Ammayi garu Serial Today August 19th: అమ్మాయి గారు సీరియల్: విజయాంబిక తిక్క కుదిర్చిన మేనకోడలు.. టార్చర్‌లో ఏలోటూ లేదుగా.. బంటీ బట్టలు కాల్చేసిన కోమలి!
Ammayi garu Serial Today Episode August 19th విజయాంబికకు తేలు కుట్టిన నెపంతో రూప, మందారం టార్చర్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode తేలు కుట్టింది అన్న నెపంతో రూప విజయాంబికకు చుక్కలు చూపిస్తుంది. ముందు నువ్వు వెళ్లు రూప అని విజయాంబిక రూపతో అంటుంది. దాంతో రుక్మిణి కావాలనే అయ్యో అత్తా నీ మతి పోయినట్లుంది నేను రుక్మిణి తను రూప అని కోమలిని చూపిస్తుంది.
కోమలి రూపతో మా అత్తని నేను చూసుకుంటా నువ్వు వెళ్లు అంటుంది. కోమలితో రూప ఏదైనా క్యారెక్టర్‌లోకి దిగితే పూర్తిగా నిమగ్నం అయిపోవాలి. రూప క్యారెక్టర్‌కి ఈ అత్తకి అస్సలు పడదు. నువ్వు సేవలు చేయడం నాయన చూస్తే నువ్వు దొరికిపోతావ్.. కాబట్టి నువ్వు ఒక మూల పడుంటే మంచిది అని రూప అంటుంది. ఏయ్ అని కోమలి అంటే ఊరికూరికే ఏగిరి పడకు అసలే నువ్వు రూప క్యారెక్టర్‌లో ఉన్నావ్.. ఆ క్యారెక్టర్‌కి మచ్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని అంటుంది. ఇంతలో మందారం వేడి వేడి నీరు తీసుకొస్తుంది.
విజయాంబికకు నిద్ర లేకుండా చేస్తానని చెప్పి రూప, మందారం బాగా మరిగి ఆవిర్లు వస్తున్న నీటిలో విజయాంబిక కాళ్లు ముంచేస్తారు. విజయాంబిక గావు కేకలు పెడుతుంది. రాజు, విరూపాక్షి నవ్వుకుంటారు. తర్వాత మందారం రూపతో తేలు కుట్టిన చోట కట్టు వదులు అయిపోయింది మళ్లీ బిగించి కట్టండి అంటే అవును అని రూప చేయి విరిగిపోయేలా కట్టు కడుతుంది. విజయాంబిక ఏడుస్తుంది. చేయి మీద తాకి స్పర్శ తెలీడం లేదే అని అంటుంది. దాంతో మందారం స్పర్శ తెలీడం లేదు అంటే నిప్పు సెగ చూపించమని డాక్టర్ చెప్పారు కదా అని అంటుంది. కోమలి ఆ టార్చర్ చూసి ఇక్కడుండే మనం అయిపోయేలా ఉన్నాం అని కోమలి జారుకుంటుంది.
రూప నిప్పు సెగ పెడతాను అని విజయాంబిక చేయికి లైటర్‌తో నిప్పు పెట్టి చేయి కాల్చేస్తుంది. విజయాంబిక ఇళ్లు పీకి పందిరి వేసేలా అరుస్తుంది. విరూపాక్షి రుక్మిణితో చెమటలు పడుతుంది అంటే విషం తలకు ఎక్కుతున్నట్లు ఉంది అని చెప్పడంతో రూప మందారానికి మందులు తీసుకురమ్మని చెప్పి మూడు టాబ్లెట్స్ ఒక్క సారి వేసి విజయాంబిక మింగేలా చేస్తారు. దాంతో విజయాంబికకు విరేచనాలు మొదలై బాత్‌రూంకి పరుగులు పెడుతుంది. రూప వాళ్లు నవ్వుకుంటారు.
కోమలి రూపతో చేసిన ఛాలెంజ్‌లో గెలవాలి అని రూప బంటీ కోసం తెచ్చిన బట్టలు దొంగ తనం చేసి తీసుకెళ్లి బయట కాల్చేస్తుంది. విజయాంబిక బాత్‌రూమ్‌కి తిరగలేక కూలబడి పోతుంది. మీరంతా కావాలనే చేస్తున్నారు కదా అంటే మరి నువ్వు మా అమ్మని దొంగని చేయాలి అనుకున్నావ్ కదా అంటుంది. అంటే ఇదంతా మీరు ఆడుతున్న నాటకం కదా అని విజయాంబిక అంటే ఎస్ అని రూప అంటుంది. ఉదయం రూప, రాజులు బంటీ దగ్గరకు వచ్చి నిద్ర లేపి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తారు. బంటీ ఇద్దరినీ హగ్ చేసుకొని థ్యాంక్యూ అమ్మ థ్యాంక్యూ నాన్న అంటాడు. తర్వాత విరూపాక్షి విష్ చేస్తుంది. మందారం కూడా చెప్తుంది. సూర్యప్రతాప్ కూడా విష్ చేస్తాడు. ఇక కోమలి వచ్చి ఆ ఇద్దరి కంటే ముందు నేను విష్ చేయాలి అనుకున్నా చేయలేకపోయా సూర్యప్రతాప్‌కి నా మీద అనుమానం వస్తుందేమో అని అనుకుంటుంది. లోపలికి వెళ్లాలా వద్దా అనుకుంటూ ఒక్కదాన్నే వెళ్తే కష్టమని దీపక్, విజయాంబికలు తోడు ఉంటే బెటర్ అని వెళ్లి విజయాంబికను నిద్ర లేపుతుంది. విజయాంబిక బాత్‌రూంకి తిరిగి తిరిగి నీరసపడిపోయి ఉంటుంది.
విజయాంబిక కోమలిని రమ్మని అంటే నేను రాను అని విజయాంబిక అంటుంది. దాంతో కోమలి మీకు వారు పెట్టిన టార్చర్‌కి డబుల్ బాధ ఇప్పుడు అది పడుతుంది అని బంటీ కోసం రూప తెచ్చిన బట్టలు కాల్చేశానని నేను తెచ్చిన బట్టలు బంటీ వేసుకుంటే అది ఆ బాధతో చస్తుందని విజయాంబికను తీసుకెళ్తుంది. ఇక కోమలి వచ్చి గుడికి వెళ్లి వచ్చానని కవర్ చేస్తుంది. కోమలి విష్ చేస్తే బంటీ థ్యాంక్స్ కూడా చెప్పడు.. కోమలి అడిగితే మామూగా అనేస్తాడు. రాజు సూర్యప్రతాప్‌తో రాత్రి మొత్తం రుక్మిణి, మందారం జాగ్రత్తగా చూసుకున్నారని చెప్తాడు. ఇక సూర్య కోమలితో అమ్మా రూప బంటీ కోసం బట్టలు తీసుకొచ్చారు కదా ఇవ్వు అని అంటాడు. కోమలి తీసుకొచ్చి ఇస్తుంది. వాటిలో రూప సెలక్ట్ చేసిన బట్టలు ఉండటం చూసి కోమలి, విజయాంబిక షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.




















