Ammayi garu Serial Today August 14th: అమ్మాయి గారు సీరియల్: గుండె పగిలేలా ఏడుస్తున్న రూప.. టక్కులమారికి చుక్కలు చూపించిన రాజు! కోమలి, ఆనంద్‌కలకు సంబంధమేంటి?
Ammayi garu Serial Today Episode August 14th సూర్యప్రతాప్ చెప్పడంతో రాజు కోమలిని బయటకు తీసుకెళ్లడం కారులో చుక్కలు చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ రాజుతో కోమలి, బంటీని షాపింగ్‌కి తీసుకెళ్లమని చెప్తాడు. పెద్దయ్యగారి మాట కాదనలేక రాజు వెళ్తాను అని చెప్తాడు. రుక్మిణిలా ఉన్న అసలైన రూప చాలా ఏడుస్తుంది. రూపగా నటిస్తున్న కోమలి రూపని చూసి నవ్వి వెటకారం చేస్తుంది.
రాజు, కోమలి, బంటి వెళ్లడం చూసి రూప చాలా ఏడుస్తుంది. విజయాంబిక, దీపక్‌లు నవ్వుకుంటారు. కోమలి కారులో ముందు కూర్చొంటాను అంటే బంటీ ఒప్పుకోడు. అది నా ప్లేస్ అని బంటీ కూర్చొంటాడు. కోమలి వెనక కూర్చొంటుంది. రాజు రూపని చూసి బాధ పడుతూ ఏం అనలేక కారు ఎక్కుతాడు. రుక్మిణి చాలా ఏడుస్తుంది. రుక్మిణి బాధ చూసి విరూపాక్షి కూడా చాలా ఏడుస్తుంది. రుక్మిణి ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. విజయాంబిక కొడుకుతో రూపకి గట్టి దెబ్బ తగిలిందిరా.. ఇక కోలుకోలేదు.. ఏది ఏమైనా మనకు సగం ఆస్తి వస్తుంది మనకే లాభం అని అనుకుంటారు.
కోమలి కారులో బంటీని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. బంటీ కోమలి చేయి తోసేసి రాజుకి ఫోన్ ఇయర్‌ఫోన్స్ అడిగి పెట్టుకుంటాడు. కోమలి రాజుతో ఎలా ఉంది నా దెబ్బ మీరే నాకు భయపెట్టాలి అనుకున్నారు కదా నేను భయపెట్టగలను అనడానికి ఇది ఉదాహరణ మాత్రమే అంటుంది. రాజు ఏం మాట్లాడకుండా కారు సైడ్‌కి ఆపి కోమలిని దిగమని చెప్పి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్.. నువ్వు మనిషివేనా.. ఒక తల్లికి బిడ్డని దూరం చేయాలి అనుకుంటున్నావ్.. ఒక తండ్రికి బిడ్డని దూరం చేస్తున్నావ్.. ఒక భర్తకి భార్యని దూరం చేయాలని చూస్తున్నావ్? ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ నీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత ఇస్తా తప్పు ఒప్పుకొని వెళ్లిపో అని అంటాడు.
కోమలి రాజుతో ఏంటి రాజు నన్ను భయపెట్టడానికి రాత్రి నా చీర కొంగు పట్టుకున్నావ్ ఇప్పుడు ఇంకోలా భయపెట్టాలి అనుకున్నావా.. ఎవరు భయపడరు అని అంటుంది. దాంతో రాజు కొంచెం అయినా నీకు బుద్ధి లేదా ఆడ పిల్ల వేనా అమ్మాయి గారు నీకు ఏం అన్యాయం చేశారు ఎందుకు ఆమెను అంతలా బాధ పెడుతున్నావ్ అని అంటాడు. రూప జరిగింది అంతా తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. విరూపాక్షి, మందారం రూప దగ్గరకు వెళ్తారు. రూప తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. విరూపాక్షి కూడా చాలా ఏడుస్తుంది. రూప తల్లి చూశావామ్మా నాన్న ఎలా మాట్లాడారో .. బంటీ నా బిడ్డ కాదంట..నా కొడుక్కి నాకు ఏం సంబంధం లేదంట. తన యోగక్షేమాలు నేను పట్టించుకోకూదంట.. ప్రపంచంలో ఏ తల్లి అయినా తన బిడ్డని వేరే ఎవరైనా తీసుకెళ్తే ఊరుకుంటుందా.. తన భర్తని ఎవరైనా దూరం చేస్తే తట్టుకుంటుందా.. నా ప్రాణం అయిన రాజు, నా కడుపున పుట్టిన బిడ్డని నాన్నే దూరం చేస్తే నేను ఎందుకు బతకాలి అమ్మా.. నిన్నూ నాన్నని కలపాలి అని చూస్తే ఈ వేషమే ఇలా నన్ను చేసేసింది అని ఏడుస్తుంది.
