అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 19th:మ్యాడీ,లక్ష్మీ భార్యాభర్తలని తెలుసుకున్న త్రిష...శ్రీలక్ష్మీని వదిలించుకునేందుకు మ్యాడీ చెప్పిన అబద్ధం ఏంటి..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 19th: మ్యాడీ,లక్ష్మీ భార్యాభర్తలని తెలుసుకున్న త్రిష...శ్రీలక్ష్మీని వదిలించుకునేందుకు మ్యాడీ చెప్పిన అబద్ధం ఏంటి..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఫ్రెషర్స్‌ డే ఫంక్షన్‌లో అద్భుతమైన స్వీచ్‌ ఇచ్చిన శ్రీలక్ష్మీని అధ్యాపకులతోపాటు అందరూ అభినందిస్తుంటే...తన భర్త మ్యాడీ మాత్రం విషెష్‌ చెప్పలేదని అతని వెంటపడి శ్రీలక్ష్మీ ఆటపట్టిస్తుంది. కాలేజీ మొత్తం పరిగెత్తిస్తూ ఎట్టకేలకు మొగుడితో విషెష్‌ చెప్పించుకుంటుంది. అది చూసిన త్రిష చాలు ఉడుక్కుంటుంది.ఈ ఎర్రబస్సును ఎలాగైనా మ్యాడీకి దూరం చేయాలని భావిస్తుంది. శ్రీలక్ష్మీ దగ్గర ఉన్న మ్యాడీని పక్కకు లాక్కుని వెళ్తుంది. ఏంటని మ్యాడీ త్రిషను ప్రశ్నించగా....నువ్వు అంటే నాకు చాలా ఇష్టమని చెబుతుంది.
 
అది అందరికీ తెలుసు కదా నువ్వు అంటే కూడా నాకు చాలా ఇష్టమేనని అంటాడు. ఆలా కాదాని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడంతో మ్యాడీ బిగ్గరగా నవ్వి...ఇప్పటి వరకు నేను విన్న జోక్‌లో ఇదే హైలెట్‌ అని అంటాడు. దీంతో త్రిష జోక్‌ కాదని చాలా సీరియస్‌గా చెబుతున్నానని అంటుంది. ఆ మాటలు విన్న మ్యాడీ ఇప్పుడు ఏమైందని...మనం చాలా మంచి ప్రెండ్స్‌గా ఉన్నాం కదా ఇప్పుడు ఈ లవ్‌ ఎందుకుని అంటాడు. నేను హీరో అవ్వడమే నాలక్ష్యమని...నాకు ఈ లవ్‌లాంటివి పడవని అంటాడు. నేను కూడా ఇప్పటి వరకు దీని గురించి ఆలోచించలేదని...కానీ ఆ శ్రీలక్ష్మీ నిన్ను నాకు కాకుండా ఎక్కడ ఎగరేసుకునిపోతుందోనని భయంగా ఉందని అంటుంది.
 
ఆ ఎర్రబస్సు నన్ను ఎగరేసుకునిపోవడం ఏంటని మ్యాడీ త్రిషను ప్రశ్నిస్తాడు. నేను శ్రీముఖలింగంలో చూసిన లక్ష్మీ వేరని..ఇప్పుడు చూస్తున్న లక్ష్మీ వేరని త్రిష అంటుంది.అప్పుడు నీమాటన్నా, నువ్వుఅన్నా చాలా భయం, భక్తితో ఉండేదని....కానీ ఇప్పుడు ఆ రెండూ కనిపించడం లేదని అంటుంది.పైగా సొంతమనిషిలా నిన్ను ట్రీట్‌చేస్తుందని అదే అర్థం కావడం లేదని అంటుంది. 
 
హిట్లర్‌లాంటి మీ తాతయ్యనే తన బుట్టలో వేసుకున్న శ్రీలక్ష్మీకి నిన్ను బుట్టలో వేసుకోవడం పెద్దలెక్క కాదని అంటుంది. ఆ మాటలు విన్న మ్యాడీ...నిజంగానే త్రిషకు అనుమానం వచ్చిందని అర్థమవుతుంది.అలాంటిదేమీ లేదని కొట్టిపారేసి  వెళ్లిపోతాడు.త్రిషకు వచ్చిన అనుమానం లాంటిదే కాలేజీలోఇంకా  ఎవరికైనా రాకముందే ఆ శ్రీలక్ష్మీకి గట్టి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాడు.అప్పుడే ఆమెను విక్రమ్‌ అభినందిస్తుండగా అక్కడికి మ్యాడీ వచ్చి లక్ష్మీని పక్కకు లాక్కెళతాడు. వాడికి మన గురించి ఏం చెప్పావని అడగ్గా...నేను ఏం చెప్పలేదని శ్రీలక్ష్మీ అంటుంది. 
 
మనకు పెళ్లి అయిపోయిందని,భార్యాభర్తలమని చెప్పావా లేదా అని నిలదీస్తాడు. ఆమాటలు విన్న త్రిష షాక్‌కు గురవుతుంది. అంటే వీళ్లిద్దరికీ పెళ్లయిపోయిందన్నమా అని అనుకుంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నారని శ్రీలక్ష్మీ ప్రశ్నించగా....నువ్వు చేసిన డ్యాన్స్‌లు చూసి ఆ త్రిషకు అనుమానం వచ్చిందని అంటుంది.తెలిస్తే తెలవనివ్వండి అందులో తప్పేముందని శ్రీలక్ష్మీ అంటుంది. ఏదో ఓరోజు అందరికీ ఆ నిజం తెలియాల్సిందే కదా అనిం అంటుంది.
 
శ్రీలక్ష్మీకి ఎన్ని చెప్పినా నన్ను వదలడంలేదని...కాబట్టి ఆమె మనసుపై దెబ్బ కొట్టాలని మ్యాడీ అనుకుంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదా....నేను నిన్ను వద్దనుకుంటున్నానంటే నా మనసులో ఇంకొకరు ఉన్నారని తెలియడం లేదా అని అంటాడు. అందుకే నిన్ను పెళ్లిచేసుకున్నా కనీసం ముట్టుకోలేదని అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నన్ను విడిచి పోవడం లేదని మండిపడతాడు. మ్యాడీ మాటలను లక్ష్మీ కొట్టిపారేస్తుంది.ఆ అమ్మాయి ఎవరో చెప్పమని నిలదీస్తుంది. దీంతో చేసేదేమీ లేక మ్యాడీ త్రిష పేరు చెబుతాడు. నేను త్రిషను ఎంతో ప్రేమిస్తున్నానని...ఆమెనే పెళ్లిచేసుకోవాలనుకున్నానని చెప్పడంతో ఆ మాటలు విన్న త్రిష ఆనందంతో పొంగిపోతుంది. మ్యాడీ మాటలకు  శ్రీలక్ష్మీ చాలా బాధపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget