Suma: రాజీవ్ తో గొడవలు నిజమే - విడాకులపై యాంకర్ సుమ రియాక్షన్
సుమ తన భర్త రాజీవ్ కనకాలతో విడిపోయిందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతుంది సుమ కనకాల. ఇండస్ట్రీలోకి ఎంత మంది హాట్ యాంకర్లు వస్తున్నా.. సుమను మాత్రం ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. బుల్లితెర మహారాణిగా చెలామణి అవుతోన్న ఈమె గతంలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. కానీ ఆ తరువాత పూర్తిగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితమైంది. పలు టీవీ షోలు, ఈవెంట్స్ తో బిజీగా గడుపుతోంది.
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా ఈవెంట్ అయినా సరే అక్కడ సుమ ఉండాల్సిందే. ఆమె డేట్స్ ని బట్టి ఈవెంట్స్ ఏర్పాటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈమె 'జయమ్మ పంచాయితీ' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది సుమ. ఈ సందర్భంగా అలీ నిర్వహించే ఓ షోకి గెస్ట్ గా హాజరైంది. ఈ షోలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది.
తనకు సినిమా అవకాశాలు చాలానే వచ్చాయని.. కానీ మంచి సినిమా చేద్దామని ఇంతకాలం ఆగినట్లు తెలిపింది. అలా చివరకు 'జయమ్మ పంచాయితీ' చేస్తున్నట్లు తెలిపింది. తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుండడంపై అలీ ప్రశ్నించగా.. చిన్నప్పటినుంచి సినిమాలు బాగా చూసేవాడని.. హీరోల్లా డైలాగ్స్ చెప్పేవాడని.. త్వరలోనే తన కొడుకు ప్రాజెక్ట్ కి సంబంధించి అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పింది.
సుమ తన భర్త రాజీవ్ కనకాలతో విడిపోయిందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అలీ ప్రశ్నించగా.. రాజీవ్ కు, తనకు మధ్యలో గొడవలు జరిగిన విషయం నిజమేనని.. ఈ 23 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు గొడవపడ్డామని తెలిపింది. భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం సులువే కానీ తల్లితండ్రులుగా డివోర్స్ తీసుకోవడం మాత్రం చాలా కష్టమని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది సుమ.
Also Read: తెరవెనుక 'థాంక్యూ' టీమ్ - ఏం డిస్కస్ చేసుకుంటున్నారో?
Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే
View this post on Instagram
View this post on Instagram