Ammayi garu Serial Today September 3rd: అమ్మాయి గారు సీరియల్: కోమలిని సీఎం ఫ్యామిలీతో చూసేసిన ఆనంద్! రూపతో దారుణంగా మాట్లాడిన కన్నతండ్రి!
Ammayi garu Serial Today Episode September 3rd కోమలిని సీఎం సూర్యప్రతాప్ ఫ్యామిలీతో ఆనంద్ చూసి అనుమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూపలా నటిస్తున్న కోమలి రుక్మిణి తనని చంపాలని విషం కలిపిందని కోమలి చెప్పి నేను ఇంటి నుంచి వెళ్లిపోతానని అంటుంది. నువ్వు వెళ్లిపోవడం ఏంటి రూప అవసరం అయితే నీకు ఈ గతి పట్టించిన వాళ్లు వెళ్లిపోతారని రుక్మిణిని ఉద్దేశించి అంటారు.
రుక్మిణి అలా చేయదు అని రాజు అంటే సూర్యప్రతాప్ ఇంకా రుక్మిణిని ఎలా వెనకేసుకొస్తున్నావ్ అంటాడు. రుక్మిణి తనకు విషం ఎలా కలిసిందో తెలీదు అంటుంది. దానికి కోమలి అబద్ధం చెప్పకు రుక్మిణి.. నన్ను నువ్వు అక్కలా చూడలేకపోతున్నావ్.. నాన్న నాతో క్లోజ్‌గా ఉంటే తట్టుకోలేకపోతున్నావ్.. బంటీ, రాజులు నాకు దగ్గర కాకుండా చేస్తున్నావ్.. అమ్మ కూడా నన్ను పట్టించుకోవడం లేదు అని సూర్యప్రతాప్ నమ్మేలా సానుభూతితో మాట్లాడుతుంది. అన్ని మాటలు విన్న సూర్యప్రతాప్ రుక్మిణి మీద కోపం తెచ్చుకుంటాడు. నేను రావడం నువ్వు తట్టుకోలేకపోతున్నావ్ అని కోమలి అంటుంది. నాన్నని నాకు దూరం చేయాలి అని చంపేయాలి అని ప్లాన్ చేశావని అంటుంది.
రుక్మిణి కోపంగా నాకు నిన్ను చంపాల్సిన అవసరం లేదు.. నేను విషం కలపలేదు నాకు అలాంటి ఆలోచన కూడా రాలేదు అని రుక్మిణి అంటుంది. సూర్యప్రతాప్ కోపంగా ఆపు రుక్మిణి కనీసం నువ్వు అక్క అని కూడా పిలవడం లేదు.. అలాంటిది నువ్వు ఈ పని చేయలేదు అంటే నేను ఎలా నమ్మాలి అని సూర్యప్రతాప్ అడుగుతాడు. దానికి రుక్మిణి నమ్మాలి నాన్న ఎందుకంటే నేను నీ కూతుర్ని.. తప్పు చేయడం మోసం చేయడం ఒకరి నాశనం కోరుకోవడం నీ రక్తంలో ఉండదు కదా నాయనా అని అంటుంది.
సూర్యప్రతాప్ రుక్మిణితో ఉదయం బంటీకి పొంగల్ చేయడం.. రూప కోసం ఉప్మా చేసింది నువ్వే కదా.. మరి బంటీకి ఏం కాలేదు.. రూప తిన్నదాంట్లో విషం ఎలా వచ్చింది.. నీకు ఇష్టం అయినా బంటీ పొంగల్ మొత్తం తిన్నా ఏం కాలేదు.. రూప రెండు స్పూన్లు తింటే పడిపోయింది. రూప నీకు ఇష్టం లేదు కాబట్టి విషం కలిపావ్.. రూపని చంపాల్సిన అవసరం నీదే అని సూర్యప్రతాప్ రుక్మిణి అలియాస్ రూప మీద కోప్పడతాడు. రుక్మిణి ఇలా అవ్వడానికి నువ్వే కారణం అని విరూపాక్షిని తిట్టి ఇద్దరినీ బయటకు వెళ్లమని పంపేస్తాడు.
