Guppedantha Manasu october 13th: MD సీట్లో వసుని కూర్చోబెట్టిన రిషి, దేవయాని-శైలేంద్రకి పెద్ద షాకే ఇది!
Guppedantha Manasu Today Episode: కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతిని చంపేశారు.. ఇప్పుడు రిషి ఏం చేస్తాడో చూడాలి...
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంతమనసు అక్టోబరు 13 ఎపిసోడ్
రిషి అభిప్రాయం తెలుసుకునేందుకు దేవయాని-శైలేంద్ర కబురుపెడతారు. హాల్లో రిషికోసం వెయిట్ చేస్తుంటారు..ఇంతలో రిషి వస్తాడు
దేవయాని: కాలేజీకి సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నావ్
రిషి: నా అభిప్రాయం నేను చెప్పాను కదా
దేవయాని: ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆ బాధ్యతలు తీసుకుంటావా లేదంటే ఎవరినైనా కూర్చోబెడతావా
శైలేంద్ర: నిజమే రిషి..ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆ సీట్లో కూర్చుని బాధ్యతలు నెరవేర్చగలవా
దేవయాని: నువ్వు కాకపోతే ఆ సీట్లో మీ అన్నయ్య మాత్రమే కూర్చోగలడు.. నీ అంత తెలివైనవాడు..జగతి ఉన్నప్పుడే కాలేజీ చేజారిపోయే పరిస్థితి వచ్చింది అలాంటిది ఇప్పుడు ఎండీ సీటు ఖాళీగా ఉంటే మరింత ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది
శైలేంద్ర: నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు..కానీ నువ్వు చెబితే నీకోసం మన కాలేజీ కోసం ఎండీ పదవిపై కూర్చుంటాను
దేవయాని: అది రిషి సీటు నాన్నా..తను కూర్చుంటేనే బావుంటుంది
శైలేంద్ర: రిషి అయిష్టంగా ఉంటేనే ఆ బాధ్యతను చేపడతాను
దేవయాని: కాలేజీని నడపడం అంటే ఆషామాషీ కాదు..
శైలేంద్ర: నువ్వు ఆ సీట్లో కూర్చోను అంటే..మనింట్లో వాళ్లనే ఎంచుకో..వేరే బోర్డు మెంబర్స్ గురించి ఆలోచించవద్దు..
రిషి: సరే అన్నయ్యా నీ మాట మేరకే నిర్ణయం తీసుకుంటాను
ఇంతలో వసుధార వచ్చి..సర్ మనసులో ఓ ఆలోచన ఉంటుంది, ఏది మంచో ఏది చెడో గ్రహించి ముందుకు వెళతారు..ఆయన నిర్ణయం తీసుకుంటారు మీరు కంగారుపడకండి...
రిషి: నిజమే వసుధారా..జీవితంలో పడే ప్రతికష్టం ఏదో ఒకటి నేర్పుతుంది. అమ్మచావు కూడా ఆవేశం తగ్గించుకోమని నేర్పించింది..ఈ విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకుంటాను..
Also Read: అంతా ప్రేమమయం - నిజం తెలుసుకుని వసుకి ప్రామిస్ చేసిన రిషి!
మీరు వెళ్లండి సార్ కిచెన్లో చిన్న పని ఉంది..మీరు వెళ్లండి వస్తానని చెప్పి రిషిని పంపించేసి...దేవయాని-శైలేంద్ర దగ్గరకు వస్తుంది
వసుధార: కొత్తగా ఏవో ప్లాన్ చేస్తున్నట్టున్నారు
శైలేంద్ర: నేను మధ్యలో టార్గెట్లు మార్చుకోను...
దేవయాని: ఈ గొడవలన్నీ ఎందుకు..ఎండీ సీటు ఒక్కటీ తనకు దక్కితే ఇవన్నీ ఉండవు..అప్పుడు మీరుకూడా ప్రశాంతంగా ఉంటారు
వసు: అది అసాధ్యం...
దేవయాని: కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు వ్యవహరించాలి..ఇలా అయితే ఎలా.. జగతి దూరమైందని రిషి కుంగిపోతున్నాడు.. నువ్వు తన గురించి పట్టించుకో కానీ కాలేజీ వ్యవహారాలన్నీ నీకు అనవసరం..
వసు: ఏం మాట్లాడుతున్నారు మేడం.. డీబీఎస్టీ కాలేజీ రిషి సార్ ప్రాణం..తాత్కాలికంగా ఆయన కాలేజీకి దూరంగా ఉండొచ్చు కానీ ఎప్పటికీ రిషి సార్ దే.ఎండీ సీట్లో కూర్చునే అర్హత రిషి సార్ కి మాత్రమే ఉంది
శైలేంద్ర: చెప్పినా వినిపించుకేవేం...ఏ క్షణం ఏమైనా జరగొచ్చు..పిన్ని చనిపోయినట్టే రిషి కూడా చనిపోతాడేమో...
వసు: షటప్..ఏం మాట్లాడుతున్నారు
శైలేంద్ర: అందుకే ఈ గొడవలు కాలేజీ వదిలేసి మాకు దూరంగా ఎక్కడైనా బతకండి.. మా ఫ్రెండ్ తో మాట్లాడి సిటీ ఔట్ కట్స్ లో ఓ విల్లా ఇప్పిస్తాను..అక్కడ చాలా సౌకర్యాలున్నాయి..అందులో నీకొక విల్లా ఇప్పించనా
వసు: మీరు అతి ఉత్సాహం చూపిస్తున్నారు అలాంటిదేమీ ఆశించకండి.. జగతి మేడంకి జరిగినట్టే రిషి సార్ కి జరుగుతుందంటే బెదిరిస్తున్నారా
చూడండి..మీకు రోజులు దగ్గర పడ్డాయ్..ఓ వైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది..జగతి మేడం చావువెనుక ఉన్నది మీరేనని నాకు తెలుసు కానీ ఓ చిన్న క్లూ కోసం వెతుకుతున్నాను అది ఒక్కటి దొరికితే మీ పరిస్థితి ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంటుంది.. ఆధారం దొరికే వరకే మీ ఆయుష్షు అని హెచ్చరించి వెళ్లిపోతుంది వసుధారా..
రిషి నా మాట ప్రకారమే మనింట్లో వాళ్లనే ఎండీ సీట్లో కూర్చోబెడతా అన్నాడుగా..నేను తప్ప ఎవరున్నారులే అనుకుంటారు దేవయాని-శైలేంద్ర..
Also Read: శైలేంద్ర గురించి రిషికి క్లారిటీ ఇచ్చిన వసుధార - దేవయానిని వణికించిన మహేంద్ర!
కాలేజీలోకి రిషి ఎంట్రీ ఇవ్వడంతో స్టూడెంట్స్ అందరూ గ్రాండ్ వెల్ కమ్ చెబుతారు.. కానీ రిషి మాత్రం కార్లోంచి కిందకు దిగకుండా ఆలోచిస్తాడు.. వసుధార రమ్మని పిలవడంతో రిషి కిందకు దిగుతాడు.. రిషి ఎండీగా ఉండాలని అందరూ నినాదాలు చేస్తారు. దేవయాని-శైలేంద్ర మాత్రం కాసేపట్లో ఎండీ సీటు దక్కుతుందని ఆనందంగా ఉంటారు. ఇంతలో మినిస్టర్ కూడా వస్తాడు.. వెళ్లి రిసీవ్ చేసుకుంటారు..
మహేంద్ర కనిపించడం లేదని మినిస్టర్ అడిగితే ఈ సమయంలో ఆయన ఉండాలి కదా అంటాడు మినిస్టర్. ఇంకా కోలుకోలేదని రిషి చెబుతాడు. అందరూ కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చుంటారు..
మినిస్టర్: అందరం రిషి ఎండీగా ఉండాలని కోరకున్నాం..తనే సమర్థుడు కూడా..తను మాత్రం ఆ పదవిని చేపట్టను అంటున్నాడు అందుకే వేరేవాళ్లు ఈ స్థానంలోకి వస్తున్నారు
శైలేంద్ర గుడ్ న్యూస్ వింటాననే ఆనందంలో ఉంటాడు..
మినిస్టర్: వాళ్లు ఎవరు ఏంటనేది రిషి నిర్ణయం తీసుకున్నాడు..కానీ నా ద్వారా అనౌన్స్ చేయాలని వారి పేరు రాసి కవర్ ఇచ్చాడు.. ఇందులో ఎవరి పేరుందో నాక్కూడా తెలియదు..మీలాగే నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను...
బోర్డు మెంబర్స్ అందరూ కూడా..రిషి ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే అంటారు... శైలేంద్ర మీకు ఓకేనా అని మినిస్టర్ అడిగితే.. నాక్కూడా ఓఖే అంటాడు శైలేంద్ర...
ఇందులో ఎవరి పేరు ఉందంటే అని మొదలుపెట్టి... కాసేపు సస్పెన్స్ మెంటైన్ చేసి...ఈ రోజు నుంచి ఈ కాలేజీ ఎండీ బాధ్యతలు చేపట్టబోయేది మరెవరో కాదు వసుధార అని అనౌన్స్ చేస్తాడు మినిస్టర్..
రిషి: తను నా భార్య అనే అర్హతతో ఈ సీట్లో కూర్చోబెట్టడం లేదు..ఎండీ స్థానంలో కూర్చునే అర్హత ఉందనే ఎంపిక చేశానంటాడు
దేవయాని-శైలేంద్రకి బిగ్ షాక్...