Brahmamudi August 9th: 'బ్రహ్మముడి' సీరియల్: కావ్య వీడియో వైరల్, మండిపడ్డ అపర్ణ- కళావతి కాంట్రాక్ట్ పోయేలా చేసిన రాజ్
పుట్టింటికి వచ్చిన కష్టం తీర్చడం కోసం కావ్య తన తల్లిదండ్రులకి అండగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య పుట్టింట్లో బొమ్మలు రెడీ చేసేందుకు మట్టి తొక్కుతూ ఉంటుంది. ఆ వీడియోని రాహుల్ చూసి తను చెప్పినట్టుగా చేయమని మరొక వ్యక్తికి పురమాయిస్తాడు. వీడియోని అడ్డం పెట్టుకుని ఇంట్లో యుద్దం క్రియేట్ చేయాలని రుద్రాణి అనుకుంటుంది. ఇక అనామిక ఇచ్చిన పేరు పజిల్ ని కనిపెట్టడం కోసం కళ్యాణ్ తిప్పలు పడతాడు. అప్పుడే కోయదొర వచ్చి కళ్యాణ్ చేతిని చూసి కాసేపు మాట్లాడి వెళతాడు. అయితే ఆ అమ్మాయి పేరు రేఖ అయి ఉంటుందని అనుకుంటాడు. చేతిలో రేఖ అంటే గీత అయి కూడా ఉంటుంది కదా అని అప్పు అనేసరికి అవును కదా బిక్క మొహం వేస్తాడు. ఇక ఇంట్లో మంట పెట్టేందుకు రుద్రాణి, రాహుల్ రెడీ అవుతారు. హాల్లో అందరూ కూర్చున్నప్పుడు కావ్య గురించి మీడియాలో వస్తున్న వీడియో చూపిస్తుంది.
ఇదొక దయనీయమైన గాథ. మట్టి పని చేస్తూ రోజువారీ కూలీగా పని చేస్తుంది. దుగ్గిరాల ఇంటి కోడలి దీన స్థితి ఇది. అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా కన్న తండ్రితో కలిసి ఇటువంటి పని చేస్తుందని మీడియాలో కావ్య గురించి చెప్తూ ఉంటారు. అది చూసి అపర్ణ కోపంతో రగిలిపోతుంది.
అపర్ణ: పుట్టింటికి డబ్బులు చేరవేస్తుందని చెప్పి నిలదీశామని ఇలా చేస్తుందా?
Also Read: అపర్ణ దుమ్ముదులిపిన కావ్య- ఉద్యోగం ఆఫర్ చేసిన రాజ్, వద్దని చెప్పేసిన కళావతి
రుద్రాణి: మీడియా కవరేజ్ కూడా కావ్య చేయించే ఉంటుంది
అపర్ణ; నా మనవరాలని అలుసు ఇచ్చారు. ఇప్పుడు చూశారా దుగ్గిరాల ఇంటికి ఎలా అప్రదిష్ట తీసుకొచ్చిందో. ఇప్పుడు నేను తనని ఎలా ఇంట్లోకి రానివ్వాలి
కళ్యాణ్ ని గమనిస్తున్న అనామిక అక్కడ ఉన్న కిరాణా షాపుకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుతో కళ్యాణ్ మాట్లాడిన మాటలన్నీ విన్నానని చెప్తుంది. ఆ అమ్మాయి కళ్యాణ్ ని దూరం నుంచి గమణిస్తూనే ఫోన్ మాట్లాడి నెంబర్ ఇస్తుంది. కానీ అందులో చివరి నెంబర్ మాత్రం చెప్పకుండా కనిపెట్టమని మళ్ళీ పజిల్ విసురుతుంది. మేనేజర్ వచ్చి కావ్యకి సంబంధించిన వీడియో రాజ్ కి చూపిస్తాడు. ఆ వీడియో చూసి రాజ్ కోపంతో రగిలిపోతూ ఆవేశంగా ఇంటికి బయల్దేరతాడు. కావ్య షాపులోకి కావలసిన బొమ్మలు రెడీ చేస్తుంది. తన కూతురి చేసిన బొమ్మలు అద్భుతంగా ఉన్నాయని కృష్ణమూర్తి సంతోషపడతాడు. ఇక కావ్య ఇంటికి వెళ్ళేసరికి అందరూ గరం గరంగా ఉంటారు. ఏమైందని కావ్య ధాన్యలక్ష్మిని అడుగుతుంది. తనవల్ల ఏదైనా తప్పు జరిగిందా అని అంటుంది. రుద్రాణి కావ్య మట్టి తొక్కుతున్న వీడియో చూపిస్తుంది.
కావ్య: నా పుట్టింటికి వచ్చిన కష్టం తీర్చి వాళ్ళని ఆదుకోవడానికి నేను చేసిన ప్రయత్నం అది. మీరంతా ఇంకొక కోణం నుంచి చేసి నన్ను దోషిని చేసి నిలబెడితే ఏం మాట్లాడాలో తెలియడం లేదు
అపర్ణ: నువ్వు ఇప్పుడు లోకం దృష్టిలో ఈ ఇంటి కోడలివి. నా కొడుకు నిన్ను భార్యగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచం నిన్ను ఈ ఇంటికి పంపించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి కష్టపడుతూ ఈ ఇంటి పరువు తీస్తుంటే ఏమనాలి. నువ్వు తప్పు చేస్తే ప్రతి ఒక్కరూ ఇంటి పెద్దల్ని ప్రశ్నిస్తారు
Also Read: కృష్ణ, మురారీలని కలిపుతానని మాట ఇచ్చిన నందు- చిన్నకోడలికి పట్టాభిషేకం చేసిన భవానీ
కావ్య: కష్టపడటం తప్పు ఎలా అవుతుంది? కళ అనేది ప్రవృత్తి అని తెలుసుకోండి
రాజ్: ఏం తెలుసుకోమంటావ్.. చెప్పు. నీ ప్రవృత్తి వల్ల నీకు మానసిక ఆనందం మాత్రమే వస్తుందా డబ్బు రావడం లేదా?
కావ్య: వస్తుంది.