రూప ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది. విరూపాక్షి కూతురితో వెళ్తుంది. రూపని విరూపాక్షిని ఈ గదిలో నుంచి పంపినట్లే ఇంట్లో నుంచి పంపేస్తే బెటర్ అనుకుంటుంది విజయాంబిక. డాక్టర్ అందర్ని బయటకు పంపేస్తారు. రూప ఏడుస్తూ ఎందుకు అమ్మా నా బాధ నాన్నకి అర్థం కావడంలేదు.. నిజంగా నేను విషం కలపలేదు అని ఏడుస్తుంది. రాజు రావడంతో విరూపాక్షి సూర్యకి నిజం తెలియకపోతే ఇంకా ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది. రూప గురించి నిజం చెప్పేద్దాం అంటుంది. రూప ఒప్పుకోదు. ఇక రాజు విషం నిజంగానే కలిసింది.. విజయాంబిక, దీపక్‌లు అటుగా రాలేదు కాబట్టి వాళ్లు కలపలేదు.. ఆ అమ్మాయే కలుపుకొని ఉంటుందా.. అసలేం జరిగుంటుంది అని రాజు అనుకుంటాడు.
కోమలి ఉన్న అదే హాస్పిటల్‌కి ఆనంద్ వస్తాడు. ఆనంద్ వెళ్తూ సూర్యప్రతాప్ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ దగ్గర ఉండడం చూసి వీళ్లేంటి ఇక్కడ ఉన్నారు అనుకుంటాడు. ఇంట్లో వాళ్లు అంతా కళ్ల ముందే ఉన్నారు మరి ప్రాబ్లమ్ ఎవరికి అనుకుంటాడు. విజయాంబిక మాటల్లో విషం తిన్నారని ఆనంద్‌కి అర్థమవుతుంది. రూప విషం మొత్తం తినేసుంటే మనం రూప మీద ఆశలు వదిలేయాల్సి వచ్చేదని విజయాంబిక అంటుంది. రూపా అని ఆనంద్ తికమక పడతాడు. ఎదురుగా రుక్మిణిగా ఉన్న రూపని చూసి ఏంటా అనుకుంటాడు. డాక్టర్ వచ్చి పేషెంట్‌ని ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్తారు.
రూప ఇక్కడే ఉంది.. రూప టెన్షన్‌గా ఉంది.. లోపల ఎవరు ఉన్నారు అని ఆనంద్ అనుకుంటాడు. ఇంతలో సూర్యప్రతాప్ కోమలిని బయటకు తీసుకొస్తాడు. ఆనంద్ కోమలిని చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి కోమలి ఇక్కడుంది అని అనుకుంటాడు. కోమలికి సీఎంకి ఏంటి సంబంధం అని అనుకుంటాడు. కోమలి కోసం సీఎం కుటుంబం మొత్తం రావడం ఏంటి అని అనుకుంటాడు. అందరూ కోమలిని తీసుకెళ్తారు. ఆనంద్ దూరం నుంచి చూస్తాడు. వెంటనే రాజుకి కాల్ చేస్తాడు. రాజు కాల్ లిఫ్ట్ చేయడు. దాంతో రాజుని కలిసి విషయం మాట్లాడాలి అని ఆనంద్ అనుకుంటాడు. కోమలి సూర్యప్రతాప్‌తో మళ్లీ ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది నాన్న అని అంటుంది. నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాదే అంటాడు. సుమ, మందారాలకు రూపని బాగా చూసుకోండి అని చెప్పి రుక్మిణి వైపు చూసి ఇక్కడ ఎవరినీ నమ్మడానికి వీల్లేదని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















