అన్వేషించండి

Karthika Deepam 2 Serial August 8th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య మిస్సింగ్, బెనిఫిట్ తమకే అంటోన్న జ్యోత్స్న, విడాకులు కోరిన దీప!

Karthika Deepam 2 Serial Episode శౌర్య కనిపించకపోవడంతో దీప కార్తీక్‌కి కాల్ చేయడం కార్తీక్ కంగారుగా ఇంటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode లాయర్‌ జ్యోతి దగ్గరకు దీప వస్తుంది. కాళ్లకు చెప్పులు లేక నడవడానికి ఇబ్బంది పడుతూ అదోలా ఉన్న దీపని చూసి జ్యోతి ఏమైందని అడుగుతుంది. నిన్ను చూస్తుంటే ఏదో భయంగా ఉందని చెప్పి కూర్చొపెడుతుంది. దీప లాయర్‌తో తనకు విడాకులు కావాలని అడుగుతుంది. 

దీప: నేను ఏం తప్పు చేయకున్నా ఏన్నో ఓర్చుకున్నాను కానీ ఈ రోజు పడ్డ మాటలు మాత్రం నా జీవితంలో పడలేను మేడమ్. వద్దు మేడమ్ కూతుర్ని ఎలా దక్కించుకోవాలో తెలీక ముందు నన్ను మానసికంగా చంపేయాలి అని చూశాడు. నేను తూలి పడబోతే కార్తీక్ బాబు నా చేయి పట్టుకున్నాడు. దాన్ని కూడా ఓ ఆధారం పెట్టుకొని పట్టపగలు మరో మగాడితో అలా నడిరోడ్డు మీద అని లాయర్ మాట్లాడుతుంటే ఆ మాటలే నన్ను నరికేస్తున్నాయ్ మేడమ్.
జ్యోతి: కేసు గెలవడానికి అవతల వాళ్లు ఇలాంటి మాటలు అని మానసికంగా ఇబ్బంది పెట్టి కేసు గెలవాలి అన్నది వాళ్ల ప్లాన్. 
దీప: ఇక చాలు మేడమ్ మొదటి వాయిదాకే ఇలా చేశాడు అంటే ఇక తర్వాత ఎన్ని అబద్ధాలు చెప్పబోతున్నాడో ఇక ఆ మనిషితో నేను వేగ లేను నాకు విడాకులు కావాలి మేడమ్. మీరు విడాకులకు అర్జీ పెట్టండి నేను చెప్పాల్సింది కోర్టులో చెప్తాను.

సుమిత్ర: నా ప్రాణాలు కాపాడిన దీపకు నేనేం సాయం చేయలేకపోతున్నానండీ.
దశరథ్: నేను అదే ఆలోచిస్తున్నా సుమిత్ర రేపు ఏమైనా జరిగి పాపని నర్శింహకి ఇవ్వాల్సి వస్తే దీప పరిస్థితి ఏంటా అని.
సుమిత్ర: దీప చచ్చిపోతుందండి. దీప బతుకుతుందే శౌర్య కోసం.
పారిజాతం: దీప గురించి నువ్వు ఆలోచించినంత గొప్పగా నీ కన్న కూతురి గురించి ఆలోచించి ఉంటే ఇంకా బాగుండేది. దీపకి శౌర్య అంటే ప్రాణం అని తెలిసిన నీకు జ్యోత్న్సని కార్తీక్ అంటే ప్రాణం అని తెలీలేదు.
సుమిత్ర: అత్తయ్య నేను ఇంతకు ముందు చెప్పాను మళ్లీ చెప్తున్నాను జ్యోత్స్న నా కూతురు కార్తీక్ నా మేనల్లుడు వాళ్లిద్దరి మీద ప్రేమ వేరు దీప మీద ఉన్న అభిమానం వేరు. దీప పరాయిదే కావొచ్చు కానీ కృతజ్ఞత అని ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మన సమాజం ఉన్న పరిస్థితికి నింద పడిన మగాడిని అయినా క్షమిస్తుంది కానీ ఆడవాళ్లని వదలదు. ఓ అమ్మ మనసుతో ఆలోచించండి అత్తయ్య దీప ఎంత ధీనస్థితిలో ఉందో మీకు అర్థమవుతుంది. 

దీప దీనంగా నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర శౌర్య కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. దీప పరుగున సుమిత్ర దగ్గరకు వెళ్తుంది. శౌర్యని పిలవమని అంటే బయటే ఆడుకుంటుందని సుమిత్ర చెప్తుంది. దీప లేదని చెప్పడంతో పారిజాతం మీ ఆయనో అత్తో వచ్చి తీసుకెళ్లుంటారని అంటుంది. దాంతో సుమిత్ర దీప దశరథ్‌లు పాపని వెతకడానికి బయటకు వెళ్తారు. దీప కార్తీక్‌కి కాల్ చేస్తుంది. ఇక దీప సెల్ ఛార్జింగ్ అయిపోతే కార్తీక్ కాల్ చేసే సరికి దీప ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కార్తీక్ కంగారు పడి దీప దగ్గరకు బయల్దేరు తాడు. మరోవైపు జ్యోత్స్న ఫొటోలు తీసుకుంటుంటే పారిజాతం మనవరాలి దగ్గరకు వెళ్తుంది. శౌర్య కనిపించడం లేదని చెప్తుంది. నర్శింహే తనని తీసుకెళ్లుంటాడని జ్యోత్స్న అంటుంది. దీపని దత్తత తీసుకున్న తల్లిదండ్రులుగా మీ అమ్మనాన్నలు మరారని ఇక కార్తీక్ అయితే దీపకు ఏమైనా అయితే ఎగిరి వస్తాడని అంటుంది. 

సుమిత్ర, దీప వాళ్లు కంగారు పడతారు. తనకి నర్శింహ మీద అనుమానంగా ఉందని దీప బయల్దేరుతుంది. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. శౌర్య కనిపించడం లేదని దీప అంటుంది. ఇంతలో శౌర్య ఇంట్లోని అలమరలో దాక్కోని బయటకు వస్తుంది. దీపకు భయపడొద్దని కార్తీక్ ధైర్యం చెప్తాడు. ఇంతలో శౌర్య వస్తుంది. బూచోడు వస్తాడని తనని తీసుకుపోతాడని అందుకే బీరువాలో దాక్కున్నానని శౌర్య చెప్తుంది. ఇక బూచోడు వస్తాడని జ్యో చెప్పిందని అంటుంది. నాకు నాన్న వద్దమ్మా నేను నీతోనే ఉంటాను అని శౌర్య అంటుంది. ఇక శౌర్య కార్తీక్‌ని ఎక్కడికీ వెళ్లొద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ వెంటపడుతున్న సత్య, సోనితో రుద్ర అఫైర్, అందరూ శత్రువులయ్యారని మహదేవయ్య ఫైర్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Embed widget