అన్వేషించండి

'భగవంత్ కేసరి' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు - ఎప్పుడంటే?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 'భగవంత్ కేసరి' మూవీ ట్రైలర్ ని అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari). సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. బాలయ్యతో అనిల్ రావిపూడి మొదటిసారి సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాలో బాలయ్యను నెవర్ బిఫోర్ పాత్రలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ రెస్పాన్స్ అందుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫాన్స్ లో ఫుల్ జోష్ ని నింపుతోంది. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ సాంగ్ 'గణేష్ అంథమ్' అనూహ్య స్పందనను రాబట్టింది. ఇక సినిమా నుంచి రెండవ సింగిల్ కూడా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'ఉయ్యాల ఉయ్యాల' అంటూ సాగే రెండవ సింగిల్ ని అక్టోబర్ 4న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీనికంటే ముందు మేకింగ్ వీడియో సైతం విడుదల చేశారు. ఆ వీడియోలో బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్ బాగా హైలైట్ అవ్వడంతో సినిమాలో ఇలాంటి  డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ చిత్ర ట్రైలర్ను అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటికే ట్రైలర్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 8న ఓ ఈవెంట్ ని నిర్వహించి ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి కొంత సమాచారం బయటకు వచ్చింది. 'భగవంత్ కేసరి'లో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా బాలయ్య కనిపించనున్నారట. గిరిజనులలో ఒకరిగా ఆయన పాత్ర ఉంటుందని చెబుతున్నారు.

సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో కమర్షియల్ అంశాలను జోడిస్తూ సినిమాలో ప్రస్తావించబోతున్నట్లు విశ్వసినీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటివరకు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమాలు ఒక లెక్క, 'భగవంత్ కేసరి' మరో లెక్క అనే విధంగా సినిమా ఉంటుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. తన సినిమాల్లో ఎప్పుడూ కామెడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అనిల్ రావిపూడి మొదటిసారి 'భగవంత్ కేసరి'లో కామెడీ తో పాటు సామాజిక అంశాలపై ఎక్కువ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget