Devara UAS Advance Booking: 'దేవర' రిలీజుకు 20 రోజులు ముందే... ఆల్రెడీ కలెక్షన్స్ రికార్ట్స్ వేట మొదలెట్టిన ఎన్టీఆర్
Devara Overseas Collection: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' విడుదలకు ఇంకా 20 రోజులు ఉంది. ఆల్రెడీ ఎన్టీఆర్ రికార్డుల వేట మొదలు పెట్టారు. ఓవర్సీస్ అడ్వాన్స్డ్ సేల్స్‌లో దూకుడు చూపిస్తున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, టైటిల్ పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దేవర'. సెప్టెంబర్ 27... అంటే ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. థియేటర్లలోకి సినిమా రావడానికి సరిగ్గా 20 రోజుల సమయం ఉంది. అయితే, ఎన్టీఆర్ రికార్డుల వేట ఆల్రెడీ మొదలు అయ్యింది. ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపడం ఖాయంగా కనబడుతోంది.
దేవర ఓవర్సీస్ @ ఐదు లక్షల డాలర్లు!
ఓవర్సీస్ ప్రేక్షకుల్లో ఎన్టీఆర్‌కు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు, హిందీ సినిమాలకు సైతం లేనంతగా 'దేవర'ను విడుదల చేసేందుకు ప్రత్యాంగిర సినిమాస్ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల అమెరికాలో అడ్వాన్స్డ్ సేల్స్ షురూ చేశారు. ప్రీ బుకింగ్స్ జోరు చూస్తుంటే... ఎన్టీఆర్ భారీ రికార్డులు క్రియేట్ చేసేలా కనబడుతున్నారు.
అమెరికాలో 'దేవర' ప్రీమియర్స్ సెన్సేషనల్ రికార్డ్స్ నమోదు చేయడం గ్యారంటీ. సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే ప్రీ సేల్స్ ఐదు లక్షల డాలర్స్ (భారతీయ కరెన్సీలో నాలుగు కోట్ల రూపాయలు)ను దాటేయటం విశేషం. ఇంకా 20 రోజులు సమయం ఉంది కనుక... కేవలం ప్రీమియర్ షోతో మిలియన్ డాలర్స్ (పది లక్షల డాలర్లు) రాబట్టడం చాలా సులభం అని చెప్పాలి. రెండు మూడు మిలియన్ డాలర్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమెరికాలో 'దేవర' రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: తమ్ముడికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!
#DEVARA RAMPAGE is painting the USA RED 🔥🔥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 6, 2024
Count has begun with $500K+ USA Premieres Pre-Sales and the MASS wave is unstoppable 🤙🏻🤙🏻#DevaraUSA #AllHailTheTIGER pic.twitter.com/8nuTlh2dXa
ఒక్క అమెరికాలో మాత్రమే కాదు... ఓవర్సీస్ అంతా, ఇండియాలో సినిమాకు మంచి క్రేజ్ ఉంది. భారీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనబడుతోంది.
చార్ట్ బస్టర్లుగా నిలుస్తున్న 'దేవర' పాటలు!
'దేవర' సినిమా యూనిట్ ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేసింది. ఫస్ట్ సాంగ్ 'ఫియర్' హీరోయిజం, క్యారెక్టర్ బేస్డ్ కాగా... ''చుట్టమల్లే' మెలోడీ. ఆ రెండు పాటలతో పాటు 'దావూదీ' పాట కూడా ట్రెండింగ్ పొజిషన్‌లో ఉన్నాయి. ఆ సాంగ్స్ సినిమా మీద అంచనాలు పెంచాయి.
'దేవర' సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ చిత్ర సమర్పకులు. ఇందులో భైరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా... ఎన్టీఆర్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ ఇతర తారాగణం.