రాజు కోమలికి ఎంత చెప్పినా వినకపోవడంతో రాజు నీ పని చెప్తా అని కోమలిని కారు ఎక్కమని చెప్తాడు. బంటీకి సీట్ బెల్ట్ పెట్టి తాను కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. విపరీతమైన స్పీడ్‌లో వెళ్తూ కారు అటూ ఇటూ తిప్పుతాడు. కోమలి పడిపోతూ నెమ్మదిగా వెళ్లమని రాజుని బతిమాలుతుంది. వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు అనుకుంటుంది. రాజు కారు ఆపు అని అరుస్తుంది. బంటీ నవ్వుతాడు. ఓ చోట రాజు కారు ఆపుతాడు. దెబ్బకి కోమలి తల పట్టుకొని వాంతులు చేసుకుంటుంది. రాజు ఐస్‌క్రీమ్ కోసం బంటీని తీసుకెళ్తాడు.
కోమలికి వాటర్ బాటిల్ అందిస్తూ ఆనంద్ ఎంట్రీ ఇస్తాడు. కోమలి నీరు తీసుకొని ముఖం కడుతుంది. తర్వాత ఆనంద్‌ని చూసి షాక్ అయిపోతుంది. ఆనంద్ కోమలితో నువ్వేంటి కోమలి ఇక్కడ ఏమైంది.. దేనికి టెన్షన్ పడుతున్నావ్ అని అడుగుతాడు. ఈ కొత్త అవతారం ఏంటి అని అడిగితే తెలిసిన వాళ్ల పెళ్లికి వెళ్తున్నా అని చెప్తుంది. ఏంటి ఈ మధ్య కాలేజ్‌కి రావడం లేదు అని ఆనంద్ అడుగుతాడు. ఏం లేదని ఇంట్లో వాళ్లకి బాలేదని కోమలి కవర్ చేస్తుంది. రాజు రావడం చూసి దొరికిపోతానని కోమలి ఆనంద్‌ని కంగారు పెట్టేసి పంపేస్తుంది. విరూపాక్షి కూతుర్ని ఓదార్చుతూ స్వామిజీ చెప్పినట్లు దినదిన గండంలా గడుస్తుందని అన్నింటికీ ఎదురెళ్లి నిలబడాలి అని రూపకి ధైర్యం చెప్తుంది. ఇప్పటికైనా సూర్యప్రతాప్‌తో నిజం చెప్పేద్దామని విరూపాక్షి అంటే అది మాత్రం జరగదు. నేను అనుకున్నది సాధించేవరకు తగ్గను అని రూప అంటుంది.
మందారం రూపతో ఆ టక్కులమారి వెళ్లింది రాజన్నతో తాట తీస్తాడు అని అంటుంది. బంటీ పుట్టిన రోజు ఏర్పాట్లు చూడమని అంటుంది. విరూపాక్షి రూపతో అది ఎవర్తో నీ బిడ్డకు బట్టలు కొనడం ఏంటి నువ్వు వెళ్లమ్మా అని అంటుంది. రూప రాజుకి కాల్ చేస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను మన బంటీకి బట్టలు కొనాలి. నేను వెయిట్ చేస్తున్నా నువ్వు రా అని అంటుంది. దాంతో రాజు సరే అని కారు ఆగిపోయిందని చెప్పి కోమలిని నెట్టమని కారు పోనిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















