అన్వేషించండి

‘స్కంద’ వీకెండ్ కలెక్షన్లు, ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

'స్కంద' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన 'స్కంద'(Skanda) మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతంలో పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కినా రెండో రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ లో ఎక్కువ శాతం తగ్గుదలే కనిపించింది. సెప్టెంబర్ 28న  థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ వారాంతంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.33 కోట్ల గ్రాస్ ని రూ.17.5 కోట్ల షేర్ ని రాబట్టి యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. గురువారం రోజున రూ.14 కోట్ల గ్రాస్, రూ.8 కోట్లకు పైగా షేర్ ని రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత రోజు నుంచి వసూళ్లలో 60 శాతం తగ్గుదల కనిపించింది. రెండో రోజు నుంచి సినిమాకి టాక్ ఏమంత బాగా లేకపోవడంతో వీకెండ్ ముగిసే సరికి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.40 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. కానీ స్కంద మూవీకి వారాంతంలో బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.16 కోట్ల షేర్ రావటం గమనార్హం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

https://telugu.abplive.com/entertainment/cinema/skanda-box-office-collections-ram-pothineni-boyapati-film-bombs-with-rs-36-crores-worldwide-weekend-119996

గజ్జల ప్రసాద్ గా నాజర్, స్టువర్టుపురం బ్యాక్ బోన్ ఈయనేనట!
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది.  గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌ బస్టర్ పాటలతో టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'జితేందర్ రెడ్డి'గా బాహుబలి నటుడు - ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
రాజ్ తరుణ్ ని హీరోగా పరిచయం చేస్తూ 'ఉయ్యాల జంపాల' సినిమాతో దర్శకుడిగా వెండితెరకు అరంగేట్రం చేసిన విరించి వర్మ చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). బీజేపీ లీడర్ జితేందర్ రెడ్డి బయోపిక్ గా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గానే టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాలో హీరో ఎవరన్నది అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించలేదు. ఈ క్రమంలోనే తాజాగా 'జితేందర్ రెడ్డి' సినిమాలో హీరో ఎవరనే విషయాన్ని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'భగవంత్ కేసరి' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు - ఎప్పుడంటే?
'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari). సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. బాలయ్యతో అనిల్ రావిపూడి మొదటిసారి సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాలో బాలయ్యను నెవర్ బిఫోర్ పాత్రలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ రెస్పాన్స్ అందుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అండర్ వాటర్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, 'దేవర' నుంచి పూనకాలొచ్చే అప్ డేట్!
‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి నాటికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget