అన్వేషించండి

Krishna Mukunda Murari August 3rd: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: నందుకి తన ప్రేమ గురించి చెప్పిన మురారీ- అగ్రిమెంట్ సంగతి భవానీకి చెప్పాల్సిందేనన్న కృష్ణ

నందుకి మురారీ తమది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ డల్ గా ఉండేసరికి మురారీ అలా ఉండొద్దని అడుగుతాడు. నన్ను ఇలా మార్చింది మీరే.. నాకు మనసు ఉంటుంది కదా మీ మనసులో నాకు చోటు లేదని తెలిసి బాధ లేకుండా ఎలా ఉంటుందని మనసులో అనుకుంటుంది. ఇద్దరూ కాసేపు ఒకరి ప్రేమ గురించి మరొకరు మనసులోనే మాట్లాడుకుంటారు. అప్పుడే నందు వచ్చి పలకరిస్తుంది. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా గౌతమ్ వచ్చి తనని తీసుకుని వెళతాడు. గౌతమ్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తాడు. గౌతమ్ వెళ్ళిపోయిన తర్వాత సన్మానం నుంచి మురారీ ఎందుకు వెళ్లిపోయాడో అడిగి తెలుసుకోవాలని నందు అనుకుంటుంది. ముకుంద మురారీ, కృష్ణ పెళ్లి జరగనివ్వకూడదని అనుకుంటుంది. తనని దాటుకుని పెద్దత్తయ్య ఈ పెళ్లి చేయలేదని ధైర్యంగా ఉంటుంది.

నందు: ఏంటి కృష్ణ ఏమైంది మీకు మునుపటిలాగా మీరు లేరు

మురారీ: నందుకి డౌట్ వచ్చింది ఏదో ఒకటి చెప్పాలని తనని పక్కకి తీసుకుని వెళతాడు

నందు: ఎందుకు పక్కకి తీసుకొచ్చావ్. నిన్ను చాలా అడగాలని అనుకున్నా కానీ అందరి ముందు ఎందుకని ఆగిపోయాను

మురారీ: అలా ఏమీ లేదు బాగానే ఉన్నాం కదా

Also Read: అదిరిపోయిన ఎపిసోడ్.. మాళవిక అవుట్- వేద మమ్మీ దగ్గరే ఉంటానన్న ఆదిత్య

నందు: నటించకు మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. పైకి చెప్పుకోలేని బాధ ఉంది అవునా.. కాదా?

మురారీ: ఇంకొక పదకొండు రోజుల్లో కృష్ణ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది

నందు: ఏం మాట్లాడుతున్నావ్ తను ఎందుకు వదిలేసి వెళ్తుంది

మురారీ: నిజం.. మీరంతా అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఏ బంధం లేదు. మేం నిజంగా భార్యాభర్తలం కాదు. మాది అగ్రిమెంట్ మ్యారేజ్

నందు: నువ్వు కృష్ణని బాధ్యత అనుకున్నావా? తనని ప్రేమించలేదా?

మురారీ; అలా అనుకుంటే హాస్టల్ లో పెట్టేవాడిని కదా. నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ తన మనసు గెలుచుకోలేకపోయాను

నందు: నువ్వు ప్రేమిస్తున్నావని కృష్ణకి తెలిస్తే నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్లదు

మురారీ: లేదు నందు తనకి నేనంటే గౌరవం మాత్రమే.. ఇష్టం లేదు. తనకి నేను పెట్టిన డబ్బు అంతా లెక్కగట్టి ఇచ్చింది. అందులో తన తప్పు లేదు వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం డాక్టర్ అయ్యింది. నేనే ఆశలు పెంచుకున్నా. ఇప్పుడు నా ప్రేమ చెప్పి తన లక్ష్యాన్ని దూరం చేయలేను. కేవలం తనకి నా మీద అభిమానం ఉంది

నందు: నేను తనతో మాట్లాడి చూస్తాను

మురారీ: ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఇవి ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే

