Ammayi garu Serial Today August 25th: అమ్మాయి గారు సీరియల్: రాజు, రూపల చేతిలో కోమలి భవిష్యత్! విరూపాక్షికి గుడ్ న్యూస్!
Ammayi garu Serial Today Episode August 25th రాజు, రూపలు సీసీ టీవీ పుటేజ్ చూసి కోమలికి దొంగకి సంబంధం ఉందని అనుమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode ఇంటికి వచ్చిన దొంగ ఎవరో తెలుసుకోవడానికి రాజు, రూపలు సీసీ టీవీ ఫుటేజ్ చూడటానికి వెళ్తారు. కోమలి చాలా టెన్షన్ పడుతుంది. దొరికితే అందరం దొరికిపోతామని దీపక్ అనుకుంటాడు.
రాజు, రూపలు చూస్తూ కోమలి సైగ చేయడం చూసి ఆ అమ్మాయి సెట్ చేసిన వాడే అని అనుకుంటారు. తర్వాత అతను కోమలితో మాట్లాడటం చూస్తారు. రాజు ఆనంద్ ముఖం చూసి గతంలో కోమలి కలిసింది వీడే అని అపిస్తుందని రూపతో చెప్తాడు. వెళ్తూ వెళ్తూ అతడు ముఖం దాచుకున్నాడని రాజు చెప్తాడు. నాన్నకి చెప్పేద్దాం అని రూప అంటే వాడిని పట్టుకోవడం ముఖ్యం అని రాజు అంటాడు. అందరి దగ్గరకి వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్‌లో వాడి ముఖం కనిపించడం లేదు కానీ నేను వాడిని ఎక్కడో చూశా అని వాడిని నేను పట్టుకుంటా అని అంటాడు.
దీపక్ మనసులో రాజుకి నిజం తెలిసినా ఎందుకు చెప్పలేదు అనుకుంటాడు. విజయాంబిక మనసులో కోమలి ఇంత మంది ఉన్నా వాడిని దింపావు అంటే నువ్వు సామాన్యురాలివి కాదే అని అనుకుంటుంది. ఇంతలో దీపక్ వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్‌రా అని విజయాంబిక అడిగితే నీకు తేలు కుట్టింది కదా ఏం కాకూడదు అని గుడికి వెళ్లానని అంటాడు. దాంతో విజయాంబిక నా నాయనే అని ఒక్కతాపు తంటుంది. టాపిక్ డైవర్ట్ చేయాలని దీపక్ కోమలి లవర్ అశోక్ గురించి చెప్తాడు. నేనే తప్పించానని అంటాడు. దాంతో విజయాంబిక కోమలి హద్దులు దాటుతుందిరా.. మనల్ని ప్రాబ్లమ్‌లో పడేసేలా ఉందని అనుకుంటారు. ఇంతలో కోమలి వస్తుంది.
విజయాంబిక కోమలితో ఏదో చేస్తావ్ అంటే అశోక్‌ని రప్పిస్తావా అంటుంది. అశోక్ గురించి వీళ్లకి ఎలా తెలిసిపోయిందని కోమలి అనుకుంటుంది. పైకి మాత్రం అశోక్ గురించి మీకు తెలీదు అని అంటుంది. నీ ముఖం వాడు రాజుకి దొరికిపోయాడని దీపక్ కోమలికి షాక్ ఇస్తాడు. అశోక్‌ని జాగ్రత్తగా ఉండమని చెప్పమని అంటారు. కోట్లు వస్తుంటే లక్షలకు కక్తూర్తి పడతావేంటి ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దని అంటారు. చంద్ర అన్నయ్యతో సీఎం ఇంట్లోనే దొంగ పడితే పట్ట లేకపోయిన సీఎం మనల్ని ఏం కాపాడుతాడని ప్రతి పక్షాలు నిలదీస్తున్నాయని అంటాడు. సూర్యప్రతాప్ చంద్రతో మన ఇంట్లో ఎవరో వాడిని సాయం చేశారని అనుమానిస్తాడు. విజయాంబిక కోమలితో వాడి వల్ల అందరూ దొరికిపోయేలా ఉన్నాం మా తమ్ముడు ఆశోక్‌ని వదిలడు అని అంటుంది. కోమలి అశోక్‌కి ఏం కాకూడదు అని విజయాంబికతో చెప్తుంది.
అశోక్‌ని ఎక్కడికైనా పారిపోమని చెప్పు ప్రస్తుతానికి నందు ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అశోక్ మీద ఉందని అంటుంది. విరూపాక్షి ఇళ్ల పట్టాల పంపిణీకి సూర్యప్రతాప్ వస్తే బాగుంటుందని అనుకుంటుంది. కానీ ఎలా పిలవాలా అని ఆలోచిస్తుంది. ఇంతలో రాజు రూపలు వస్తారు. కూతురు అల్లుడితో విషయం చెప్తుంది. మీరు పిలవండి వస్తారు అని ఇద్దరూ చెప్తారు. భార్యగా పిలిస్తే రారు కానీ ఎమ్మెల్యేగా పిలిస్తే వస్తారని అంటారు.
విరూపాక్షి సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి సూర్య నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. దానికి సూర్యప్రతాప్ ఈ దొంగతనానికి నీకు ఏం సంబంధం లేదు అని చెప్తావా నాకు నీ మీద అనుమానం లేదు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఆ విషయం కాదు అని విరూపాక్షి అనగానే నువ్వు ఇంకెప్పుడూ నాతో మాట్లాడకు అంటాడు. దానికి విరూపాక్షి నేను నీ భార్యగా కాదు ఎమ్మెల్యేగా మాట్లాడుతున్న అని విషయం చెప్తుంది. దాంతో సూర్యప్రతాప్ ఎమ్మెల్యేగా మాట్లాడుతా అని సూర్య అంటావేంటి అని సూర్యప్రతాప్ అనడంతో సార్ అని విరూపాక్షి విషయం చెప్తుంది. ఇక రాజు, రూపలు నాన్న ప్రజా సేవకుడు రాకుండా ఎలా ఉంటారని అంటారు. దాంతో సూర్యప్రతాప్ వస్తానని అంటాడు. విరూపాక్షి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















