అన్వేషించండి

Brahmamudi August 1st: 'బ్రహ్మముడి' సీరియల్: క్లయింట్స్‌ని ఇంప్రెస్ చేసిన కావ్య, మెచ్చుకున్న రాజ్- స్వప్న గుట్టు కనిపెట్టేసిన రుద్రాణి

స్వప్న దొంగ కడుపు డ్రామా గురించి రుద్రాణి పసిగట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణమూర్తి అప్పు తీర్చడం కోసం ఇల్లు అమ్మేయాలని డిసైడ్ అవుతాడు. వడ్డీ డబ్బులు మీనాక్షీని అడుగుదామని కనకం అంటే వద్దని చెప్తాడు. రేపు ఒకతను ఇల్లు చూడటం కోసం వస్తున్నాడు ఒకే అయితే అతని దగ్గర అడ్వాన్స్ తీసుకుని వడ్డీ కట్టాలని అనుకుంటాడు. వీళ్ళ మాటలు విన్న అప్పు ఎలాగైనా కుటుంబానికి సహాయం చేయాలని అనుకుంటుంది. ఇక కావ్య, రాజ్ ఆఫీసుకి వస్తారు. వాళ్ళని చూసి శృతి ఆత్రంగా వెళ్ళి కావ్యని మెచ్చుకుంటుంది. తనని మోసం చేసినందుకు రాజ్ కోపంగా శృతికి డిమోషన్ ఇస్తాడు. దీంతో తను బిక్క మొహం పెట్టేస్తుంది. ఇక క్లయింట్స్ మీటింగ్ హాల్ లో వెయిట్ చేస్తున్నారని మేనేజర్ వచ్చి చెప్పేసరికి రాజ్ కావ్యని తీసుకుని వెళతాడు. వచ్చింది పెద్ద కంపెనీ వాళ్ళ ప్రపోజల్ విని మన కంపెనీకి అవసరం అవుతుందో లేదో అంచనాకి రమ్మని తనకి ట్రైనింగ్ ఇస్తానని అంటాడు. కాసేపు కావ్య రాజ్ ని అల్లాడిస్తుంది.

Also Read: ఆదిత్య పేరు మీద ఆస్తి రాయమన్న మాళవిక- దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చిన వేద

అప్పు డల్ గా కూర్చుని ఉండటం కళ్యాణ్ గమనిస్తాడు. ఏమైందని ఆరా తీస్తాడు కానీ అప్పు మాత్రం విషయం చెప్పదు. అప్పుడే అప్పు ఫ్రెండ్ వచ్చి డబ్బు అందలేదని చెప్తాడు. తను అప్పుగా అయినా ఇస్తాను తీసుకోమని కళ్యాణ్ అప్పుని బతిమలాడతాడు. కానీ అప్పు మాత్రం దానికి కూడా అంగీకరించదు. క్లయింట్స్ కాన్ఫిరెన్స్ హాల్ లోకి రాగానే రాజ్ ని పలకరిస్తారు. కావ్యని చూసి ఈవిడ ఎవరని అంటే పుసుక్కున సాటి మనిషిని అని నోరు జారుతుంది. దీంతో రాజ్ గుర్రుగా చూస్తాడు. రాజ్ మాట్లాడుతుంటే మధ్యలో కావ్య కల్పించుకుంటూనే ఉంటుంది.

క్లయింట్స్: స్వరాజ్ బ్రాండ్ తో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే డిజైన్స్ ఇస్తారని వచ్చాం

రాజ్: లేదు మా డిజైన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు

కావ్య: అలా ఏమీ లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా స్వరాజ్ బ్రాండ్ ఇవ్వగలదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేలా చిన్న చిన్న డిజైన్స్ తయారు చేయగలమని ఎగ్జాంపుల్స్ చెప్పడంతో అందరూ మెచ్చుకుంటారు. నేనే డిజైనర్ ని కనుక డిజైన్స్ వేసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతామని చెప్తుంది.