Also Read: కావ్య కష్టం తీర్చిన రాజ్, మురిసిన కళావతి- కళ్యాణ్ కి ప్రేమ లేఖ

నందు: మీరిద్దరూ కొన్ని రోజుల్లో విడిపోతున్నారంటే తట్టుకోలేకపోతున్నా

వాళ్ళని కృష్ణ చూసి ఏమైందని డౌట్ పడుతుంది. మురారీని పిలుస్తుంది. నందు ఎందుకు డల్ గా ఉందని అడిగితే ఆదర్శ్ గుర్తుకు వచ్చాడని అబద్ధం చెప్తాడు. అగ్రిమెంట్ గురించి పెద్దత్తయ్య వాళ్ళతో చేప్పేద్దామని అంటుంది. వద్దని అంటాడు.

కృష్ణ: ఎందుకు వద్దు ఎన్నాళ్ళు ఈ నాటకం. వాళ్ళు మనల్ని నిజంగానే భార్యాభర్తలు అనుకుంటున్నారు. తాళి పెరిగిందని నిజంగానే మనకి పెళ్లి చేస్తున్నారు. మీకు ఇది ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా గిల్టీగా ఉంది. మీకు ఇది ఇష్టం లేకపోయినా మా నాన్నకి ఇచ్చిన మాట కోసం బాధ్యత నెరవేర్చారు. అందరికీ మన అగ్రిమెంట్ గురించి చెప్పేద్దాం. ఇంత మంచి వాళ్ళని మోసం చేయడం నాకు నచ్చడం లేదు. ఏం జరుగుతుందో జరగనివ్వండి. పెద్దత్తయ్య శిక్ష వేసినా భరిస్తాను అంతే కానీ వాళ్ళని మోసం చేయలేను

మురారీ: నువ్వు ఎవరినీ మోసం చేయడం లేదు. పరిస్థితుల వల్ల అది మనం వేసుకున్న ముసుగు. నీ జీవితం బాగుండటం కోసం ఈ నిజాన్ని దాస్తూ వచ్చాను

కృష్ణ: పెద్దత్తయ్య వాళ్ళకి నిజం తెలిస్తే ఒకేలాగా రియాక్ట్ అవుతారు. ఎప్పుడో చెప్పడం ఎందుకు ఇప్పుడే నిజం చెప్పాలి

మురారీ: పెద్దమ్మకి మన అగ్రిమెంట్ విషయం నేనే చెప్తాను కానీ దయచేసి నువ్వు మాత్రం చెప్పకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి  

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today November 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్ ఏజెన్సీకి రామరాజు పేరు! వల్లీ రాకతో మండిపోయిన చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ట్రావెల్ ఏజెన్సీకి రామరాజు పేరు! వల్లీ రాకతో మండిపోయిన చందు!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 13:అనసూయ వేరొకరని ప్రేమించిందని భరత్‌కు తెలిపిన రాధ...ఎంగేజ్‌మెంట్ ఆపిస్తానని హామీ
నువ్వులేక నేను లేను: అనసూయ వేరొకరని ప్రేమించిందని భరత్‌కు తెలిపిన రాధ...ఎంగేజ్‌మెంట్ ఆపిస్తానని హామీ
Gundeninda Gudigantalu Nov13:అరుణ్‌తో సుమతి పెళ్లికి ససేమీరా అంటున్న బాలు..అరుణ్‌ తల్లికి కుదరదని చెప్పేసిన మీనా కుటుంబం
గుండెనిండా గుడిగంటలు: అరుణ్‌తో సుమతి పెళ్లికి ససేమీరా అంటున్న బాలు..అరుణ్‌ తల్లికి కుదరదని చెప్పేసిన మీనా కుటుంబం
Podarillu Serial Today NoV 13: నారాయణ అండ్‌ సన్స్‌ అంటూ కేశవ్‌ షాపు పేరు పెట్టించిన మహా...కన్నా మినహా కుటుంబం ఆనందం
పొదరిల్లు: నారాయణ అండ్‌ సన్స్‌ అంటూ కేశవ్‌ షాపు పేరు పెట్టించిన మహా...కన్నా మినహా కుటుంబం ఆనందం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Embed widget