Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?
రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ మూవీ నుంచి రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. హేమలత లవణం పాత్రలో ఒడిలో చిన్నారితో కనిపించి ఆకట్టుకుంది.
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్ బస్టర్ పాటలతో టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది.
ఆకట్టుకుంటున్న రేణు దేశాయ్ ఫస్ట్ లుక్
తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో హేమలత లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో కనిపించబోతోంది రేణు దేశాయ్. ఓ పసిబిడ్డని పట్టుకున్నట్లు కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది.
View this post on Instagram
అక్టోబర్ 3న ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్ రిలీజ్
ఇక ఇప్పటికే రాజమండ్రిలో గ్రాండ్ గా ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల చేశారు. వంతెన మీదకు వచ్చే ట్రైన్‌ను దొంగలు అడ్డుకుని దోచుకుంటున్నట్లుగా చూపిస్తూ బయటకు వదిలారు. వెంకటేష్ అదిరిపోయే వాయిస్ ఓవర్ తో మొదలయ్యే ఈ గ్లింప్స్ ఓ రేంజిలో ఆకట్టుకుంది. అటు అక్టోబర్ 3న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలకు చార్ట్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
దసరా బరిలో ‘టైగర్ నాగేశ్వరరావు’
‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ సినిమా కెరీర్ మళ్లీ గాడిలో పడింది. వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవికు తమ్ముడిగా పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. రవితేజ నటించిన ‘రావణాసుర’ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. తాజాగా దసరా పండుగ టార్గెట్ గా ‘టైగర్ నాగేశ్వరరావు’ ను రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇందులో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అభిషేక్ పిక్చర్స్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also: అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial