అన్వేషించండి

Ammayi garu Serial Today August 21st: అమ్మాయి గారు సీరియల్: కోమలిని చిత్తు చేసిన రూప.. రాజు, రూపల చేతుల మీదగా భర్త్‌డే వేడుక.. అశోక్ దొరికిపోతాడా!

Ammayi garu Serial Today Episode August 21st కోమలిని పార్టీలో రూప దెబ్బకొట్టడం.. అశోక్ దొంగతనం చేయడానికి వెళ్లి రాజుకి దొరికిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode కోమలి సూర్యప్రతాప్‌ ఇంట్లో డబ్బు దొంగతనం కోసం తన లవర్‌ అశోక్‌ని పిలిపిస్తుంది. అశోక్ పార్టీలో సర్వర్ అవతారం ఎత్తుతాడు. అందరికీ కూల్ డ్రింక్‌లు పంచుతూ ఉంటాడు. కోమలి అశోక్‌కి మేడ మీద డబ్బు ఉన్న గదికి పంపిస్తుంది. 

విజయాంబిక కోమలితో ఏదో టెన్షన్ పడుతున్నట్లున్నావ్.. డబ్బు దొంగిలించేస్తానని అన్నావ్ ఏం చేస్తున్నావా లేదని అడుగుతుంది. కోమలి విజయాంబికకు చెప్తే ప్రమాదం అని చెప్పదు.. అశోక్ డబ్బు ఉన్న గదిలోకి కూల్‌డ్రింక్స్‌ పట్టుకొని వెళ్తే రాజు చూసి పిలిచి అక్కడ ఎవరూ ఉండరు కిందకి వెళ్లు అని చెప్తాడు. విజయాంబిక కోమలిని చూసి ఏదో జరుగుతుందని అనుకుంటుంది. రాజు అశోక్‌ని చూసి అనుమానపడతాడు. కోమలి కవర్ చేయడానికి సూర్యప్రతాప్‌ దగ్గరకు వెళ్లి రాజు వచ్చాడు కేక్ కటింగ్ చేయిద్దామని అంటుంది. మందారానికి రూప సైగ చేస్తుంది. 

రూప సైలెంట్‌గా పక్కకి వచ్చేస్తుంది. విజయాంబిక చూసి ఏంటి ఇది ఇంత సైలెంట్‌గా ఉంది అని అనుకుంటుంది. బంటీ దేవుడికి దండం పెట్టుకుంటూ నేను అమ్మ తెచ్చిన కేకే తినేలా చేయు స్వామి అని మొక్కుకుంటాడు. కోమలి కేక్ తీసుకొస్తూ ఉంటుంది. కోమలి రూపని చూసి తీసుకొస్తూ ఉంటుంది. రూప పొగరుగా చూస్తూ ఉంటుంది. కోమలి కేక్ తీసుకొస్తుంటే రూప కోమలి కాళ్లలో కాలు పెట్టేస్తుంది. దాంతో కోమలి కింద పడిపోతుంది. కేక్ ముఖానికి అంటుకుంటుంది. రూప, రాజులు నవ్వుకుంటారు. సూర్యప్రతాప్‌ వచ్చి అమ్మా రూప చూస్తూ నడవాలి కదా అని అంటుంది. రూప కోమలిని చూసి కళ్లు ఎగరేస్తూ నవ్వు ఆపుకుంటూ నవ్వుతుంది. కోమలి ఉడికిపోతుంది. 

రాజు సూర్యప్రతాప్‌తో కేకు లేదు ఇప్పుడు ఎలా అంటే విరూపాక్షి రాజుతో మన రుక్మిణి కూడా కేక్ తెప్పించింది. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకొస్తుందని అంటుంది. సూర్యప్రతాప్‌ రుక్మిణికి కేక్ తీసుకురమ్మని చెప్తాడు. కోమలి ముఖం కడుక్కోవడానికి వెళ్తుంది. రూప కేక్ తీసుకురావడంతో బంటీ చాలా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. కోమలి లవర్ అశోక్ కోమలితో నా మందు నీకు అవమానం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నా రూపని చంపేస్తా అంటాడు. 

కోమలి అశోక్‌ని ఆపి ముందు డబ్బు కొట్టేద్దామని అంటుంది. ఇక విరూపాక్షి, రూపలు సైగ చేసుకొని బంటీకి సైగ చేస్తారు. దాంతో బంటీ ఆకలేస్తుంది త్వరగా కేక్ కట్ చేద్దామని అంటాడు. కాసేపు ఆగుదామని సూర్యప్రతాప్‌ అంటే రాజు, బంటీ అందరూ సూర్యప్రతాప్‌ని ఒప్పిస్తారు. దాంతో రూప, రాజులు బంటీతో కేక్ కట్ చేయిస్తారు. సూర్యప్రతాప్‌ రుక్మిణికే తినిపించమని అంటారు. అందరూ సంతోషంగా భర్త్‌డే చేస్తారు. కోమలి చూసి రగిలిపోతుంది. కోమలి దగ్గరకు రాజు, రూపలు వెళ్లి చెప్పా కదా బంటీ నేను తెచ్చిన బట్టలే వేసుకుంటాడు.. నేను తెచ్చిన కేక్ కట్ చేస్తాడని చెప్పా కదా అంటుంది. ఈ సారి నేను మిమల్ని దెబ్బ కొడతా తట్టుకోలేరు రెడీగా ఉండండి అంటుంది. 

బేరర్‌లు ఇద్దరూ మరోపార్టీ ఉంది అక్కడికి వెళ్దాం మన ఇద్దరికీ ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటారు. రాజు ఆ మాట విని మీరు ఎంత మంది అని అడుగుతాడు. మేం ఇద్దరమే అని అంటారు. మూడో వాడు ఎవరు అని రాజు అడిగితే మాకు తెలీదు సార్ మీరే పిలిపించారని అనుకున్నాం అంటారు. ఏదో జరుగుతుందని రాజు మేడ మీదకు వెళ్తాడు. అప్పటికే అశోక్‌ డబ్బు దొంగతనం చేస్తాడు. రాజు ఆ గదికి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Vanana Brundha: మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
Godavari Serial Today July 11th: 'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget