింగ్) - MH ( మై హార్ట్) అంటూ మురిసిపోయిన రిషిధార, శైలేంద్రకి ధరణి వార్నింగ్!

Guppedantha Manasu Today Episode: కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతిని చంపేశారు.. ఇప్పుడు రిషి ఏం చేస్తాడో చూడాలి...

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంతమనసు అక్టోబరు 14 ఎపిసోడ్
ఎవ్వరూ ఊహంచని విధంగా వసుని ఎండీ సీట్లో కూర్చోబెట్టి శైలేంద్ర, దేవయాని కి షాకిచ్చాడు రిషి
రిషి: కొత్త ఎండీగారిని అందరూ స్వాగతిస్తారని అనుకుంటున్నా...తను నా భార్య అని మాత్రమే కాదు..ఈ సీటుకి అర్హురాలు అని ఈ సీట్లో కూర్చోబెట్టాను. జగతి మేడం దగ్గర పాఠాలు నేర్చుకుంది, ఎప్పుడు ఎలా ఉండాలో తనకు తెలుసు..సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోగలదు..ఈ సీటుకి వసుధార అయితే కరెక్ట్ అనిపించింది
ఫణీంద్ర: ఆ సీట్లో వసుధార ఉంటే నువ్వు ఉన్నట్టే కదా రిషి..తనను వెనుకుండి నడిపిస్తావు కదా
మినిస్టర్: రిషి ఎంత సమర్ధుడో వసుధార కూడా అంతే సమర్థురాలుట..ఏమంటారు శైలేంద్ర గారు
శైలేంద్ర: ఓకే ఓకే అని మొక్కుబడిగా అంటాడు
దేవయాని: వసుధార ఆడపిల్ల కదా..ఆ ప్లేస్ లో వసుధార కన్నా రిషి కానీ ఇంకెవరైనా ఉంటే బావుంటుంది
మినిస్టర్: ఇంతకు ముందు కాలేజీ బాధ్యతలు స్వీకరించిన జగతి కూడా లేడీనే కదా
రిషి: పెద్దమ్మా ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు..నాకుండాల్సిన బాధ్యతలు నాకున్నాయి.. వసుధారకి నేను అండదండలుగా ఉంటానని చెప్పి వసు చేయిపట్టుకుని తీసుకెళ్లి MD సీట్లో కూర్చోబెడతాడు..
వసు కూడా రిషి నిర్ణయానికి షాక్ అవుతుంది.. అందరూ సంతోషిస్తారు..శైలేంద్ర-దేవయాని మాత్రం కుళ్లుకుంటారు..
థ్యాంక్యూ MD ( మై డార్లింగ్) గారు అని రిషి అంటే... థ్యాంక్యూ MH ( మై హార్ట్) గారూ అని ఇద్దరూ మురిసిపోతుంటారు...  MH అంటే ఏంటని మినిస్టర్ అడిగితే.. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ అని కవర్ చేస్తుంది వసుధార...
కంగ్రాట్స్ చెప్పేసి మినిస్టర్ వెళ్లిపోతాడు.. అందరూ వెళ్లిపోతారు...

Also Read: MD సీట్లో వసుని కూర్చోబెట్టిన రిషి, దేవయాని-శైలేంద్రకి పెద్ద షాకే ఇది!

శైలేంద్ర-దేవయాని కూడా అక్కడే ఉంటారు.. వాళ్ల ముందు కావాలనే MD సీట్లో కూర్చుంటుంది
దేవయాని: ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉండేదానికి ఎక్కడికి వచ్చావో..నక్క తోక తొక్కి వచ్చినట్టున్నావ్.. మమ్మల్ని కాదని నువ్వు ఎలా నెగ్గుకువస్తావో చూద్దాం
వసు: అందరూ జగతి మేడంలా ఉండరు..మీరు ఓ దెబ్బ కొడితే నేను రెండు కొడతాను..మీ కోపానికి భయపడే దాన్ని కాదు.. మీరు చాలా డిస్సప్పాయింట్ అయినట్టున్నారు
శైలేంద్ర: ఇంత మొండితనం పనికిరాదు...
దేవయాని: ఈ సీట్లో కూర్చున్నావని విర్రవీగితే బావోదు..జాగ్రత్త అంటుంది
ఏంటి జాగ్రత్తలు చెబుతున్నారంటూ రిషి వస్తాడు
దేవయాని: ఈ బాధ్యతలు తీసుకున్నావు కదా జాగ్రత్త అని చెబుతున్నా అని కవర్ చేస్తుంది దేవయాని... 
దేవయాని-శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతారు

Also Read: అంతా ప్రేమమయం - నిజం తెలుసుకుని వసుకి ప్రామిస్ చేసిన రిషి!

