Skylab OTT Premiere: స్కైలాబ్ ఓటీటీకి వచ్చేస్తుంది.. పండగ స్పెషల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సత్యదేవ్, నిత్య మీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన స్కైలాబ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

FOLLOW US: 

డిసెంబర్ మొదటి వారంలో ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో స్కైలాబ్ ఒకటి. కథనం కొంచెం స్లోగా ఉందని మిశ్రమ స్పందన వచ్చినా.. వినూత్నమైన ప్రయత్నం అని అందరూ అభినందించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జనవరి 14వ తేదీ నుంచి సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాలో నిత్య మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు.

నిత్య మీనన్ ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. 1979లో జరిగిన స్కైల్యాబ్ ఉదంతం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. స్కైలాబ్ అమెరికా ఏర్పాటుచేసిన మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం. దీన్ని 1973 మే 14వ తేదీన ప్రారంభించారు. దాని బరువు 2,310 కిలోలుగా ఉండేది. అప్పట్లో అది భూమి వాతావరణం గురించి బోలెడంత డేటాను సేకరించి శాస్త్రవేత్తలకు అందించింది. సూర్యుడిపై కూడా ఎంతో లోతైన అధ్యయనాలను నిర్వహించింది. కానీ కాలం చెల్లడంతో గతి తప్పి మిపై కూలేందుకు సిద్ధమైంది. కానీ, భూమిపై ఎక్కడ పడుతుందనే విషయాన్ని నాసా స్పష్టంగా తెలియజేయలేదు. దీంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అయ్యాయి.

మొదట స్కైలాబ్ సముద్రంలో కూలిపోతుందని భావించారు. కానీ ఆ తర్వాత అది భూమి వైపుకు దూసుకొస్తుందని, స్కైలాబ్ పడిన చోట భారీ విధ్వంసం తప్పదనే ప్రచారం విస్తృతంగా జరిగింది. రేడియోల్లో ఎప్పుడూ చూసినా ఇవే వార్తలు వినిపించేవి. కొందరు తమకు తెలిసిన సమాచారానికి.. భయాన్ని జోడించి ప్రచారం చేస్తూ ఆందోళన రెట్టింపు చేశారు. దీంతో ప్రపంచంలో చాలామంది ఆఖరి క్షణాలని భయపడ్డారు. తెలంగాణలోని నిజామాబాద్ నుంచి ఏపీలోని తీర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఈ ‘స్కైలాబ్’ కూలే ప్రమాదం ఉందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రజలను మరింత భయపెట్టింది.

Published at : 13 Jan 2022 06:14 PM (IST) Tags: Skylab Skylab OTT Premiere Skylab OTT Release Date Skylab OTT Release Skylab on Sony Liv Sony Liv

సంబంధిత కథనాలు

ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!

ఓటీటీలోకి ‘కణ్మని రాంబో ఖతీజా’, వెరైటీగా ప్రకటించిన విఘ్నేష్!

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా