Ennenno Janmalabandham August 1st: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: ఆదిత్య పేరు మీద ఆస్తి రాయమన్న మాళవిక- దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చిన వేద
ఆదిత్యని అడ్డం పెట్టుకుని ఆస్తి కాజేయాలని మాళవిక వేసిన ప్లాన్ కి వేద చెక్ పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
షష్టి పూర్తి సందర్భంగా రత్నం, మాలినితో ఇంట్లో పూజ చేయిస్తారు. ఆ తర్వాత ఇద్దరూ హోమం చుట్టు ఏడడుగులు వేస్తారు. ఖుషి తన అమ్మనాన్న హోమం చుట్టు ప్రదక్షిణలు చేసినట్టు ఊహించుకుంటుంది. షష్టి పూర్తి ఆలోచన చాలా బాగుందని పంతులు అంటాడు. ఈ క్రెడిట్ అంతా తన కోడలు వేదది అని మాలిని మెచ్చుకుంటుంది. ఇక ఇద్దరూ తమ జీవితం ఎలా సాగిందో చెప్తారు. వేద తమ కుటుంబంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆనందానికి కొదువ లేదని మెచ్చుకుంటుంది. జీవితంలో ఒడిదుడుకులు సహజం వాటన్నింటినీ దాటుకుని వెళ్లడమే జీవితమని సులోచన తన అనుభవాన్ని పంచుకుంటుంది. ఇక యష్ అభిప్రాయం చెప్పాల్సిందిగా ఖుషి అడుగుతుంది.
యష్: వేదతో నా లైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కటిక చీకటిలాగా ఉన్న నా జీవితాన్ని వెలుగుతో నింపింది. తన రాకతో జీవితం అంటే ఏంటో తెలిసేలా చేసింది. నా జీవితంలో నేను పోగొట్టుకున్నవన్నీ లెక్కకట్టి తిరిగి ఇచ్చేసింది
వేద: నేను నా జీవితం ఇలా ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు. కానీ ఆయన నా జీవితంలోకి వచ్చాక జీవితం ఇలా ఉంటే సరిపోతుందని అనిపించింది. ఏ జన్మ పుణ్యమో నాకు వరంలాగా దొరికారు. థాంక్స్ టు కమింగ్ మై లైఫ్
Also Read: అక్క తుప్పు వదిలించిన చెల్లి- కావ్య ఇల్లు తాకట్టులో ఉందని తెలుసుకున్న రాజ్ విడిపిస్తాడా?
వసంత్: చిత్ర నా లైఫ్ లోకి రావాలని కోరుకున్నా వచ్చేసింది చాలా హ్యాపీ
చిత్ర: ప్రేమ కొంత కాలమే బాగుంటుందని ఎక్కడో విన్నాను. అది ఇప్పుడు నిజమని అనిపిస్తుంది. ఆ మాటకి అందరూ ఆశ్చర్యపోతారు. వేద మాత్రం అనుమానంగా చూస్తుంది. మాళవిక వచ్చి తను పాల్గొంటానని కల్పించుకుంటుంది.
మాళవిక: నాకు జీవితంలో ఏదైనా మిగిలింది అంటే అది నా కొడుకు ఆదిత్య. నేను పడిన కష్టాలు వాడి దరి చేరకూడదు. అందుకే నా కొడుకు పేరిన తన తండ్రి యష్ ఆస్తిలో సగం, బ్యాంక్ బ్యాలెన్స్ లో సగం వాటా ఆదిత్య పేరిన ఇవ్వాలని అడుగుతున్నాను. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు.
యష్: నా ఆస్తి నా కొడుకు.. నేనేం చేయాలో డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరు?
వేద: దీని గురించి నేను, అత్తయ్య ఆల్రెడీ మాట్లాడుకున్నామని మాలినికి సైగ చేస్తుంది. ఆదిత్యని అత్తయ్య దత్తత తీసుకుంటున్నారు.
మాలిని: అవును ఆదిత్య నా దత్త పుత్రుడు
యష్: చాలా మంచి డెసిషన్ తీసుకున్నావ్ నాకు కూడా నచ్చింది
ఆదిత్య ఖుషికి సోరి చెప్తాడు. ఇందాక అమ్మని తిట్టినందుకు నిన్ను తిట్టాను కదా అందుకే సోరి అంటాడు. ఖుషి గీసిన డ్రాయింగ్ చూపిస్తుంది. అది తీసుకెళ్ళి నానమ్మ వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వమని చెప్తుంది. చిత్ర డల్ గా ఉండటం చూసి ఏమైందని వసంత్ అడుగుతాడు. వాళ్ళ మాటలు వేద, యష్ వింటారు.
వసంత్: మన మధ్య ఉన్న డిస్ట్రబెన్స్ ఇక్కడి వాళ్ళకి తెలియడం ఎందుకు
Also Read: ఇంకెన్నాళ్ళు ఈ సా....గతీత- భవానీ ముందు అడ్డంగా బుక్కైన కృష్ణ, మురారీ
చిత్ర: అది నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా?
వసంత్: సరే నీ ఇష్టం
ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడాలని వేద అనుకుంటుంది. నీలాంబరి ఉయ్యాల ముందు పెట్టుకుని ఊపుతూ పాట పాడుతుంది. అందులో బిడ్డ ఉన్నట్టే మాట్లాడుతుంది. తను ఏం చేస్తుందోనఅని అక్కాతమ్ముడు చూడటానికి వస్తారు. వెళ్ళి మాట్లాడమని ఖైలాష్ ని తోసేస్తారు. వాడు వెళ్ళి ఉయ్యాల మీద పది అందులో ఉన్న బొమ్మని తీసుకుని బొమ్మా అనేసరికి లాగిపెట్టి కొడుతుంది. బుడ్డి అభిమన్యు పుట్టాడని నవ్వుతూ చెప్తుంది. కాసేపు నీలాంబరి వాళ్ళని కావాలని ఆడుకుంటుంది.