Ammayi garu Serial August 11th to 15th Recap అమ్మాయి గారు సీరియల్ వీక్లీ: కోమలికి చెక్ పెట్టలేరా? రూప సవాల్! రాజు మాస్టర్ ప్లాన్, విరూపాక్షికి భారీ షాక్!
Ammayi garu Serial August 11th to 15th Weekly కోమలి రూపగా సూర్యప్రతాప్‌కి దగ్గరవుతూ రూపని దూరం చేయడానికి కట్రలు చేస్తుండటంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి.

Ammayi garu Serial August 11th to 15th Weekly Episodes అమ్మాయిగారు సీరియల్ ఈ వారం మొత్తం ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా మారింది. వారం మొత్తంలో జరిగిన హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. రాజు కోమలి రూప కాదు అని నిరూపించాలని మన ఇద్దరికీ ఈ రోజు చాలా స్పెషల్ రోజు ఏంటో చెప్పు అని అడుగుతాడు. దాంతో కోమలి మన ఇద్దరం చాలా ఏళ్ల తర్వాత మొదటి సారి కలిశామని బంటీని కూడా రోజు కలిశానని చెప్పి అందర్ని షాక్‌కి గురి చేస్తుంది. సూర్యప్రతాప్ కోమలితో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా కూతురు రూపే అని నేను నమ్ముతున్నా అని చెప్పేస్తాడు. రుక్మిణిలా ఉన్న అసలైన రూప బిత్తరపోతుంది. తాను తండ్రి ప్రేమకు దూరం అయిపోతున్నా అని చాలా బాధ పడుతుంది. సంవత్సరం క్రితం మన మధ్య జరిగింది తనకు ఎలా తెలుసు రాజు, రుక్మిణిలు మాట్లాడుకుంటారు. తీరా చూస్తే కోమలికి ఆ విషయం దీపక్ మెసేజ్ చేసి చెప్తాడు. సాయం చేసినందుకు కోమలి దీపక్‌కు చాలా థ్యాంక్స్ చెప్తుంది. కోమలి మాట్లాడుతుంటే దీపక్ కోమలిని కసిగా చూస్తుంటాడు. కోమలి వెనక్కి తిరిగి ఉండటంతో హగ్ చేసుకోవడానికి వెళ్తాడు. విజయాంబిక రావడంతో దీపక్ సైలెంట్ అయిపోతాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది అని కోమలికి విజయాంబిక అడగటంతో ఇదంతా దీపక్ పనే అని కోమలి చెప్తుంది. విజయాంబిక కొడుకుని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి.. నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా గ్యాప్ తీసుకో మేం ఈ లోపు అన్నీ చెప్పేస్తాం అంటుంది.
విరూపాక్షి రూప, రాజులతో ఇది కచ్చితంగా దీపక్, విజయాంబికల పనే వాళ్లే ఈ విషయం చెప్పుంటారు. కచ్చితంగా వాళ్ల అంతు చూడాలి ఆ అమ్మాయి డబ్బు కోసమే ఇదంతా చేసుంటుంది. అని అనుకుంటారు. కోమలి స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటే దీపక్ వెనక నుంచి కోమలిని చూసి హగ్ చేసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఎంతో ట్రై చేశా కానీ నన్ను నేను ఆపుకోలేకపోయాను అని అంటాడు. కోమలి దీపక్‌ని లాగి పెట్టి ఒక్కటిస్తుంది. దీపక్ ఎగిరెళ్లి బెడ్ మీద పడతాడు. కోమలి చాలా తిడుతుంది. విజయాంబికకు విషయం తెలిసి చితక్కొడుతుంది. దీపక్ కన్ను లొట్టపోయి ముక్కూ ముఖం ఏకమైపోయి కళ్లు కూడా కనిపించకుండా పడుంటాడు. దీపక్ కోమలి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాడు. అదంతా మందారం చూస్తుంది. మందారం దగ్గర ముగ్గురు విషయం దాచేసి నటిస్తారు. మందారం కోమలితో నువ్వు మా అమ్మాయిగారు కాదని అందరికీ తెలుసు ముఖ్యంగా మా రాజన్నకి తెలుసు. తెలిసినా సైలెంట్‌గా ఉన్నాడు అంటే పెద్ద ప్లానే చేస్తున్నాడని అర్థం. జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది.
