Gruhalakshmi August 1st: దివ్య, విక్రమ్ జీవితాలతో విడాకుల ఆట ఆడుతున్న లాస్య- తప్పు కూతురిదేనని తిట్టిన తులసి
దివ్య, విక్రమ్ ని శాశ్వతంగా దూరం చేసేందుకు లాస్య ప్లాన్ వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నందు, తులసి దివ్య గురించి దిగులు పడతారు. తన అత్తకి కాల్ చేసి అసలు సూట్ కేస్ తీసుకుని ఎందుకు వచ్చిందో కనుక్కోమని నందు అంటాడు. ఆవిడకి చేస్తే మరిన్ని అబద్ధాలు చెప్తుంది, గొడవలు మరింత పెంచినట్టు అవుతాయని తులసి అంటుంది. డైరెక్ట్ గా అల్లుడికి కాల్ చేసి మాట్లాడదామని తులసి సలహా ఇస్తుంది. తులసి ఫోన్ చేస్తుంది కానీ విక్రమ్ ఫోన్ రాజ్యలక్ష్మి చూసి లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది. విక్రమ్ కి మాట్లాడే ఉద్దేశం లేక కాల్ కట్ చేస్తున్నాడని నందు అంటాడు. తెలివిగా విక్రమ్ కి కాల్ చేసి బుట్టలో వేసుకోవాలని అనుకుంటున్నారు తను ఉండగా అలా జరగనివ్వనని రాజ్యలక్ష్మి అనుకుంటుంది. దీర్ఘంగా ఆలోచిస్తుంటే లాస్య వచ్చి ఏమైందని అడుగుతుంది. తులసి విక్రమ్ కి ఫోన్ చేసిందని కాల్ కట్ చేసినట్టు చెప్తుంది.
లాస్య: పిచ్చి పని చేశావ్. ఉన్నవి లేనివి చెప్పి మరింత దూరం చేయాల్సింది. అసలు ఇంటి పెద్దకి ఫోన్ చేయకుండా విక్రమ్ కి చేయడం ఏంటని నిలదీయొచ్చు కదా
రాజ్యలక్ష్మి: అవును కదా
లాస్య: ఈరోజు కాకపోతే రేపు అయినా తులసి విక్రమ్ కి ఫోన్ చేస్తుంది. అందుకే విడాకుల నోటీస్ ఇప్పిద్దాం
Also Read: పెరిగిపోయిన తాళి, గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ- మురారీ వాళ్ళు కలిసే ఉండాలని కోరుకున్న భవానీ
విక్రమ్ ఏం తినకుండా బాధపడుతూ ఉంటే రాజ్యలక్ష్మి వచ్చి దొంగ ప్రేమ నటిస్తుంది. విక్రమ్ కి ఇప్పుడు కావలసింది ఓదార్పు కాదు సమస్యకి పరిష్కారమని ముసలాయన అంటాడు.
బసవయ్య: అసలు విక్రమ్ సమస్య దివ్య. తను వెళ్లిపోతే ఇక సమస్య ఏముంటుంది
రాజ్యలక్ష్మి దివ్య దగ్గరకి వెళ్ళి తులసి కాళ్ళు పట్టుకుని బతిమలాడి అత్తారింటికి తెచ్చుకుంటానని అంటుంది. విక్రమ్ బాధ చూడలేకపోతున్నానని మొసలి కన్నీళ్ళు కారుస్తుంది.
విక్రమ్: ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి కాదు ఇంటి పరువు గురించి. అమ్మ ఎవరి కాళ్ళు పట్టుకున్నా ఇంటి పరువు పోయినట్టే. దివ్య తనంత తాను వస్తే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో
అప్పుడే పోస్ట్ మెన్ వచ్చి పేపర్ ఇస్తాడు. అది తల్లి చేతికి ఇచ్చి ఏంటి ఇదని అడుగుతాడు.
రాజ్యలక్ష్మి: దివ్య నీకు విడాకుల నోటీసు పంపించింది
విక్రమ్ తాతయ్య: నేను నమ్మను దివ్య అలా చేసే మనిషి కాదు
సంజయ్: మనిషికి అంత అహంకారం పనికి రాదు చిన్న గొడవకి డివోర్స్ పంపిస్తుందా?
ప్రియ: తొందరపడొద్దు.. ఒకసారి తనతో ఫోన్లో మాట్లాడండి
బసవయ్య: ఆడదానికి తనకే అహంకారం ఉంటే నీకు ఎంత ఉండాలి. నువ్వు కూడా డివోర్స్ పంపించు
రాజ్యలక్ష్మి: నేను ఒప్పుకోను చిన్న విషయానికి డివోర్స్ ఏంటి. నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడి విషయం తెలుసుకుంటాను
విక్రమ్: డివోర్స్ నోటీసు పంపించడానికి ఏర్పాట్లు చూడండి
Also Read: క్లయింట్స్‌ని ఇంప్రెస్ చేసిన కావ్య, మెచ్చుకున్న రాజ్- స్వప్న గుట్టు కనిపెట్టేసిన రుద్రాణి
ఇంట్లో దివ్య ఒక్కటే కూర్చుని చెస్ ఆడుకుంటుంటే తులసి, పరంధామయ్య వస్తారు. జీవితం ఆట, ఎత్తుకు పై ఎత్తులు అని కాసేపు కూతురికి హితబోధ చేస్తుంది. అత్తారింట్లో ఏం జరిగిందని తులసి అడుగుతుంది. కానీ దివ్య మాత్రం మౌనంగా ఉంటుంది. ఎంత బతిమలాడినా ఎందుకు చెప్పడం లేదని తులసి బాధపడుతూ అడుగుతుంది. అప్పుడే దివ్యకి పోస్ట్ వస్తుంది. అందులో డివోర్స్ నోటీసు చూసి షాక్ అవుతుంది. నందు దాన్ని లాక్కుని చూస్తాడు. సమస్య విడాకుల దాకా ఎందుకు తెచ్చుకున్నావని నందు కూతుర్ని నిలదీస్తాడు.
తులసి: గొడవ పెట్టుకోవద్దని మొదటి రోజు నుంచి చెప్తునే ఉన్నా. నువ్వు ఆలోచించాల్సింది పుట్టింటి గురించి కాదు అత్తింటి గురించి కాదని వందల సార్లు చెప్పాను. నీకు నా బాధ అర్థం కావాలని నీతో మాట్లాడకుండా దూరంగా ఉన్నాను
నందు: తప్పు దివ్య వైపు ఉన్నట్టు ఎందుకు అనుకుంటున్నావ్
తులసి: తప్పు ఎవరి వైపు ఉన్న కాపురం నిలబెట్టుకోవాల్సింది ఆడదే. ఈ విషయం తెలియక నా జీవితం పాడుచేసుకున్నా. తన విషయంలో ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతుంది. విక్రమ్ మంచి వాడు అలాంటి తనకే కోపం తెప్పించి డివోర్స్ దాకా తీసుకొచ్చిందంటే తప్పు ఖచ్చితంగా దివ్యదే