Ennenno Janmalabandham August 3rd: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: అదిరిపోయిన ఎపిసోడ్.. మాళవిక అవుట్- వేద మమ్మీ దగ్గరే ఉంటానన్న ఆదిత్య
మాలిని మీద మాళవిక హత్యా ప్రయత్నం చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
స్పృహ లేకుండా పడిపోయి ఉన్న మాలినికి వేద సీపీఆర్ చేసి బతికించుకుంటుంది. తను కళ్ళు తెరవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. తను ప్రాణాలతో బయట పడేసరికి మాళవిక షాక్ అయిపోతుంది. ఏమైంది కింద పడి పోయి ఉన్నావ్ ఏంటని యష్ అడిగేసరికి మాలిని మాళవిక వైపు చెయ్యి చూపిస్తుంది. అప్పుడే తన చేతిలో నుంచి ఇన్ హ్యాలర్ కింద పడిపోతుంది. అది వేద చూసి నివ్వెరపోతుంది. యష్ ఉగ్రరూపం దాలుస్తాడు. మాళవిక సైలెంట్ గా వెళ్లిపోతుంటే యష్ కోపంగా పిలుస్తాడు. మాలిని దగ్గర రత్నాన్ని పెట్టి వేద కూడా యష్ వెనుక వెళ్తుంది. మాళవికని లాగి పెట్టి పీకుతాడు. ఆవేశంగా వెళ్ళి గన్ తీసుకొచ్చి తన తలకి గురి పెడతాడు. పిల్లలు సహా అందరూ భయపడిపోతారు. వేద యష్ కి అడ్డుపడుతుంది.
వేద: పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి. తల్లిని హత్యని చేసి తండ్రి జైలుకి వెళ్ళాడు అంటే పసిపిల్లల మీద ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎవరిని నువ్వు చంపాలనుకుంది ఒకనాటి మీ అత్తని. నిన్ను చేరదీసిన ఆమెని చంపాలని అనుకున్నావా? నువ్వు అసలు మనిషివేనా? నీ గురించి ఇంత నీచంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది
కాంచన: నాకు కూడా చాలా మాయ మాటలు చెప్పాలని చూసింది. వెంటనే దీన్ని పోలీసులకు పట్టించాలి
వేద: వద్దు జైలుకి వెళ్ళినా అక్కడ అంతా పొల్యూట్ చేస్తుంది
Also Read: కావ్య కష్టం తీర్చిన రాజ్, మురిసిన కళావతి- కళ్యాణ్ కి ప్రేమ లేఖ
వసంత్: నేను వీళ్ళంత మంచివాడిని కాదు. నిన్ను చూసిన పాపమే. దేవాలయం లాంటి ఇంట్లో నీకు చోటు దొరికింది. దీన్నే కూల్చేయాలని అనుకున్నావ్. నీలాంటి మానవత్వం లేని మనిషికి తమ్ముడిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం
మాలిని: కొన ప్రాణాలతో ఉన్నాను. చనిపోయానని వదిలేశావ్ నీకోక నమస్కారం
మాళవిక: నన్ను క్షమించండి
మాలిని: హంతకులని క్షమించేంత పెద్ద మనసు నాకు లేదు
మాళవిక: ఆ క్షణంలో నా ఒంట్లో ఏదో పూనుకుని నేను ఏం చేస్తున్నానో నాకే తెలియకుండా అలా ప్రవర్తించాను. మీరందరూ నన్ను క్షమించండి
యష్: నోర్ముయ్ అన్నీ నాటకాలు అని తెలిసిపోయాక ఇంకా ఏం చేయాలని చూస్తున్నావ్
రత్నం: మాళవిక దేనికైనా తెగించే నీచమైన క్యారెక్టర్. కాస్తలో తప్పిపోయింది లేదంటే ఈ ఇంట్లో..
వేద: అత్తయ్య ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు. మాళవిక ప్రాణాలు తీసి మీ భవిష్యత్ ఎందుకు నాశనం చేసుకోవాలి. తననే పంపించేద్దాం
యష్: ఇది బయటకి వెళ్తే శవంగానే పోవాలి
వేద: తన ఒంటి మీద చెయ్యి వేసి మనకి ఎందుకు చెడ్డ పేరు. తను బయటకి వెళ్లిపోతే తను ఎవరో మనం ఎవరో.. అనేసి
Also Read: దివ్య, విక్రమ్ జీవితాలతో విడాకుల ఆట ఆడుతున్న లాస్య- తప్పు కూతురిదేనని తిట్టిన తులసి
ఇక మాళవికని ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తుంది. ఆరోజు నువ్వు చెత్త కుప్పలో దీనంగా పడి ఉంటే అందరినీ ఒప్పించి ఇంట్లో పెట్టాను. కానీ నువ్వు ఇంట్లో మనిషి మీద హత్యా ప్రయత్నం మొదలుపెట్టావ్. అలాంటి నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు.
మాళవిక: నా కొడుకు కూడా ఉండాలసిన అవసరం లేదని ఆడిత్యని పిలుస్తుంది. వెళ్దాం రా ఆది
ఆదిత్య: నేను నీతో రాను మమ్మీ. నువ్వు నానమ్మని చంపాలని అనుకున్నావ్. నువ్వు బ్యాడ్ మమ్మీవి. నేను వేద మమ్మీతోనే ఉంటాను అనేసరికి మాళవిక ఏడుస్తూ వెళ్ళిపోతుంది.
నీలాంబరి బొమ్మని చూపించి పిల్లాడు రాత్రి నుంచి పాలు తాగడం లేదని డాక్టర్ కి చెప్తుంది. బొమ్మని చూపించి పిల్లాడు అంటావ్ ఏంటని అనేసరికి లాగిపెట్టి ఒకటి పీకుతుంది.