Tollywood: ఒకేసారి 9 సినిమాలు - ఒక్కటైనా వర్కవుట్ అవుతుందా?
వచ్చే వారం ఏ ఏ సినిమాలు రిలీజ్ ఉన్నాయో ఒకసారి లిస్ట్ చూద్దాం.
'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' లాంటి సినిమాలు థియేటర్లో విడుదలైన తరువాత కంటెంట్ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోయాయి. చిన్న సినిమాలు, బడ్జెట్ సినిమాలపై జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఓటీటీలో చూద్దామనే ఫీలింగ్ కి వచ్చేశారు. అయినప్పటికీ నిర్మాతలు ఎక్కడా తగ్గడం లేదు. వచ్చేవారం జూన్ 24న ఒకేసారి ఎనిమిది సినిమాలు బరిలో ఉండడం ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది.
నిర్మాతలకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా.. పోటీ విషయంలో కనీసపు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. వచ్చే అరకొర ఓపెనింగ్స్ ను కూడా పంచుకోవాల్సి వస్తుంది. దీనివలన నష్టపోయే వాళ్లే ఎక్కువగా ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే వారం ఏ ఏ సినిమాలు రిలీజ్ ఉన్నాయో ఒకసారి లిస్ట్ చూద్దాం.
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన 'సమ్మతమే' సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అలా జరిగితే కాస్త బజ్ రావడం ఖాయం. అలానే ఆకాష్ పూరి నటించిన 'చోర్ బజార్' మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని వస్తుంది. ఎంఎస్ రాజు రూపొందించిన '7 డేస్ 6 నైట్స్' కూడా అదే రోజున రానుంది. వీటితో పాటు సాయిరాం శంకర్ 'ఒక పథకం ప్రకారం', 'గ్యాంగ్ స్టర్ గంగరాజు', 'టెన్త్ క్లాస్ డైరీస్', 'షికారు', 'సదా నన్ను నడిపే' ఇలా చాలా సినిమాలు వచ్చే శుక్రవారం విడుదల కానున్నాయి.
వీటికంటే ఒకరోజు ముందుగా రామ్ గోపాల్ వర్మ 'కొండా' రిలీజ్ కానుంది. అంటే రెండు రోజుల్లో తొమ్మి ది సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఈ సినిమాల్లో వేటికీ పెద్దగా బజ్ లేదు కాబట్టి.. ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వస్తుందేమో చూడాలి..!
Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!
Also Read: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram