Ammayi garu Serial Today August 15th: అమ్మాయి గారు సీరియల్: కోమలిని నడిరోడ్డు మీద వదిలేసిన రాజు.. బంటీ కోసం రూప, కోమలిల ఛాలెంజ్!
Ammayi garu Serial Today Episode August 15th రూప రాజులు షాపింగ్‌కి వెళ్లి కోమలిని నడిరోడ్డు మీద నడిచేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప రాజుకి కాల్ చేసి నేను షాపింగ్‌కి వస్తా వచ్చి తీసుకెళ్లు అని అంటుంది. రాజు సరే అని కారు మధ్యలో ఆపేసి కారు ట్రబుల్ ఇచ్చిందని చెప్తాడు. కోమలిని కిందకి దిగి నెట్టమని అంటాడు. కోమలి దిగి నెట్టగానే కోమలిని వదిలేసి వెళ్లిపోతాడు. రాజు, బంటీలు నువ్వుకుంటారు. కోమలి రాజుని తిట్టుకుంటుంది. కావాలనే ప్లాన్ చేసి వదిలేశాడని అనుకుంటుంది. చేతిలో ఫోన్ కూడా లేదు ఎలా వెళ్లాలి అని కోమలి అనుకుంటుంది.
రూప చెప్పిన అడ్రస్‌కి రాజు వెళ్తాడు. ఆ రాక్షసిని ఏం చేశావ్ రాజు అని రూప అడగగానే పాదయాత్ర చేయమని వదిలేశాం అని బంటీ చెప్తాడు. అందరూ నవ్వుకుంటారు. కోమలి రోడ్డు మీద ఎండకు నడుచుకుంటూ తెగ ఆయాస పడుతుంది. రాజు వాళ్లు హ్యాపీగా షాపింగ్‌కి వెళ్తారు. షాపింగ్ పూర్తి చేసి తిరిగి వస్తుంటారు. కోమలి మాత్రం నడుస్తూనే ఉంటుంది. రూప కోమలిని చూసి రాజుకి కారు ఆపమని చెప్తుంది. ఆ రాక్షసిని నాన్నే నీతో పంపారు ఇప్పుడు నేను నీతో వస్తే మళ్లీ కోప్పడతారు. నేను ఇక్కడ నుంచి నడిచి వెళ్తాను.. మీరు దాన్ని తీసుకొని వచ్చేయండి అంటుంది. కోమలి రూపని చూసి షాక్ అయిపోతుంది. నన్ను నడిరోడ్డు మీద వదిలేసి రూపని తీసుకెళ్లాడా బంటీ పుట్టినరోజుకి ఆ బట్టలు ఎలా వేస్తుందో నేను చూస్తా అని అనుకుంటుంది.
రాజు దగ్గరకు వెళ్లి దాంతో షాపింగ్‌కి వెళ్లడానికి నన్ను నడిరోడ్డు మీద దింపేస్తావా అని అడుగుతుంది. మరి అమ్మాయి గారు వెళ్లాల్సిన షాపింగ్‌కి నువ్వు వచ్చావ్ ఆ బాధ ఎలా ఉంటుందో ఆమె భర్తగా నాకు తెలుసు అందుకే అమ్మాయి గారి కోసం వెళ్లాను. చెప్పాను కదా అమ్మాయి గారు బాధ పడితే నేను చూడలేను ఎలా ఉంది నా దెబ్బ అంటాడు. అంతా సూర్యప్రతాప్‌కి చెప్తాను అని కోమలి అంటే సాక్ష్యం ఉందా అని రాజు అంటాడు. నువ్వేం చేయలేవ్ కారు ఎక్కు అని అంటాడు. కోమలి సైలెంట్ అయిపోతుంది. వస్తే రా లేకపోతే లేదు అని రాజు అంటే కోమలి కారు ఎక్కుతుంది.
రూప తండ్రి కంట పడకుండా ఇంట్లోకి షాపింగ్ బట్టలు తీసుకొని వెళ్తుంది. మందారం గట్టిగా అరిచేస్తుంది. దాంతో రూప గట్టిగా అరవకు మందారం అంటే ఎవరూ ఇంట్లో లేరు పర్లేదు అని మందారం చెప్తుంది. ఇద్దరూ విరూపాక్షి దగ్గరకు వెళ్తారు. రూప తల్లికి బట్టలు చూపించి మురిసిపోతుంది. రాజు వాళ్లు కూడా వస్తారు. కోమలి తెగ ఆయాస పడుతుంటే విజయాంబిక, దీపక్‌లు ఎదురెళ్లి ఏమైంది అన్ని షాప్‌లు తిరిగారా అంటే లేదు రాజు నాతో ఫుడ్ బాల్ ఆడాడని నడి రోడ్డు మీద వదిలేశాడని చెప్తుంది. ఇక విరూపాక్షి బంటీని పిలిచి మీ అమ్మ నీకు అదిరిపోయే బట్టలు తీసుకొచ్చిందని చెప్తుంది. బంటీ ఐలవ్‌యూ అమ్మ అని అంటుంది. కోమలి వెళ్లి నీకు ఎవరు బట్టలు తెమ్మన్నారు అని అడుగుతుంది. నువ్వు ఎవరు అని అడుగుతుంది. నేను రూపని అని కోమలి అంటే చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అంటుంది. బంటీ నేను తెచ్చిన బట్టలు వేసుకుంటాడు అని కోమలి అంటే నేను తెచ్చిన బట్టలు వేసుకుంటాడని రూప అంటుంది. బంటీ నేను తెచ్చిన బట్టలు వేసుకుంటే బంటీ నా కొడుకు అని నీ నోటితో నువ్వే చెప్పాలి నువ్వే వీడిని నాకు అప్పగించాలి అని అంటుంది. నీతో నాకు ఛాలెంజ్ ఏంటి అని రూప అని ముచ్చట పడుతున్నావ్ కదా అని ఛాలెంజ్‌కి ఒకే చెప్తుంది.
ఇంతలో చంద్రకు డబ్బు ఇవ్వమని ఓకాయ వచ్చి 50 లక్షలు విరూపాక్షికి ఇస్తాడు. విజయాంబిక డబ్బు మీద కన్నేస్తుంది. విరూపాక్షి వెనకాలే వెళ్లి డబ్బు ఎక్కడ దాస్తుందో చూస్తుంది. విరూపాక్షినిసూర్యప్రతాప్ గెంటేయడానికి మన సమస్యలు పరిష్కారం కావడానికి ఆ డబ్బు కొట్టేయాలని కొడుకుతో చెప్తుంది. డబ్బు కొట్టేయడంతో విరూపాక్షి దొరికిపోతుందని అప్పుడు సూర్య విరూపాక్షిని గెంటేస్తాడని చెప్తుంది. ప్లాన్ సూపర్ అని ఇద్దరూ అనుకుంటారు. ఆ ప్లాన్ మొత్తం మందారం వినేసి చెప్తా మీ సంగతి అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















