అన్వేషించండి
Advertisement
Brahmamudi Serial Today August 8th అప్పూను పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కల్యాణ్ ఏం చేశాడు.? ఇవాల్టి బ్రహ్మముడి ఏపిసోడ్‌లో ఇదే హైలైట్ సీన్
Brahmamudi Today Episode: అప్పు మెడలో తాళికట్టి భార్యను చేసుకున్న కల్యాణ్‌ను కావ్య నిలదీస్తుంది. మీ అమ్మ బ్రతకనిస్తుందా అంటుంది. దీంతో అప్పును తీసుకుని కల్యాణ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాడు.
Brahmamudi Serial Today Episode: కల్యాణ మండపంలో అప్పు మెడలో తాళికడతాడు కల్యాణ్(Kalyan)...ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించిన అప్పుకు నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించానని అందుకే పెళ్లి చేసుకున్నాను తప్ప..జాలిపడి కాదని చెబుతాడు. మా కుటుంబానికి భయపడి నువ్వు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసే ఆ భగవంతుడు ఈ బ్రహ్మముడి వేయించాడని చెబుతాడు.
ఈ పెళ్లికి నేను ఒప్పుకోను నా ఇష్టం లేకుండా మన ఇంట్లో ఇది ఎలా కాపురం చేస్తుందో చూస్తాను అంటూ అప్పు మెడలో తాలి తెంపేందుకు యత్నించిన ధాన్యలక్ష్మీ(Dhanya Lakshimi) చెంప పగులగొడతాడు ఆమె భర్త...ఈ దెబ్బ అప్పుమీద నింది వేసిన రోజే కొట్టి ఉంటే ఈ రోజు ఈ కుటుంబం ఇంతమంది ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదంటాడు.
మధ్యలో రుద్రాణి(Rudhrani) కల్పించుకుని కన్నతల్లికి కొడుకు పెళ్లిపై ఆ మాత్రం హక్కులేదా అంటూ కల్పించుకోగా ఆమె భర్త గట్టిగా మందలిస్తాడు. నీవల్లే ధాన్యలక్ష్మీ చెడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంకా మాట్లాడితే నిన్ను, నీ కొడుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని హెచ్చరిస్తాడు. అయితే స్వప్నను కూడా గెంటేస్తే అందరం కలిసి అడుక్కుతింటామని రుద్రాణి ఎదురు సమాధానం చెప్పగా...నాకేం ఖర్మ నీను ఎందుకు మీ వెంట వస్తానంటుంది.
కావ్య(Kavya): ఏంటి కల్యాణ్ ఇదంతా..నీ మనుసులో ఏం ఉందో చెప్పమని ఆరోజే అడిగాను కదా..అప్పుడు నిజం చెప్పకుండా ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు నన్ను మోసం చేశారా..? లేక ఈరోజు నా చెల్లిల్ని మోసం చేస్తున్నారా..? ఏది నిజం చెప్పండి.?
కల్యాణ్: ఏంటి వదినా...నేను ఏం చేసినా నాకు అండగా నిలిచే మీరే ఇలా మాట్లాడుతున్నారా..?
కావ్య: కవిగారు..నేను ఎందుకు మీరు కావ్యను పెళ్లిచేసుకోకూడదో మీకు తెలియదు. ఇన్నాళ్లు జనం అని నమ్మిన నిజమే నిజమవుతుంది. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది కాబట్టే...అనామికకు విడాకులు ఇచ్చి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నారని లోకం కోడై కూస్తుంది. మా అమ్మానాన్న మీ ఆస్తి కోసమే ముగ్గురు కూతుళ్లను మీ ఇంటికి కోడళ్లను చేశారని జీవితాంతం మా అమ్మానాన్నలను మీ అమ్మ సాధిస్తూనే ఉంటుంది. మేము ఎలాగూ ఈ నిందలు భరిస్తూనే ఉన్నాం...మా చెల్లి కూడా జీవితాంతం ఈ మాటలు భరిస్తూనే ఉండాలా..? అప్పును మీ అమ్మ కాపురం చేయనిస్తారా..? ప్రశాంతంగా కాపురం చేసుకోనిస్తారా..?
