By: ABP Desam | Updated at : 25 Apr 2022 04:47 PM (IST)
తెరవెనుక 'థాంక్యూ' టీమ్
రీసెంట్ గా 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న అక్కినేని నాగచైతన్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో క్లారిటీ లేదు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా టీమ్ కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అక్కినేని నాగచైతన్య, రాశిఖన్నా, దర్శకుడు విక్రమ్ కె కుమార్ లతో పాటు ఇద్దరు టెక్నిషన్స్ కూడా ఉన్నారు. తెరవెనుక ఉన్న 'థాంక్యూ' టీమ్ ఏదో చర్చించుకుంటున్నట్లుగా కనిపించారు. చైతు మాత్రం కూల్ గా ఫోన్ చూసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. సినిమా రిలీజ్ డేట్ చెప్పమంటూ కోరుతున్నారు ప్రేక్షకులు. వేసవికి ఈ సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే
#ThankYouMovie BTs Picture @chay_akkineni 😍😍@RaashiiKhanna_ @Vikram_K_Kumar #JrANR #YuvaSamrat #NagaChaitanya pic.twitter.com/UfigzefFcJ
— Aarya Prasad (@Aaryaprasad) April 25, 2022
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా