Ammayi garu Serial Today August 22nd: అమ్మాయిగారు సీరియల్: ఇంట్లో దొంగని వదిలేదేలే.. అశోక్‌ని పట్టుకున్న రాజు.. చివరకు ఏమైంది?
Ammayi garu Serial Today Episode August 22nd అశోక్ దొంగతనానికి వచ్చి రాజుకి దొరికిపోవడం దీపక్ అశోక్‌ని తప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode అశోక్ చంద్ర గదిలోకి దూరి డబ్బు తీసుకెళ్తున్న టైంకి రాజు ఎంట్రీ ఇస్తాడు. రేయ్ ఎవడ్రా నువ్వు అని రాజు దగ్గరకు వెళ్తాడు. అశోక్ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. రాజు డబ్బుల బ్యాగ్ పట్టుకొని లాగేస్తాడు. అశోక్‌ని ఒక్కటి తన్ని అతన్ని పట్టుకొని మాస్క్ తీసే టైంకి అశోక్ రాజుని తోసేసి పారిపోతాడు.
అశోక్ పారిపోవడం కోమలితో పాటు అందరూ చూస్తారు. ఎటు వెళ్లాలో తెలియక అశోక్ కిటీకి నుంచి దూకి పారిపోతాడు. కోమలి చాలా టెన్షన్ పడుతుంది. రాజు అశోక్‌ని ఫాలో అవుతూ అశోక్ ముఖం చూస్తాడు. రాజు పరుగులు చూసి అందరూ ఏమైందా అని షాక్ అయి చూస్తారు. సూర్యప్రతాప్ రాజుతో ఏమైంది రాజు అని అడిగితే ఎవరో దొంగ పెద్దయ్య మన ఇంట్లోకి దూరి చిన్నయ్యగారి గదిలో డబ్బు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడని చెప్పి రాజు పరుగులు తీస్తాడు. రాజు అశోక్‌ని పట్టుకొని ఎవరు పంపారురా నిన్ను చెప్పురా అని కొడతాడు. నీ సంగతి మా పెద్దయ్యగారి ముందే తేల్చుతా అని అంటాడు.
సూర్యప్రతాప్ చంద్రతో చెప్పి గెస్ట్‌లను పంపేయమని అంటాడు. కోమలి చాలా టెన్షన్ పడుతుంది. విజయాంబిక కోమలిని అనుమానంగా చూసి దగ్గరకు వెళ్లి అందుకే నీకు ఇలాంటి ఆలోచన చేయొద్దని అన్నాను. వాడు దొరికాడు అంటే మనందరం ఇరుక్కుంటాం అని అంటుంది. అదంతా నేను చూసుకుంటా అని కోమలి సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి పట్టపగలు మన ఇంటికి దొంగ రావడం ఏంటి అని అంటుంది. సూర్యప్రతాప్ కోమలితో రాజు వెళ్లాడు కదమ్మా వాడిని తీసుకొస్తాడు. ఎలాంటి పరిస్థితిలో వాడిని వదలడు. నేను వాడి వెనక ఎవరు ఉన్నా వాళ్ల సంగతి తేల్చుతా వాళ్లని వదలను అని అంటాడు.
రాజు అశోక్‌కి పట్టుకొని తీసుకొస్తుంటే రాజు కళ్లలో మట్టి పడుతుంది. దాంతో రాజు అశోక్‌ని వదిలేస్తాడు. అశోక్ తప్పించుకుంటాడు. ఇంతలో దీపక్ అక్కడికి వస్తాడు.( దీపక్ మారిపోయాడు.. కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్‌లోని సుభాష్ దీపక్ స్థానంలో వచ్చాడు) రాజు దీపక్‌తో వాడి వెనకాలే నువ్వే ఉన్నావని అర్థమైంది. వాడిని తప్పించానని సంబర పడిపోకు వాడిని వదలను వాడి వెనక ఉన్న వాళ్లని వదలను అని అంటాడు. అశోక్ ఓ చోట దాక్కొని ఉంటాడు. దీపక్ అశోక్‌తో టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అయినా నీకు ఎవరు దొంగతనం చేయమని అన్నారు అని అడిగితే అశోక్ కోమలి పేరు చెప్తాడు.
కోట్లు వస్తే లక్షల కోసం ఆశపడతావేంట్రా.. ఆ రాజు కంట పడితే నీ పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటాడు. ఇక అశోక్ దీపక్‌తో నువ్వు కూడా కోమలికి దూరంగా ఉండు పిచ్చి వేషాలు వేస్తే నీ పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటాడు. దీపక్ మనసులు వీడు కూడా నీకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడని అనుకుంటాడు. రాజు ఇంటికి వెళ్లి వాడు తప్పించుకున్నాడని పట్టపగలు ఇంట్లోకి వచ్చాడంటే కచ్చితంగా ఇంట్లో వాళ్లే వాడికి సపోర్ట్ చేసుంటారు. లేకపోతే ఈ ఇంట్లో డబ్బు ఎక్కడ ఉందో ఎలా రావాలో ఎలా బయటకు వెళ్లాలో బయట వాళ్లకి ఎలా తెలుస్తుంది అని రాజు అంటాడు.
రుక్మిణి వచ్చి రాత్రి కూడా అత్త దొంగతనం చేయాలని ప్రయత్నించింది కదా ఇప్పుడు కూడా అత్తే చేయించొచ్చు కదా అంటుంది. దానికి విజయాంబిక నేనేం చేయించలేదు రాత్రి కూడా దొంగ వచ్చినట్లు అనిపించి వెళ్లాను.. రాత్రి వచ్చిన వాడే ఇప్పుడు వచ్చుంటాడని అంటుంది. సూర్యప్రతాప్ కోపంగా అసలు ఇక్కడే జరుగుతుంది. ఇంట్లో వాళ్లు సాయం చేయకపోతే వాడికి ఎలా తెలుస్తుంది. మర్యాదగా తప్పు చేసిన వాళ్లు ఒప్పుకోండి లేదంటే నా చేతిలో చచ్చిపోతారని అంటాడు. కోమలి చాలా భయపడుతుంది. తప్పు చేసిన వాళ్లు ఎందుకు ఒప్పుకుంటారు నాన్న బాబయ్‌కి డబ్బు ఎవరు ఇచ్చారో వాళ్ల సైడ్ నుంచి ఆలోచించు నాన్న అని కోమలి అంటుంది. దీపక్ చాటుగా చూసి ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతా దీని వల్లే అని అనుకుంటాడు.
చంద్ర వెంటనే నాకు డబ్బు ఇచ్చిన వాడు అలాంటి వాడు కాదు అని అంటాడు. రుక్మిణి సీసీ కెమెరాలు చెక్ చేస్తే తెలిస్తుందని అంటుంది. సూర్యప్రతాప్ రాజు, రుక్మిణిలను వెళ్లి చెక్ చేయమని అంటాడు. కోమలి చాలా భయపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