MD గూరు మీరు వర్క్ చేసుకుంటే నేను వెళతానన్న రిషితో..నన్ను మీరు మనస్ఫూర్తిగానే ఇక్కడ కూర్చోబెట్టారా?
రిషి: నువ్వు అయితే ఈ ప్లేస్ కి కెరక్ట్ అందుకే ఈ నిర్ణయం
వసు: గతంలో కూడా ఇలాగే సీట్లో కూర్చోబెట్టారు..చాలా ఇబ్బందులు వచ్చాయి..ఇకపై అలాంటి రోజు రాకూడదు..
రిషి: లేదు వసుధారా..ఇకమీదట ఈ రిషి ఆవేశాలకు లొంగడు..ఓసారి ఆవేశపడి నాకు జీవితాన్నిచ్చిన అమ్మను దూరం చేసుకున్నాను.. ఇప్పుడు అదే ఆవేశంతో జీవితాన్ని పంచుకునే భార్యని దూరం చేసుకోలేను..నువ్వు చేసే ప్రతీదీ నాకోసమే అని నాకు అర్థమైంది..అది పైకి మంచిగా, చెడుగా ఎలాగైనా కనిపించవచ్చు..నా క్షేమం కోసమే అలా చేస్తావని అర్థం చేసుకున్నాను. అమ్మదూరం కావడంతో నాకు ఆవేశం ఎంత అనర్థమో తెలిసి వచ్చింది..ఇంకెప్పుడూ ఈ చేయి వదిలిపెట్టను..మనం ఎప్పటికీ కలిసే ఉంటాం..
వసు: మీ క్షేమం కోసం దాచిపెట్టడం వల్లే ఇలా జరిగింది..అది మంచి అయినా చెడు అయినా ఇకపై దాచిపెట్టను..
రిషి: ఒకవేళ దాచినా అది నాకోసమే అనుకుంటాను..నాతో పాటూ అమ్మ ఆశీర్వాదం కూడా నీకు తోడుగా ఉంటుంది కాలేజీ ప్రతిష్టను మళ్లీ పెంచాలి..గురువుని మించిన శిష్యురాలివి అనిపించుకోవాలి..
వసు: ఏం జరిగినా మీ సమక్షంలో మీ తోడుతోనే సాధ్యం అవుతుంది..
రిషి: ఇప్పుడు నువ్వు నా భార్యవి..ఈ మంగళసూత్రం మెడలో నువ్వు వేసుకోలేదు నేను కట్టాను.. రిషిధారల బంధం వేదమంత్రాల మధ్య ఏర్పడింది...

Also Read: శైలేంద్ర గురించి రిషికి క్లారిటీ ఇచ్చిన వసుధార - దేవయానిని వణికించిన మహేంద్ర!

ఇంటికి వచ్చిన శైలేంద్ర కోటు విసిరికొడతాడు...వసుధార ఎండీ అనే మాటని భరించలేకపోతాడు. ఇంతలో ధరణి వచ్చి కాఫీ తీసుకురావాలా అని అడుగుతుంది. నేను అడిగానా అని ధరణిపై ఫైర్ అవుతాడు..ఎందుకు కోపంగా ఉన్నారని అడిగితే మరింత మండిపడతాడు. నువ్వు తెలివితక్కువ దద్దమ్మవి నువ్వు నా బాధని తీర్చలేవు వెళ్లు అని అరుస్తాడు.
ధరణి: నాకు తెలివిలేదని అనుకుంటున్నారు కానీ మీ ప్రతి కదలికా నాకు తెలుసు..ఇకపై కుట్రలు ఆపేయండి
శైలేంద్ర: నేను అనుకున్నది జరిగేవరకూ నా ప్రయత్నం ఆగదు
ధరణి: ఎందుకింత దిగజారిపోతున్నారు..ఇలాంటి సమయంలో మీరు చేరానిది ఏమైనా చేస్తే జరగరానిది జరుగుతుందనే భయం ఉంది.. 
శైలేంద్ర: నిన్ను కొట్టడం కాదు.. చంపేయాలి
ధరణి: చంపడం మీకు కొత్తేం కాదు కదా చంపేయండి..మీరు చేసే నేరాలు ఘోరాలు చూడలేకపోతున్నా..జరిగిన నష్టం జరిగిపోయింది..ఇకనైనా రిషి వాళ్లకి ఎలాంటి అపాయం తలపెట్టవద్దు.. రిషివాళ్లు నలుగురికి మంచి చేసేవారు అలాంటివారికి చెడు చేయాలని చూడొద్దు
శైలేంద్ర: కట్టుకున్న మొగుడిని వదిలేసి వాళ్లని సపోర్ట్ చేస్తావేంటి..నువ్వే కాదు ఆ దేవుడు చెప్పినా నేను వినను..ఏం చేయాలో అదే చేస్తాను.. నేను చేస్తోంది యుద్ధం..
ధరణి: మీరు చేస్తోంది యుద్ధం కాదు మోసం..వెన్నుపోటు.. 
శైలేంద్ర: మృగానికి మెంటలెక్కితే ఎలా ఉంటుందో తెలుసా..నిజం ఎవరితోనైనా చెబితే ఇంట్లో వాళ్లంతా నెత్తుటితో తడిచిపోతారు
ధరణి: నిజాలు బయటపెట్టాలి అనుకుంటే ఎప్పుడో చెప్పేదాన్ని
శైలేంద్ర: నీకు అంత ధైర్యం ఉందా
ధరణి: చిన్నత్తయ్య వాళ్లపై ప్రేమతో ఆగాను...లేదంటే మీ నిజం బయటపెట్టడం ఎంతసేపు. 
శైలేంద్ర: నీ స్వార్థం కోసం ఆగిపోయావ్..నీ పుసుపు కుంకాల కోసం ఆగిపోయావ్
ధరణి: వీళ్లు జన్మలో మారరు..రిషి మనసు కుదుటపడిన తర్వాత అన్ని నిజాలు చెబుతాను..వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Embed widget