Ammayi garu Serial Today August 20th: అమ్మాయి గారు సీరియల్: కోమలి కుట్రలు భగ్నం! రూప విజయం.. భర్త్‌డే పార్టీలో దొంగతనానికి లవర్‌ని పిలిచిన రూప!
Ammayi garu Serial Today Episode August 20th కోమలి రూప ఇంట్లో ఉన్న డబ్బు దొంగతనం చేయడానికి తన లవర్ అశోక్‌ని పిలిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూపగా ఉన్న కోమలి డ్రస్ తీసుకొచ్చి బంటీకి ఇస్తుంది. అసలైన రూపతో చేసిన ఛాలెంజ్‌లో తానే గెలుస్తుందని అనుకుంటుంది. తీరా అందులో రూప సెలక్ట్ చేసిన డ్రస్ చూసి కోమలి బిత్తరపోతుంది.
సూర్యప్రతాప్ కోమలితో డ్రస్ అదిరిపోయింది రూప.. అయినా కన్న బిడ్డకి ఎలాంటి డ్రస్ బాగుంటుందో కన్న తల్లి కంటే ఇంకెవరికి తెలుస్తుంది అని అంటాడు. అసలైన రూప కోమలిని చూసి వెటకారంగా కన్ను ఎగరేస్తుంది. ఇక సూర్యప్రతాప్ రుక్మిణిగా ఉన్న రూపతో అమ్మా రూప బంటీ బట్టలు కొనడానికి నిన్ను వెళ్లొద్దని చెప్పినా బాధ పడకుండా రూప తెచ్చిన బట్టలు మెచ్చుకొని నా కూతురు అనిపించుకున్నావ్ అని పొడుగుతాడు. ఎలా చూసినా అసలైన రూపకే తండ్రి దగ్గర నుంచి ప్రశంసలు దక్కడంతో నాటకం ఆడుతున్న కోమలి కంగు తింటుంది. భర్త్‌డే గ్రాండ్‌గా చేయాలని సూర్యప్రతాప్ చెప్పి వెళ్లిపోతాడు.
కోమలి ఏం చేయలేక బట్టల కవర్ విసిరేసి వెళ్లిపోతుంది. కోమలి దగ్గరకు రూప, రాజులు వస్తారు. కోమలి ముఖం మీద చిటెకలు వేసి ఏంటి నువ్వు తెచ్చిన కవర్‌లో నేను తెచ్చిన బట్టలు ఉన్నాయేంటి అని షాక్ అవుతున్నావా! దొంగతనంగా నేను తెచ్చిన బట్టలు బయట పడేస్తావా.. నీది ఇలాంటి నీచమైన బుద్ధి అని తెలిసే నువ్వు తెచ్చిన బట్టల ప్లేస్‌లో నేను తెచ్చిన బట్టలు పెట్టేశా అని చెప్తుంది. విజయాంబిక, కోమలి బిత్తరపోతుంది. నువ్వు తెచ్చిన బట్టలు నీ చేతితోనే కాల్చేలా చేశా.. దెబ్బ అదుర్స్ కదా.. చెప్పా కదనే నాతో ఛాలెంజ్‌కి సరిపోవు అని ఏమన్నావ్ నా చేతితో నా బిడ్డను నీకు ఇస్తాననుకున్నావా.. అది ఎప్పటికీ జరగదు అని అంటుంది.
డ్రస్ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో కోమలి తాను తెచ్చిన కేక్ కట్ చేయిస్తానని మళ్లీ అంటుంది. ఆల్‌ది బెస్ట్ చెప్పి రూప వెళ్లిపోతుంది. విజయాంబిక కోమలితో వాళ్లని దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు అని అంటుంది. ఇక రూప, రాజులు 50 లక్షల డబ్బును చంద్రకు అప్పగిస్తారు. అది కోమలి చూస్తుంది. ఇంత డబ్బు చూడటం మొదటిసారి ఎలా అయినా ఈ డబ్బు కొట్టేయాలని కోమలి అనుకొని లవర్ అశోక్‌కి కాల్ చేస్తుంది. వెంటనే సూర్యప్రతాప్ ఇంటికి రమ్మని చెప్తుంది. ఎందుకు అని అశోక్ అడిగితే బ్యాగ్ నింపుగా డబ్బు ఉంది అది కొట్టేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయాని ఈ రోజు రూప కొడుకు బంటీ భర్త్‌డే అని చెప్తుంది. ఎలా రావాలో ఏంటో మొత్తం తర్వాత చెప్తా అంటుంది.
కోమలి అశోక్‌తో మాట్లాడటం మొత్తం విజయాంబిక వినేసి కోమలిని ప్రశ్నిస్తుంది. నేను ఎవరితో మాట్లాడితే మీకేంటి అని కోమలి అంటుంది. ఏంటి నోరు లేస్తుంది అని విజయాంబిక అంటుంది. దొంగతనం మా వల్లే కాలేదు అని విజయాంబిక అంటే మీ వల్ల కాలేదు అనే కదా నన్ను తెచ్చారు ఇప్పుడు కూడా నేను దొంగతనం చేస్తా మీరు చూస్తూ ఉండండి అంటుంది. విజయాంబిక కోమలి మీద ఓ కన్నేసి ఉంచాలని అనుకుంటుంది. అందరూ భర్త్‌డే పార్టీకి వస్తుంటారు. కోమలి అందర్ని విష్ చేస్తుంది. బేరర్‌లను మాస్క్ పెట్టుకోమని చెప్తుంది. అశోక్ గురించి వెయిట్ చేస్తుంది. ఇక విరూపాక్షి, రూపలు బంటీని రెడీ చేస్తూ మురిసిపోతారు. ఇంతలో సూర్యప్రతాప్ అక్కడికి వస్తాడు.
సూర్యప్రతాప్ చూసుకోకుండా రూప బంటీ రెడీనా అని అడిగి విరూపాక్షిని చూసి ఆగిపోతాడు. బంటీ తాతతో నేను ఎలా ఉన్నాను అంటే అచ్చం చిన్పప్పటి నాలాగే ఉన్నావని అంటాడు. అమ్మమ్మే నన్ను రెడీ చేసిందని బంటీ చెప్పి అమ్మమ్మా తాతయ్యని తీసుకొని వెళ్దాం పద అని అంటాడు. రూప చాలా సంతోషపడుతుంది. బంటీ తాతయ్య అమ్మమ్మల చేతులు పట్టుకొని వెళ్తాడు. విజయాంబిక చూసి వీడేంటి ఎప్పుడు చూసినా నా తమ్ముడిని ఆ విరూపాక్షిని ఒక్కటి చేసేలా ఉన్నాడు అని అనుకుంటుంది. అందరూ పార్టీ దగ్గరకు చేరుకుంటారు. సూర్యప్రతాప్ కేక్ రెడీ చేయించావా అని రూప అని కోమలిని అడుగుతాడు. రాజు రాగానే చేసేద్దాం అని కోమలి అశోక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అశోక్ వస్తాడు. మాస్క్ వేసుకొని బేరర్‌లా కోమలి దగ్గరకు వెళ్తాడు. కోమలి గుర్తు పట్టి డబ్బు ఏ గదిలో ఉందో చెప్పి అశోక్‌ని వెళ్లమని అంటుంది. అశోక్ వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