కోమలికి తన లవర్ అశోక్‌ని కలవడానికి ఎవరికీ కనిపించకుండా సీక్రెట్‌గా వెళ్లడం రాజు మేడ మీద నుంచి చూసి ఫాలో అవుతాడు. అశోక్‌ని చూసి కోమలి హగ్ చేసుకోడం రాజు చూస్తాడు. కోమలి అశోక్‌తో నేను ఇక్కడ ఉండలేను నీతో వచ్చేస్తా అంటుంది. దాంతో అశోక్ కోమలితో మనం డబ్బు కోసం కదా ఇదంతా చేస్తున్నాం కదా ఆ దీపక్ ఇంకో సారి నీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు. డీఎన్‌ఏ రిపోర్ట్స్ కోసం భయపడుతూ నాకు కాల్ చేశావ్ గుర్తుందా నేనే డీఎన్‌ఏ రిపోర్ట్స్ మార్చాను అంటాడు. మరి జీవన్ తాను చేశానని చెప్పాడు అని కోమలి అంటే నేనే ఆ జీవన్‌కి చెప్పానని అంటాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం రాజు చూస్తాడు. చాటుగా నిల్చొని ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందా అని అనుకుంటాడు. వాడికి కూడా ఈ నాటకం గురించి తెలిసే ఉంటుంది. వాడు ఎవడో తెలుసుకోవాలి అనుకుంటాడు. రాజు దగ్గరకు వెళ్లే టైంకి అశోక్ వెళ్లిపోతాడు. వచ్చిన అవకాశం మిస్ అయింది అని రాజు అనుకుంటాడు. ఇక రాజు లోపలికి వెళ్తే మందారం పిలుస్తుంది. బయట నుంచి వస్తున్నావేంటి అని అడిగితే ఆ దొంగమ్మాయి ఎవరినో కలిసింది.. వాడిని పట్టుకుంటే ఈ నాటకం బయట పడుతుంది అని అంటాడు. మందారం దీపక్ కోమలితో తప్పుగా ప్రవర్తించాడని తాను వెళ్లిన వరకు గొడవ పడి వెళ్లగానే మాట మార్చేశారని చెప్తుంది. ఇక్కడ జరిగిన గొడవ చెప్పడానికే పిలిచినట్లు ఉంటుందని మందారం అంటుంది. రాజు మనసులో నువ్వు ఎవరో తెలియాలి అంటే నిన్ను కలిసిన వాడు ఎవడో తెలియాలి అలా తెలియాలి అంటే నువ్వు ఇక్కడ ఇబ్బంది పడాలి నువ్వు ఇబ్బంది పడేలా నేను చేస్తాను అని రాజు అనుకుంటాడు.
బంటీకి తినిపిస్తూ బంటీ వెనక పరుగెడుతూ విరూపాక్షి మెట్ల మీద నుంచి పడిపోబోతుంది. చేతిలో గ్లాస్, ప్లేట్ కింద పడిపోతాయి. విరూపాక్షి గాజు పెంకుల మీద పడిపోయే టైంకి సూర్యప్రతాప్ చూసి పట్టుకుంటాడు. సూర్య అని విరూపాక్షి ఏడుస్తూ సూర్యప్రతాప్ గుండెల మీద వాలిపోతుంది. అవకాశం వచ్చింది కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు విరూపాక్షి అని సూర్యప్రతాప్ అంటాడు. నిన్ను పట్టుకున్నది కాపాడటానికి మాత్రమే. నా కళ్ల ముందు ఎవరు ప్రమాదంలో ఉన్నా చూస్తూ ఊరుకోలేని నా మనస్తత్వం నిన్ను కాపాడింది నీ ప్లేస్‌లో ఇంటి పని మనిషి ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతా అని అంటాడు. విరూపాక్షి చాలా ఏడుస్తుంది. నేను మరీ అంత దిగజారను సూర్య అని అంటుంది. దాంతో సూర్యప్రతాప్ పాతికేళ్ల క్రితమే నీ దిగజారుడు తనాన్ని చూసేశాఅంటాడు. విరూపాక్షి చాలా ఏడుస్తుంది. నా విషయంలో నువ్వు చేసిన ఘోరాన్ని జీవితంలో మర్చిపోలేను క్షమించలేను అని అంటాడు. విరూపాక్షి ఏడుస్తుంటే రాజు, రూపలు ఓదార్చుతారు. రాఘవ దొరికే వరకు మనకు సమస్యలు తప్పవు అనుకుంటారు.
రాజు రూపలు బంటీని తీసుకొని షాపింగ్ బయల్దేరుతారు. విషయం తెలుసుకున్న విజయాంబిక కోమలితో రాజుతో నువ్వు వెళ్తానని గొడవ చేసి ఆ రూపని దూరం చేయ్ అని పంపిస్తుంది. రుక్మిణి బంటీని తీసుకొని సరదాగా మాట్లాడుకొని బయటకు వెళ్తుంటే కోమలి వచ్చి బంటీని ఆపుతుంది. బంటీ చేయి వదలమని రూప చెప్తుంది. దాంతో కోమలి నేనే అదే చెప్తున్నా వదులు అంటుంది. కోమలి బంటీని బలంగా లాగేయడంతో బంటీ కింద పడిపోతాడు. రుక్మిణి కోమలిని లాగిపెట్టి కొడుతుంది. నన్నే కొడతావా అని కోమలి అంటే రూప కోమలి గొంతు నులిపేసి గోడకి అణిచేసి అమ్మవారిలా మారిపోతుంది. నిన్ను చంపేస్తానే అని అక్కడే ఉన్న ఒక గాజు వస్తువుతో కోమలిని చంపడానికి వెళ్తుంది. కోమలి ఏడుపు నటిస్తూ సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి రుక్మిణి నన్ను కొట్టిందని రుక్మిణి మీద కంప్లైంట్ ఇస్తుంది. తనకు అనుగుణంగా చెప్పుకుంటుంది. బంటీని కొడుకు అనొద్దు అంటుందని చెప్తుంది. సూర్యప్రతాప్ కోపంగా ఆ మాట నువ్వు అన్నావా రుక్మిణి అని అరుస్తాడు. కోమలి చెప్పిన మాటలు పట్టుకొని సూర్యప్రతాప్ రూపని లాగిపెట్టి కొడతాడు. సూర్యప్రతాప్ రూపతో అసలేమనుకుంటున్నావ్ రుక్మిణి నువ్వు నువ్వు ఈరోజు ఇంట్లో ఉన్నావ్ అన్నా రూపతో సమానంగా ఉన్నావు అన్నా దానికి కారణం రూప.. రూప చనిపోయింది అన్న వార్త తెలిశాకే నీకు ఒక కుటుంబం ఉందని తెలిసింది. నువ్వు రూపలా ఉండటం వల్లే నీకు ఈ ఇంట్లో స్థానం లభించింది. బంటీ నిన్ను అమ్మలా అనుకున్నాడు నేను కూతురిగా అనుకున్నా కాబట్టే రాజుతో నీకు పెళ్లి చేశాను. ఇదంతా రూప లేదని నీకు దక్కాయి. రూప తిరిగి వచ్చింది కాబట్టి తాను కోరుకున్నవన్నీ తనకు దక్కాలి.. రూప మీద చేయి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావ్ అని సూర్యప్రతాప్ అరుస్తాడు. రూపకి సారీ చెప్పు అని అంటాడు. రూప కోమలికి సారీ చెప్తుంది. సూర్యప్రతాప్ అసలైన రూపతో ఇక నుంచి నువ్వు బంటీకి సంబంధించిన ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటాడు. తండ్రి మాటలకు రూప చాలా ఏడుస్తుంది. తల్లిని పట్టుకొని నాకొడుకుని నా భర్తని నా తండ్రే వేరే వాళ్లకి ఇచ్చేస్తున్నాడని రూప చాలా ఏడుస్తుంది. విరూపాక్షి కూతుర్ని ఓదార్చుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పమని అంటే రూప ఏడుస్తూ రాఘవ దొరికే వరకు నేను ఎన్ని వేషాలు అయినా వేస్తానని అంటుంది.
