Tollywood Movies: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే

'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2'ల హవా తరువాత బాక్సాఫీస్ వద్ద మరికొన్ని సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

FOLLOW US: 

'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2'ల హవా తరువాత బాక్సాఫీస్ వద్ద మరికొన్ని సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ శుక్రవారం నాడు థియేటర్, ఓటీటీల్లో కొన్ని సినిమాలు హడావిడి చేయబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

ఆచార్య: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏప్రిల్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

View this post on Instagram
 
A post shared by Konidela Production Company (@konidelapro)

కణ్మణీ రాంబో ఖతీజా: సమంత, నయన తార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కాతు వాక్కులా రెండు కాదల్'. తెలుగులో ఈ చిత్రాన్ని 'కణ్మణీ రాంబో ఖతీజా' టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతో వినోదాత్మకంగా ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

View this post on Instagram
 
A post shared by Vignesh Shivan (@wikkiofficial)

'రన్ వే 34': బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'రన్ వే 34'. ఇందులో అజయ్ పైలట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు అజయ్ దేవగన్. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2015లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానుంది. 

View this post on Instagram
 
A post shared by Ajay Devgn (@ajaydevgn)

ఓటీటీ రిలీజెస్:
గంగూబాయి కథియవాడి: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గంగూబాయి కతియావాడి'. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అజయ్ దేవగన్, హ్యూమా ఖురేషి ఇందులో కీలకపాత్రల్లో నటించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 26న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది ఈ సినిమా. 

మిషన్ ఇంపాజిబుల్: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె 'మిషన్ ఇంపాజిబుల్' అనే సినిమాను తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 29న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 

అలానే నెట్ ఫ్లిక్స్ లో '365 డే: ది డే' అనే హాలీవుడ్ సినిమా ఏప్రిల్ 27న, 'ఓ జార్క్' కొత్త సీజన్ ఏప్రిల్ 29న విడుదల కానుంది. 
డిస్నీ హాట్ స్టార్ లో 'అనుపమా - నమస్తే అమెరికా' అనే హిందీ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. 

జీ5లో 'నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్' అనే హిందీ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. 

Also Read: 'ఆచార్య' టీమ్ వారిద్దరినీ కావాలనే మర్చిపోయిందా?

Published at : 25 Apr 2022 01:10 PM (IST) Tags: Acharya chiranjeevi ram charan OTT releases Koratala siva Upcoming Movie releases

సంబంధిత కథనాలు

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

టాప్ స్టోరీస్

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !