The Mystery of Moksha Island: క్యూరియాసిటీ పెంచుతున్న ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’- ట్రైలర్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
The Mystery of Moksha Island: సెప్టెంబర్ 20 నుంచి డిస్ని హాట్ స్టార్‌లో 'ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐస్ ల్యాండ్' అనే సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించి ట్రైలర్ విడుదలైంది.
The Mystery of Moksha Island Trailer: తెలుగులో ఇప్పటికే విడుదలైన పలు సర్వైవల్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. భయపెడుతూనే థ్రిల్ చేశాయి. తాజాగా మరో హారర్ సర్వైవల్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భయపెట్టించే ఈ ట్రైలర్ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.
భయంతో వణిస్తున్న ట్రైలర్
"ఎటు చూసినా ప్రమాదాలే కనిపిస్తున్న వేళ, చివరి వరకు ఎవరు ప్రాణాలతో మిగులుతారు? అబద్ధాలే అబద్ధాలతో సాగే అల్టిమేట్ గేమ్ చూడటానికి రెడీగా ఉండండి. ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ సెప్టెంబర్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది” అంటూ ఓటీటీ సంస్థ ఈ ట్రైలర్ ను విడుదల చేసింది. ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ ఆద్యంతం ఆసక్తికరంగా ముందుకుసాగింది. డాక్టర్ విశ్వక్ సేన్ అనే వ్యక్తి గురించి పరిచయంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. “ఈ ఐలాండ్ తను సృష్టించిందే.. ఆయన తర్వాత ఈ సంపదకు వారసులు ఎవరు అన్నది ఆయనే తేల్చాలి” అనే వాయిస్ తో మొదలవుతుంది. నికోబార్ ఐలాండ్స్ లో మోక్ష ఐలాండ్ ను చూసేందుకు విశ్వక్ సేన్ వారసులుగా చెప్పుకునే వాళ్లు వెళ్తారు. మోక్ష ఐలాండ్ లోని ప్రతి జీవాన్ని, ప్రతి మార్గాన్ని డాక్టర్ విశ్వక్ సేన్ తయారు చేస్తాడు. అతడి ప్రతిబింబమే ఈ ఐలాండ్. అలాంటి దీవిలోకి అడుగుపెట్టిన వారసులకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఒక్కొక్కరుగా చనిపోతుంటారు? వీరి చావులకు కారణం ఏంటి? అందమైన మోక్ష ఐలాండ్ లో ఇలాంటి అనూహ్య ఘటనలు ఎవరు సృష్టిస్తున్నారు? వారసులుగా చెప్పుకునే వారినే ఎందుకు చంపేస్తున్నారు? అనే విషయాలు చాలా ఆసక్తికరంగా చూపించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వెబ్ సిరీస్ పై ఓ రేంజిలో ఆసక్తి కలిగిస్తోంది.
సెప్టెంబర్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
అనీష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’ వెబ్ సిరీస్ లో ప్రియా ఆనంద్, నందు, తేజస్విని, అశుతోష్ రాణా సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ట్రైలర్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ వెబ్ సిరీస్ కు నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందించగా, శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
View this post on Instagram
Read Also: 'దేవర' రిలీజుకు 20 రోజులు ముందే... ఆల్రెడీ కలెక్షన్స్ రికార్ట్స్ వేట మొదలెట్టిన ఎన్టీఆర్