అన్వేషించండి

Ustaad Bhagat Singh : మ్యాజిక్ జరిగింది... ట్రైలర్ అదిరింది - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ

Chiranjeevi Reaction : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ట్రైలర్ అదిరిందంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నానంటూ వరుణ్ తేజ్ తెలిపారు.

Chiranjeevi Reaction On Pawan Kalyan Ustaad Bhagat Singh Trailer : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్‌ అదిరిందంటూ పోస్ట్ చేశారు.

'ఉస్తాద్‌తో అన్నీ శుభాలే'

'మ్యాజిక్ జరిగింది... ముహూర్తం కుదిరింది... ట్రైలర్ అదిరింది. ఈ ఉగాదికి 'ఉస్తాద్ భగత్ సింగ్'తో అన్నీ శుభాలే' అంటూ చిరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. 'వింటేజ్ పవర్ స్టార్ మాస్ వైబ్స్ మళ్లీ కనిపిస్తున్నాయి. కల్యాణ్ బాబాయ్ మేనరిజమ్స్, స్టైల్ వేరే లెవల్. హరీశ్ శంకర్ బ్రో ఇచ్చిపడేశావ్. మార్చి 19న బిగ్ స్క్రీన్‌పై ఈ మాస్ జాతర చూసేందుకు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా.' అంటూ మెగా హీరో వరుణ్ తేజ్ రాసుకొచ్చారు.

వీరితో పాటే డైరెక్టర్స్ బుచ్చిబాబు, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. పవర్ బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి అంటూ ఓజీ డైరెక్టర్ సుజీత్ తెలిపారు.

Also Read : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన 

పవర్ ఫుల్ డైలాగ్స్

ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రియల్ పవనిజాన్ని ఎలివేట్ చేసేలా భారీ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్... ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం' అంటూ పవన్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలుస్తోంది. పవన్ స్టైలిష్, వింటేజ్ లుక్స్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించి ఉన్నాయి. దీంతో ట్రైలర్ డైలాగ్స్, లుక్స్‌ను పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. 

పవన్ స్పీచ్‌పై...

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. భారీగా వచ్చే ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ సహా ఇతర నటీనటులు ఈవెంట్‌కు హాజరు కానున్నారు. పవన్ స్పీచ్‌పైనే అందరి దృష్టి నెలకొంది.

ఈ మూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించగా... పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు పార్దిబన్ విలన్ రోల్ చేశారు. వీరితో పాటే రావు రమేశ్, ప్రభాస్ శీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Irumudi Yaalalo Yaalalo Song : ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Embed widget