కల్యాణ్: ఇవన్నీ నేను ముందే ఊహించాను వదినా..? అందుకే ఇన్నాళ్లు మౌనం వహించాను. నన్ను చేసుకుని అప్పు ఇంట్లో మాటలు పడుతూ ఉండాల్సి వస్తుందని తెలుసు. అందుకే నేను ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోవాలనుకుంటున్నాను.
రాజ్: అది మనందరి ఉమ్మడి ఆస్తి ఆ ఇంట్లో ఉండే హక్కు నీకు ఉంది. ఎవరు ఏం అనుకున్నా సరే నువ్వు అక్కడే ఉండాలి. నేను ఇంత కష్టపడి ఈ పెళ్లి చేసింది నిన్ను బయటకు పంపడానికి కాదు..
మీ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పును కోడలిగా మేం అందరం ఒప్పుకుంటామంటూ రాజ్(Raj) తల్లి ముందుకు రాగా...ఇష్టంలేని కోడలు ఇంటికి వస్తే మా అమ్మ ఎలా చూస్తుందో కావ్య వదినే ఉదాహరణ. కాబట్టి మేం బయటే ఉంటామని కల్యాణ్(Kalyan) అంటాడు. నన్ను ప్రేమించిన పాపానికి అప్పును కూడా కష్టాలు పాలు చేయలేను. మా అమ్మ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆమె ఉన్నా సరే రుద్రాణి అత్తలాంటి వాళ్లు ఆమెను ఎదో విధంగా చెడగొడుతూనే ఉంటారు అంటాడు.
రుద్రాణి: నా పేరు చెప్పి నువ్వు బయటకు వెళ్లినా ఏం ఉపయోగం...అందరూ నీకు ఎలాగూ సాయం చేస్తూనే ఉంటారు కదా
కల్యాణ్: మేం బయటకు వెళ్లున్నాం అంటేనే ఆ ఇంటి నుంచి ఏం అక్కర్లేదని అర్థం. మాకు ఆ ఆస్తితో సంబంధం లేదు.
అప్పు(ను తీసుకుని బయటకు వెళ్లబోతున్న కల్యాణ్‌ను కావ్య వాళ్ల అమ్మ అడ్డుకుని మా ఇంటికి రండి అని కోరుతుంది. దీన్ని కల్యాణ్ సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇల్లరికం అల్లుడిగా ఉండటం నాకు, నా కుటుంబానికి గౌరవంగా ఉండదంటాడు. అప్పూను ఏ లోటు రాకుండా చూసుకుంటానని తనని తీసుకుని వెళ్లిపోతాడు.
నువ్వు వెళ్లి పిలిస్తే వారిద్దరూ వెనక్కి వస్తారని రాజ్ కావ్యను కోరతాడు. నీ మాట అంటే వాడికి వేదం వెనక్కి పిలవమని బతిమాలతాడు. ఈ పెళ్లి చేసింది మీరే కాబట్టి మీరే వెళ్లి ఆపండని చెబుతుంది.
పెళ్లి షాక్ నుంచి తేరుకున్న అప్పూ.. ఇంకా నాకు నమ్మకం కలగడం లేదని కల్యాణ్‌ను అంటుంది. ఇక మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెబుతుంది. నీపై నాకు నమ్మకం ఉందని నువ్వు చాలా గొప్పవాడివి అవుతామని ధైర్యం చెబుతుంది. తన ప్రెండ్‌కు ఫోన్ చేసి ఉండటానికి సాయం కోరినా కల్యాణ్‌కు కుదరదు.
కల్యాణ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆ ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంటే రుద్రాణీ మాత్రం వారిని చూసి చాలా సంతోషపడుతుంది. ఇన్నాళ్లు తాను ఎదురుచూసింది. దీని కోసమే కదా అనుకుంటుంది. కవ్యను, రాజ్‌ను కూడా వెళ్లగొట్టేస్తే....ఈ ఆస్తి మొత్తానికి తన కొడుకే వారసుడవుతాడని అనుకుంటుంది. మళ్లీ కావ్య కుటుంబంపై లేనిపోని అపనిందులు వేస్తూ ధాన్యలక్ష్మీని మళ్లీ రుద్రాణి రెచ్చగొట్టడంతో ఈరోజు ఏపీసోడ్ ముగిసిపోతుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion