అన్వేషించండి

Brahmamudi August 4th: 'బ్రహ్మముడి' సీరియల్: ఇంటిని కాపాడుకున్న కావ్య- అపర్ణ దగ్గర చెల్లిని అడ్డంగా బుక్ చేసిన స్వప్న

కావ్య పుట్టింటికి సాయం చేస్తున్న విషయం స్వప్న అపర్ణకి తెలిసేలా చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కడుపు నొప్పి ట్యాబ్లెట్స్ కావ్య అడిగితేనే తెప్పించానని స్వప్న రుద్రాణి వాళ్ళతో అబద్ధం చెప్తుంది. కావ్య కూడా ఆ మాటకి తల ఊపడంతో రుద్రాణి కోపంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్లిపోగానే కావ్య స్వప్నని గదిలోకి లాక్కుని వస్తుంది.

స్వప్న: నాకు నువ్వు అనవసరంగా క్లాస్ పీకొద్దు

కావ్య: నువ్వు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నావో అర్థం అవుతుందా?

స్వప్న: దొరకలేదు కదా

కావ్య: నిజం చెప్పు.. ఇన్నాళ్ళూ నువ్వే తప్పు తెలుసుకుని నిజం బయట పెడతావ్ అనుకున్నా. కానీ ఇక నా వల్ల కాదు ఈ ఇంట్లో నిజం తెలిసిపోతే నీతో పాటు అమ్మానాన్నని కూడా నిందిస్తారు. కడుపు నాటకం ఆడి రాహుల్ ని పెళ్లి చేసుకున్నావ్ అంటారు. ఇప్పటికే నీ పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెట్టి ఆ వడ్డీ డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదో సమయానికి యాభై వేలు సహాయం చేయడం వల్ల వడ్డీ డబ్బులు కట్టడానికి వెళ్తున్నా. నీ పొగరు నా దగ్గర చూపించకు. నువ్వేం చేసిన భరించడానికి ఒకప్పటి కావ్యని కాదు. ఇక్కడ నీ మీద చెయ్యి చేసుకుంటే ఆపడానికి ఎవరూ రారు. ఇన్ని రోజులు నీకు టైమ్ ఇచ్చాను ఇక నా వల్ల కాదు. ఈరోజు నీ అంతట నువ్వే కడుపు లేదని అందరికీ చెప్పాలి. నేను అమ్మ దగ్గరకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి చెప్పాలి.

Also Read: అత్తింట్లో అడుగుపెట్టిన దివ్య- యుద్ధం మొదలుపెట్టిన తులసి, ఇక రాజ్యలక్ష్మికి చుక్కలే

స్వప్న: చెప్పకపోతే

కావ్య: నేనే చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త

కనకం ఇంట్లో సేటు, ఇల్లు కొనేందుకు సీతారామం ఉంటారు. అప్పు ఇద్దరి మీద విరుచుకుపడుతుంది. మనకి డబ్బు అవసరం ఉందని ఇంటిని అమ్ముతున్నామని కృష్ణమూర్తి చెప్పేస్తాడు. 22 లక్షలకు ఇల్లు అమ్ముతున్నట్టు సంతకాలు పెట్టి పది లక్షలు అడ్వాన్స్ తీసుకోమని సీతారామం పేపర్స్ ఇస్తాడు. కృష్ణమూర్తి వాటి మీద సంతకాలు పెట్టె టైమ్ కి కావ్య వచ్చి ఆపుతుంది. ఇల్లు అమ్ముతున్నారా అంటే తప్పడం లేదని బాధగా చెప్తాడు. ఇంటి అప్పుని ఆరు నెలలోపు కడతానని ఇల్లు అమ్మే ప్రసక్తే లేదని కావ్య చెప్తుంది. సేటుకి యాభై వేలు ఇచ్చి పంపించేస్తుంది.

కృష్ణమూర్తి: ఎందుకు ఆ అప్పు నువ్వు కడతానని అన్నావ్. అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకొస్తావ్

కావ్య: అసలు నీకు ఇల్లు అమ్మాలని ఎలా అనిపిస్తుంది. మా చిన్ననాటి జ్ఞాపకాలు ఈ ఇంటితోనే ముడిపడి ఉన్నాయని తనకు ఇంటితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతుంది. అన్ని సర్దుకుంటాయని దిగులు పడొద్దని తల్లిదండ్రులుకు కావ్య ధైర్యం చెప్తుంది. స్వప్న కావ్య బెదిరించిన విషయం గుర్తు చేసుకుని రగిలిపోతుంది. దీని నుంచి బయట పడేందుకు అపర్ణ దగ్గర కావాలని కావ్యని ఇరికించాలని చూస్తుంది. రాజ్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి తప్పు చేశావ్.. దాన్ని అస్త్రంగా వాడి ఇంట్లో వాళ్ళ దగ్గర ఇరికించాలని అనుకుంటుంది. అప్పుడే అపర్ణ ఫోన్ మాట్లాడుతూ అటు వస్తుంది.  తన ముందు కావాలని కనకంతో ఫోన్ మాట్లాడినట్టు నటిస్తుంది.

Also Read: నందుకి తన ప్రేమ గురించి చెప్పిన మురారీ- అగ్రిమెంట్ సంగతి భవానీకి చెప్పాల్సిందేనన్న కృష్ణ

స్వప్న: ఏంటమ్మా నన్ను ప్రశాంతంగా కాపురం చేసుకొనివ్వరా? మీరు ఇలా తప్పులు మీద తప్పులు చేస్తే అత్తారింట్లో నా పరువు ఏం కావాలి. అయినా మీకు ఎన్ని సార్లు చెప్పాను కావ్యని డబ్బులు అడగొద్దని. మీరు అడగటమే ఆలస్యంగా ఆ కావ్య కూడా రాజ్ ని ఎమోషనల్ గా మాయ చేసి డబ్బు తీసుకొచ్చి మీకు ఇస్తుంది. ఇప్పుడు కూడా మీదగ్గరకె వచ్చిందంట కదా.. యాభై వేలు కావాలని అంటే రాజ్ దగ్గర తీసుకొని తెచ్చి ఇచ్చిందంట కదా. మీరు చేసే తప్పులు వల్ల మా సంసారం చిక్కుల్లో పడుతుంది. అపర్ణ ఆంటీ మంచిది కాబట్టి కావ్యని కోడలిగా ఈ ఇంట్లో ఉండనిస్తుంది. అంత మంచి అత్తని మోసం చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది. ఇంకొకసారి రాజ్ కి మాయ మాటలు చెప్పి ఈ ఇంటి నుంచి ఒక్క రూపాయి తీసుకెళ్లినా ఒప్పుకోను నిజాన్ని బయట పెట్టేస్తాను అనేసి కాల్ కట్ చేసినట్టు బిల్డప్ ఇస్తుంది.

అపర్ణని చూసి కొత్త డ్రామా మొదలుపెడుతుంది. కావ్య వేసిన డిజైన్స్ క్లయింట్స్ కి నచ్చడంతో రాజ్ సంతోషపడతాడు. వాళ్ళు కాసేపు కావ్యని మెచ్చుకునేసరికి రాజ్ కుళ్ళుకుంటాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
Embed widget