Ammayi garu Serial Today August 13th: అమ్మాయి గారు సీరియల్: కోమలిపై రూప ఉగ్రరూపం.. కోమలి కుట్రతో రూపపై తండ్రి ఆగ్రహం! బంటీ ఎవరితో ఉంటాడు?
Ammayi garu Serial Today Episode August 13th రూప కోమలి మధ్య బంటీ కోసం గొడవ జరగడం రూప కోమలిని కొట్టడం సూర్య రూపగా ఉన్న రుక్మిణిని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక కొడుకుతో రాఘవ, కోమలి దొరికేలోపు రూప, విరూపాక్షిలను గెంటేయాలని అనుకుంటారు. కోమలి దగ్గరకు దీపక్ వెళ్తాడు. నిన్న ఇచ్చింది సరిపోలేదా మళ్లీ వచ్చావ్ అని కోమలి అడుగుతుంది. దీపక్ మనసులో ఒళ్లంతా విషం నిండిపోయిన్నా నిన్ను కాటేయలేని పరిస్థితి నీ అవసరం తీరిపోగానే నిన్ను కాటేస్తా నిన్ను వదలను అని అనుకుంటాడు.
విజయాంబిక వచ్చి ఏంట్రా కోమలికి ఇంకా విషయం చెప్పలేదా అని అడిగి కోమలితో నువ్వు రూపలా నటించాల్సిన మంచి సీన్ వచ్చింది. రాజు రూపలు బంటీని తీసుకొని షాపింగ్ బయల్దేరారు. రూపకి తండ్రిని దూరం చేస్తే బయట పడుతుంది అనుకున్నాం బయట పడలేదు. ఇప్పుడు దాని ప్రాణమైన బంటీని దూరం చేయాల్సిన టైం వచ్చింది. రాజుతో నువ్వు వెళ్తానని గొడవ చేసి ఆ రూపని దూరం చేయ్ అని కోమలిని పంపిస్తుంది. సరే అని కోమలి హాల్‌లోకి వెళ్తుంది.
రుక్మిణి బంటీని తీసుకొని సరదాగా మాట్లాడుకొని బయటకు వెళ్తుంటే కోమలి వచ్చి బంటీని ఆపుతుంది. బంటీ చేయి వదలమని రూప చెప్తుంది. దాంతో కోమలి నేనే అదే చెప్తున్నా వదులు అంటుంది. మర్యాదగా చెప్తున్నా చేయి వదులు అని రూప అంటే బంటీని షాపింగ్‌కి తీసుకెళ్లాలి చేయి వదులు అంటుంది. బంటీని షాపింగ్‌కి తీసుకెళ్లడానికి నువ్వు ఎవర్తివే అని రుక్మిణి అడుగుతుంది. బంటీకి ఏం కావాలో నాకు తెలుసు మొన్నటివరకు గూడెంలో బతికిన నీకేం తెలుసు అని కోమలి అని బంటీని లాగితే బంటీ రాను అని రుక్మిణి అమ్మతోనే వస్తాను అని అంటాడు.
చంద్ర కలుగజేసుకొని బంటీకి ఎవరు నచ్చితే వాళ్లతో వెళ్లనీ అంటే కోమలి బంటీ చిన్న పిల్లాడు అని బంటీని లాగేస్తుంది. దాంతో బంటీ కింద పడిపోతాడు. అమ్మా అని బంటీ పిలుస్తాడు. రూప, రాజులు పరుగెత్తి బంటీ నీకు ఏం కాలేదు కదా అని కంగారు పడతారు. రుక్మిణి కోమలిని లాగిపెట్టి కొడుతుంది. నన్నే కొడతావా అని కోమలి అంటే రూప కోమలి గొంతు నులిపేసి గోడకి అణిచేసి అమ్మవారిలా మారిపోతుంది. నిన్ను చంపేస్తానే అని అక్కడే ఉన్న ఒక గాజు వస్తువుతో కోమలిని చంపడానికి వెళ్తుంది. ఇంతలో అమ్మా రుక్మిణి అని చంద్ర అరుస్తాడు. దాంతో రుక్మిణి ఆగుతుంది. చంద్ర వచ్చి ఆ వస్తువు తీసుకొని ఏంటి అమ్మా ఈ ఆవేశం అని అంటాడు.
