HBD Allu Aravind: ‘అన్‌స్టాపబుల్’ అల్లు అరవింద్.. ఆయన్నీ ఎవరూ ఆపలేరు.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ!
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు అల్లు అరవింద్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించి....నిర్మాతగా దూసుకుపోతూ..ఓటీటీ ప్లాట్ ఫాం పైనా సత్తా చాటుకుంటున్న ఆయన పుట్టినరోజు జనవరి 10....
1949 జనవరి 10 న అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు జన్మించిన అల్లు అరవింద్... సక్సెస్ ఫుల్ నిర్మాతగా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. పద్మశ్రీ అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. అద్భుతమైన ప్రణాళికతో తనకంటూ గుర్తింపు సంపాదించుకుని కెరీర్లో దూసుకుపోతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించి... దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రనిర్మాణ రంగంలో అలుపెరగక సాగుతున్న అల్లు అరవింద్ పుట్టిన రోజు ఈరోజు
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
తెలుగు సినిమా రంగంలో నిర్మాతగా అల్లు అరవింద్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఓ చిత్రాన్ని ఎంత బడ్జెట్ లో నిర్మించవచ్చు..దాని ప్రమోషన్ ఎలా ఉండాలో పక్కాగా ప్లాన్ చేయడంతో అల్లు అరవింద్ తనకు తానే సాటి. బావ చిరంజీవిని ‘మెగాస్టార్’గా నిలపడంలో అల్లు అరవింద్ కృషి ఏ స్ఖాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసినప్పటి నుంచి ఆ సినిమా విడుదలయ్యే వరకూ మాత్రమే కాదు..ఏ సెంటల్లో ఎలాంటి కటౌట్స్ పెట్టాలనే అంశంలోనూ అరవింద్ పాత్ర ఉందంటే సక్సెస్ కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది.
Also Read: వంటలయ్యగా మారిన డాక్టర్ బాబు, ప్రకృతి ఆశ్రమానికి సౌందర్య, ఆనందరావు.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
ఒకప్పుడు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య ఒక్కరే వారి కుటుంబంలో నటుడు. అరవింద్ కూడా కొన్ని చిత్రాలలో కామెడీ రోల్స్ పోషించారు కానీ ఏనాడూ సీరియస్ గా నటనపై దృష్టిపెట్టలేదు. తమ కుటుంబంలోకి చిరంజీవి రాగానే, అరవింద్ నటకుటుంబాన్ని విస్తరించారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’తో హీరోగా జనం ముందు నిలిపిందీ ఆయనే. పవన్ లో దర్శకత్వ ప్రతిభను 'జానీ' తో వెలికితీశాడు. పవన్-త్రివిక్రమ్ 'జల్సా' కి నిర్మాత అల్లు అరవిందే. ఇక తనయుడు అల్లు అర్జున్ ను ‘గంగోత్రి’తో హీరోగా పరిచయం చేసినప్పటి నుంచి స్టైలిష్ స్టార్ గా ఎదగడం, మరోవైపు మేనల్లుడు రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ‘మగధీర ’ నిర్మాత అల్లుఅరవింద్. చిరంజీవి కుటుంబానికి చెందిన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అందర్నీ హీరోలుగా నిలపడంతో అరవింద్ పాత్ర ఉందని ఒప్పుకోవాల్సిందే.
Also Read: పేర్ని నానితో ఆర్జీవీ భేటీకి టైమ్ ఫిక్స్.. సోమవారమైనా టికెట్స్ రేట్లపై క్లారిటీ వస్తుందా?
ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే’ చిత్రాలు నిర్మించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. చిరంజీవితో ‘యమకింకరుడు’ తీసి మెప్పించారు. ఆ తరువాత చిరంజీవిని స్టార్ గా నిలపడంలో దోహదం చేసిన సినిమాలు శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడు. ఇంకా హీరో, వవిజేత, ఆరాధన,పసివాడి ప్రాణం, అత్తకు యముడు- అమ్మాయికి మొగుడు, అన్నయ్య, స్టాలిన్, డాడీ..చెప్పుకుంటూ పోతే చిరంజీవి-అరవింద్ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలొచ్చాయి.
నిర్మాణ రంగంతో పాటూ గతేడాది డిజిటల్ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ "ఆహా" పేరుతో తెలుగుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చి తన కెరీర్ అన్ స్టాపబుల్ అన్నట్టు సాగిపోతున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి