Devara Movie Update: అండర్ వాటర్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, 'దేవర' నుంచి పూనకాలొచ్చే అప్ డేట్ !
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రత్నవేలు కీలక అప్ డేట్ ఇచ్చారు.

Devara Movie Update: ‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి నాటికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.
Also Read: ‘సలార్’ కోసం ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్, అభిమానులకు అదిరిపోయే ట్రీట్!
అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన రత్నవేలు
‘దేవర’ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. ‘దేవర’ సెట్స్ కి సంబంధించిన ఫోటో ను షేర్ చేశారు. “మముత్ మిడ్ సీ నైట్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశాం. తారక్ నీటి అడుగు భాగంతో పాటు భూమిపైనా అద్భుత సన్నివేశాలను చిత్రీకరించాం” అని రాసుకొచ్చారు. మొత్తంగా అండర్ వాటర్ లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. రత్నవేలు ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి, అనుకున్న సమయానికే విడుదల చేయాలని ఆకాంక్షిస్తున్నారు.
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తో యాక్షన్ సీక్వెన్స్
‘దేవర’ను హై వోల్టేజ్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా వెండితెరపై చిత్రీకరించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందించేందుకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించారట. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో గతంలో ఎప్పుడూ చూడని రీతిలో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. అభిమానుల అంచనాలకు సైతం అందరిని రీతిలో ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
‘దేవర’ చిత్రంపై భారీ అంచనాలు
ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘RRR’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘దేవర’ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘వార్ 2’లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నార్త్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.
Read Also: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