కోమలి ఏడుపు నటిస్తూ ఎందుకు ఆపారు బాబాయ్ ఈ ఇంట్లో బతకడం కంటే నేను చావడమే బెటర్. నేను ఉంటే నీకు గుర్తింపు ఉండదు రుక్మిణి నన్ను చంపేయ్ అని అంటుంది. ఇంతలో సూర్యప్రతాప్ కిందకి వచ్చి ఏమైందని అడుగుతాడు. కోమలి నాన్న అని సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి రుక్మిణి నన్ను కొట్టిందని రుక్మిణి మీద కంప్లైంట్ ఇస్తుంది. రుక్మిణి నిజం చెప్పాలని ప్రయత్నించినా కోమలి ఆపేస్తుంది. తనకు అనుగుణంగా చెప్పుకుంటుంది. బంటీని కొడుకు అనొద్దు అంటుందని చెప్తుంది. సూర్యప్రతాప్ కోపంగా ఆ మాట నువ్వు అన్నావా రుక్మిణి అని అరుస్తాడు. కోమలి చెప్పిన మాటలు పట్టుకొని సూర్యప్రతాప్ రూపని లాగిపెట్టి కొడతాడు. అందరూ షాక్ అయిపోతారు.
సూర్యప్రతాప్ రూపతో అసలేమనుకుంటున్నావ్ రుక్మిణి నువ్వు నువ్వు ఈరోజు ఇంట్లో ఉన్నావ్ అన్నా రూపతో సమానంగా ఉన్నావు అన్నా దానికి కారణం రూప.. రూప చనిపోయింది అన్న వార్త తెలిశాకే నీకు ఒక కుటుంబం ఉందని తెలిసింది. నువ్వు రూపలా ఉండటం వల్లే నీకు ఈ ఇంట్లో స్థానం లభించింది. బంటీ నిన్ను అమ్మలా అనుకున్నాడు నేను కూతురిగా అనుకున్నా కాబట్టే రాజుతో నీకు పెళ్లి చేశాను. ఇదంతా రూప లేదని నీకు దక్కాయి. రూప తిరిగి వచ్చింది కాబట్టి తాను కోరుకున్నవన్నీ తనకు దక్కాలి.. రూప మీద చేయి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావ్ అని సూర్యప్రతాప్ అరుస్తాడు. రూపకి సారీ చెప్పు అని అంటాడు. కోమలి నటిస్తూ పర్లేదులే నాన్న నా చెల్లినే కదా అంటుంది. సూర్యప్రతాప్ సారీ అడగమని అంటాడు.
సూర్యప్రతాప్ రాజుతో మీ అమ్మాయి గారిని నేను కొడితేనే ఊరుకోని నువ్వు ఇప్పుడెలా ఊరుకున్నావ్ అని అడుగుతాడు. ఇక రూప కోమలికి సారీ చెప్తుంది. సూర్యప్రతాప్ అసలైన రూపతో ఇక నుంచి నువ్వు బంటీకి సంబంధించిన ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటాడు. బంటీతో మీ అమ్మ రుక్మిణి కాదు రూప. బంటీ మాత్రం లేదు తాతయ్య నేను రుక్మిణి అమ్మతోనే ఉంటాను అని అంటాడు. సూర్యప్రతాప్ బంటీని రుక్మిణి దగ్గర నుంచి లాగేస్తాడు. కోమలితో అమ్మా రూప నువ్వు రాజుతో వెళ్లి బంటికి కావాల్సినవి కొను అని పంపిస్తాడు. రాజు కదలడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