సూర్యప్రతాప్ రాజుతో కోమలి, బంటీని షాపింగ్‌కి తీసుకెళ్లమని చెప్తాడు. పెద్దయ్యగారి మాట కాదనలేక రాజు తీసుకెళ్తాడు. కోమలి కారులో బంటీని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. బంటీ కోమలి చేయి తోసేసి రాజుకి ఫోన్ ఇయర్‌ఫోన్స్ అడిగి పెట్టుకుంటాడు. కోమలి రాజుతో ఎలా ఉంది నా దెబ్బ మీరే నాకు భయపెట్టాలి అనుకున్నారు కదా నేను భయపెట్టగలను అనడానికి ఇది ఉదాహరణ మాత్రమే అంటుంది. రాజు ఏం మాట్లాడకుండా కారు సైడ్‌కి ఆపి కోమలిని దిగమని చెప్పి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్.. నువ్వు మనిషివేనా.. ఒక తల్లికి బిడ్డని దూరం చేయాలి అనుకుంటున్నావ్.. ఒక తండ్రికి బిడ్డని దూరం చేస్తున్నావ్.. ఒక భర్తకి భార్యని దూరం చేయాలని చూస్తున్నావ్? ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ నీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత ఇస్తా తప్పు ఒప్పుకొని వెళ్లిపో అని అంటాడు. కోమలి రాజుతో ఏంటి రాజు నన్ను భయపెట్టడానికి రాత్రి నా చీర కొంగు పట్టుకున్నావ్ ఇప్పుడు ఇంకోలా భయపెట్టాలి అనుకున్నావా.. ఎవరు భయపడరు అని అంటుంది. రాజు కోమలికి ఎంత చెప్పినా వినకపోవడంతో రాజు నీ పని చెప్తా అని కోమలిని కారు ఎక్కమని చెప్తాడు. బంటీకి సీట్ బెల్ట్ పెట్టి తాను కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. విపరీతమైన స్పీడ్‌లో వెళ్తూ కారు అటూ ఇటూ తిప్పుతాడు. కోమలి పడిపోతూ నెమ్మదిగా వెళ్లమని రాజుని బతిమాలుతుంది. కోమలి కారు దిగి వాంతులు చేసుకుంటుంది. కోమలికి వాటర్ బాటిల్ అందిస్తూ ఆనంద్ ఎంట్రీ ఇస్తాడు. ఆనంద్, కోమలి ఓకే కాలేజ్లో చదువుతున్నారు. ఈ మధ్య కాలేజ్‌కి రావడం లేదు అని ఆనంద్ అడుగుతాడు. ఏం లేదని ఇంట్లో వాళ్లకి బాలేదని కోమలి కవర్ చేసి ఆనంద్‌ని పంపేస్తుంది. విరూపాక్షి, మందారం రూపతో నీ కొడుకు పుట్టిన రోజుకి అన్నీ నువ్వే చేయు అని చెప్పడంతో రూప రాజుకి కాల్ చేస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను మన బంటీకి బట్టలు కొనాలి. నేను వెయిట్ చేస్తున్నా నువ్వు రా అని అంటుంది. దాంతో రాజు సరే అని కారు ఆగిపోయిందని చెప్పి కోమలిని నెట్టమని కోమలి కారు దిగగానే కోమలిని వదిలేసి వెళ్లిపోతాడు. రాజు, బంటీలు నువ్వుకుంటారు. కోమలి రాజుని తిట్టుకుంటుంది. కావాలనే ప్లాన్ చేసి వదిలేశాడని అనుకుంటుంది. చేతిలో ఫోన్ కూడా లేదు ఎలా వెళ్లాలి అని కోమలి అనుకుంటుంది.