క్లయింట్స్: మా కంపెనీ డీల్ మీ కంపెనీకి ఇస్తాం అనేసి వెళ్లిపోతారు

కావ్య: క్లయింట్స్ తో ఇలాగేనా డీల్ చేయడం అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది

రాజ్: థాంక్స్..  ఈ కాంట్రాక్ట్ వదులుకోవాలని అనుకున్నా కానీ నీ మాటలకి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు

కావ్య: సాటి మనిషిని కదా

రాజ్: అబ్బా.. ఈ సాటి మనిషి పదాన్ని వదలవా అని ఫ్రస్టేట్ అవుతాడు

ఇల్లు చూసుకోవడానికి సీతారామ్ అనే వ్యక్తి వచ్చి కొలతలు వేస్తూ ఉంటాడు. అతను కృష్ణమూర్తి మీద సెటైర్స్ వేస్తూ ఉంటే అప్పు సీరియస్ అవుతుంది. ఇల్లంతా చూస్తూ అవమానకరంగా మాట్లాడతాడు. ఇంటికి రూ.20 లక్షలు ఇవ్వగలమని సీతారామ్ చెప్తాడు. ఇంటి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని కృష్ణ మూర్తి అంటాడు. ఫైనల్ గా రూ.22 లక్షలు ఇస్తానని చెప్తాడు.

అప్పు: అంత తక్కువకి మా ఇల్లు అమ్మడం కుదరదు బయలదేరండి

Also Read: ఇంకెన్నాళ్ళు ఈ సా....గతీత- భవానీ ముందు అడ్డంగా బుక్కైన కృష్ణ, మురారీ

సీతారామ్: ఆఫర్ ఇస్తున్నాం ఆలోచించుకుని చెప్పండి. రెడీ అంటే అడ్వాన్స్ ఇస్తాను

కృష్ణమూర్తి: ఆలోచించుకుని చెప్తాం

వాడికి ఇల్లు అమ్మడానికి వీల్లేదు ఏదో ఒక అవకాశం దొరుకుతుందని అప్పు చెప్పినా తనకి నమ్మకం లేదని కృష్ణమూర్తి బాధగా వెళ్ళిపోతాడు. రాజ్ వాళ్ళ ఇంటికి రాగానే కళ్యాణ్ కావ్యని పక్కకి పిలిచి మాట్లాడతాడు.

కళ్యాణ్: మీ ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు. రూ. 50 వేలు అర్జెంట్ గా కట్టాలని తెలిసింది. ఏదో ఇల్లు తాకట్టులో ఉందని తెలిసింది

కావ్య: యాభై వేలా, అంత డబ్బు ఇప్పటికిప్పుడంటే నాకు కష్టమే 

కళ్యాణ్: ఆ డబ్బు నేను ఇస్తాను మీరు ఇచ్చినట్టు ఇవ్వండి

కావ్య: వద్దు నేనే ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి గదిలోకి వెళ్తుంది. రాజ్ ఏమైందని అడిగితే చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
APTET Results: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎందుకయ్యా నీకు రాజకీయాలు, మంత్రి వాసంశెట్టికి క్లాస్ పీకిన చంద్రబాబుRohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP DesamRishabh pant out Controversy | రిషభ్ పంత్ అవుటా..నాట్ అవుటా..వివాదం మొదలైంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
APTET Results: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
Dil Raju: నేను ట్రాక్ తప్పాను.. నాగ వంశీ ట్రాక్ తప్పలేదు,  ఫెయిల్యూర్స్ ఒప్పుకున్న దిల్ రాజు!
నేను ట్రాక్ తప్పాను.. నాగ వంశీ ట్రాక్ తప్పలేదు, ఫెయిల్యూర్స్ ఒప్పుకున్న దిల్ రాజు!
Telangana News: తెలంగాణలోనే ఉన్న
తెలంగాణలోనే ఉన్న "క" సినిమాలో చెప్పిన క్రిష్ణగిరి- సాయంత్రం 4 గంటలకే చీకటి
Jeevan Pramaan Patra: లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
లైఫ్‌ సర్టిఫికెట్ల ప్రాసెస్‌ ప్రారంభం - ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్‌ చేయాలి?
BC Census: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Embed widget