Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Jagadhatri Serial Today Episode August 10th: కేదార్‌కు సింధూ మసాజ్....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. కేదార్‌ను అవమానించిన యువరాజుకు జగధాత్రి గట్టిగా బుద్ధి చెబుతుంది. దీంతో కమలాకర్ యువరాజు తరఫున సారీ చెప్పి కేదార్‌ను భోజనానికి పిలవడంతో ధాత్రి కొంత శాంతిస్తుంది. అటు స్టేషన్‌లోనే సింధూ కట్టెలపొయ్యి పెట్టి మంటపెట్టడంతో పొగ కమ్మేస్తుంది. లోపలికి వెళ్లిన కేదార్, జగధాత్రి ఆమెను తిట్టి స్టేషన్‌లో ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరిస్తారు. సింధూ కట్టిన ఉయ్యాల ఎక్కి కిందపడిన కేదార్‌కు నడుం పట్టేయడంతో సింధూ మసాజ్ చేస్తుంది. అదిచూసిన జగధాత్రి కోపంతో కేదార్‌ను లాఠీ తీసుకుని రెండు వేస్తుంది.
యువరాజుకు బుద్ధిచెప్పిన ధాత్రి
భోజనానికి కూర్చున్న కేదార్‌ను యువరాజు, నిషిక అవమానించడంతో జగధాత్రికి కోపం వస్తుంది. మీరు తలకిందులుగా తపస్సు చేసినా కేదార్ వ్యక్తిత్వాన్ని అందుకోలేరని అంటుంది. అయినా కేదార్‌ది మీస్థాయి కానేకాదని అంటుంది.అందుకే మీ పక్కన కూర్చునే అర్హత తనకు లేకపోవడం కాదని....తన పక్కన కూర్చునే అర్హత మీకు ఎప్పటికీ రాదని గట్టిగా బుద్ధిచెబుతుంది. ఇంతలో కమలాకర్ కల్పించుకుని యువరాజును మందలిస్తాడు. ఇంటికి శత్రువు వచ్చినా భోజనం పెట్టే వంశం మనదని...అంటాడు.అలాంటిది కేదార్‌ను ఎందుకు తిట్టావని గట్టిగా కోప్పడతాడు. అతను ఈ ఇంటి వారసుడు అవునో కాదో తర్వాత సంగతి...ముందు భోజనానికి కూర్చున్న వాడిని లేపడం మంచి పద్ధతి కాదని అంటాడు. యువరాజు, నిషిక తరఫున కేదార్‌కు కమలాకర్ సారీ చెబుతాడు. వచ్చి కలిసి కూర్చుని భోజనం చేయాల్సిందిగా కోరతాడు. జగధాత్రి వెళ్లమని చెప్పడంతో కేదార్ వెళ్లి అందరి మధ్యలో కూర్చుని భోజనం చేస్తాడు. యువరాజు కోపంతో రగిలిపోతుంటే...కమలాకర్ బాబాయి వచ్చి కూర్చుని అన్నం తినమని గట్టిగా చెప్పడంతో యువరాజు వచ్చి భోజనం చేస్తాడు.
ధాత్రి చీరకట్టుకుని నవ్వులపాలైన కేదార్
జగధాత్రి స్నానం చేయడానికి వెళ్తూ మంచంపై చీరపెడుతుంది. నిద్రమత్తులో ఉన్న కేదార్ ఆ చీర దుప్పటి అనుకుని చుట్టుకుని పడుకుంటాడు. కింద నుంచి కౌషికి పిలవడంతో జగధాత్రి కేదార్‌ను కిందకు వెళ్లమని చెబుతుంది. నిద్రమత్తులో ఉన్న కేదార్...చీర ఒంటికి చుట్టుకున్న సంగతి మర్చిపోయి అదే విధంగా కిందకు వస్తాడు. మధ్యలో కాచీ చూసి చెబుతున్నా వినిపించుకోకుండా కిందకు వచ్చి అందరి ముందు నవ్వులపాలవుతాడు. జగధాత్రి వచ్చి చెప్పడంతో అద్దంలో చూసుకుని చేసిన తప్పు తెలుసుకుని మేడమీదకు పరుగు తీస్తాడు.
స్టేషన్‌లో పొగబెట్టిన సింధూ
కేదార్, జగధాత్రి ఆఫీసుకు బయలుదేరగా....అప్పటికే అక్కడికి వచ్చిన రమ్య ఆఫీసు నుంచి పొగ వస్తుందని చెబుతుంది. దీంతో వాళ్లిద్దరూ అక్కడికి వచ్చి చూస్తారు. కిటికీలు, తలుపులు అన్ని వేసి ఉండటం చూసి కంగారుపడతారు. సింధూ లోపలే ఉందని తెలుసుకుని పరుగెత్తుతారు. తలుపు తీసుకుని లోపలికి వెళ్లి కిటికీలు అన్నీ తెరుస్తారు. అప్పుడే సింధూ నేలపై పడిపోయి ఉండటం చూసి కేదార్ కంగారుగా వెళ్లి తనను లేపుతాడు. ఏమైందని సింధూ విసుగ్గా అడుగుతుంది. పొగలో నువ్వు స్పృహ తప్పిపడిపోయావని చెబితే...నేను యోగాసనాలు వేస్తున్నానని చెబుతుంది. మరి ఈ పొగ ఏంటని అడిగితే.. రాత్రి గ్యాస్ అయిపోయిందని నీళ్లు కాచుకోవడానికి కట్టెలపొయ్యి పెట్టుకున్నానని చెబుతుంది. ఇంతలో లోపలికి వచ్చిన సాధూసార్ పోలీసుస్టేషన్‌లో ఈ దుకాణం ఏంటని...ఐదు నిమిషాల్లో మొత్తం క్లియర్ చేయాలని చెప్పి వెళ్లిపోతాడు.
కేదార్‌కు సింధూ మసాజ్...కోపంతో రగిలిపోయిన ధాత్రి
ఆఫీసునే సింధూ ఇంటిగా మార్చేయడంతో కేదార్, జగధాత్రి చూసి నవ్వుకుంటారు. త్వరగా అద్దెఇంటికి మారిపొమ్మని చెబుతారు. ఇంతలో సింధూకట్టిన ఉయ్యాల ఎక్కి కేదార్ కిందపడిపోవడంతో నడుం పట్టేస్తుంది. సింధూ వెళ్లి కేదార్ నడుము నొక్కడంతోపాటు బోర్లాపడుకోబెట్టి ఒంటిపై తొక్కుతుంది. కేదార్‌కు హాయిగా ఉన్నా...జగధాత్రి మాత్రం కోపంతో రగిలిపోతుంది. సింధూను తిట్టి కేదార్‌ను తీసుకుని బయటకు వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా మారిపోయావంటూ లాఠీ తీసుకుని కేదార్‌ను పిచ్చికొట్టుడు కొడుతుంది.
Before You Go
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
ట్రెండింగ్ వార్తలు





