రూప, రాజు బంటీలు షాపింగ్‌కి వెళ్తారు. కోమలి రోడ్డు మీద ఎండకు నడుచుకుంటూ తెగ ఆయాస పడుతుంది. షాపింగ్ పూర్తి చేసి తిరిగి వస్తుంటారు. కోమలి మాత్రం నడుస్తూనే ఉంటుంది. రూప కోమలిని చూసి రాజుకి కారు ఆపమని చెప్తుంది. ఆ రాక్షసిని నాన్నే నీతో పంపారు ఇప్పుడు నేను నీతో వస్తే మళ్లీ కోప్పడతారు. నేను ఇక్కడ నుంచి నడిచి వెళ్తాను.. మీరు దాన్ని తీసుకొని వచ్చేయండి అంటుంది. కోమలి రూపని చూసి షాక్ అయిపోతుంది. నన్ను నడిరోడ్డు మీద వదిలేసి రూపని తీసుకెళ్లాడా బంటీ పుట్టినరోజుకి ఆ బట్టలు ఎలా వేస్తుందో నేను చూస్తా అని అనుకుంటుంది.
రూప తల్లికి బట్టలు చూపించి మురిసిపోతుంది. రాజు వాళ్లు కూడా వస్తారు. కోమలి తెగ ఆయాస పడుతుంటే విజయాంబిక, దీపక్‌లు ఎదురెళ్లి ఏమైంది అన్ని షాప్‌లు తిరిగారా అంటే లేదు రాజు నాతో ఫుడ్ బాల్ ఆడాడని నడి రోడ్డు మీద వదిలేశాడని చెప్తుంది. విరూపాక్షి బంటీని పిలిచి మీ అమ్మ నీకు అదిరిపోయే బట్టలు తీసుకొచ్చిందని చెప్తుంది. బంటీ ఐలవ్‌యూ అమ్మ అని అంటాడు. కోమలి రూపలో నీకు ఎవరు బట్టలు తెమ్మన్నారు అని అడుగుతుంది. నువ్వు ఎవరు అని రూప అడుగుతుంది. బంటీ నేను తెచ్చిన బట్టలు వేసుకుంటాడు అని కోమలి అంటే నేను తెచ్చిన బట్టలు వేసుకుంటాడని రూప అంటుంది. బంటీ నేను తెచ్చిన బట్టలు వేసుకుంటే బంటీ నా కొడుకు అని నీ నోటితో నువ్వే చెప్పాలి నువ్వే వీడిని నాకు అప్పగించాలి అని కోమలి ఛాలెంజ్ విసురుతుంది. రూప సరే అంటుంది.
చంద్రకు డబ్బు ఇవ్వమని ఓకాయన వచ్చి 50 లక్షలు విరూపాక్షికి ఇస్తాడు. విజయాంబిక డబ్బు మీద కన్నేస్తుంది. విరూపాక్షి వెనకాలే వెళ్లి డబ్బు ఎక్కడ దాస్తుందో చూస్తుంది. విరూపాక్షినిసూర్యప్రతాప్ గెంటేయడానికి మన సమస్యలు పరిష్కారం కావడానికి ఆ డబ్బు కొట్టేయాలని కొడుకుతో చెప్తుంది. డబ్బు కొట్టేయడంతో విరూపాక్షి దొరికిపోతుందని అప్పుడు సూర్య విరూపాక్షిని గెంటేస్తాడని చెప్తుంది. ప్లాన్ సూపర్ అని ఇద్దరూ అనుకుంటారు. ఆ ప్లాన్ మొత్తం మందారం వినేసి చెప్తా మీ సంగతి అనుకుంటుంది. ఇవీ ఈ వారం హైలెట్స్.





















