(Source: ECI/ABP News/ABP Majha)
Satyabhama Serial August 7th: సత్యభామ సీరియల్: క్రిష్ వెంటపడుతున్న సత్య, సోనితో రుద్ర అఫైర్, అందరూ శత్రువులయ్యారని మహదేవయ్య ఫైర్!
Satyabhama Serial Today Episode క్రిష్ తనని దూరం పెడుతున్నాడని సత్య జయమ్మ దగ్గర బాధ పడితే క్రిష్ ప్రేమ కోసం నువ్వే క్రిష్ వెంట తిరుగని బామ్మ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Satyabhama Today Episode సత్యని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసి ఓడిపోయానని ఓపిక నశించిపోయిందని క్రిష్ తన మనసులో బాధ సత్యకు చెప్పుకొని బాధ పడతాడు. గట్టిగా అంటే ఇంకో మూడు నెలలే కలిసి ఉంటామని ఆ తర్వాత మనం వేరు వేరు అయిపోతామని క్రిష్ అంటాడు.
క్రిష్: నేను చేసిన తప్పు ఏంటో తెలుసా. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినప్పుడు ఆశ పడ్డా ఆరు నెలలు టైంలో నీ మనసు గెలుచుకోవచ్చు అనుకున్నా. కానీ మనిషికి ఆశ ఉండాలి అలాగే ఆశ నిరాశ అయినప్పుడు తట్టుకునే శక్తి ఉండాలి.
సత్య: నేను చెప్పేది ఒకసారి విను.
క్రిష్: అగ్రిమెంట్ గురించి ఎవరికీ చెప్పొద్దు అంటావ్ కదా అంతేనా. బేఫికర్‌గా ఉండు ఎవరికీ చెప్పను.
సత్య: దేవుడు మనల్ని ఎందుకు కలిపాడో ఏం చేయాలి అనుకుంటున్నాడో ఆయనకే తెలియాలి.
నందిని: సత్యకి ఏమీ కాదు బావగారు చూసుకుంటారు అని అన్నావ్ కదా అంతలోనే ఏమైంది. పైకి తొడకొట్టావ్ కానీ లోపల అనుమానం తొలచేస్తుంది కదా. సత్యకి కాల్ చేస్తే కానీ కుదుట పడవు అనుకుంటా. నిద్ర పట్టదు కదా.
హర్ష: నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్.
నందిని: సరే షాపింగ్‌కి వెళ్దాం పద.
హర్ష: ఈ టైంలోనా రాత్రి షాపింగ్ ఏంటి. నాకు మూడ్ లేదు నందిని. అక్కడ నా చెల్లి బాధ పడుతుంటే నేను ఇక్కడ ఎంజాయ్ చేయలేను.
నందిని: మీ చెల్లి బాధ పడకూడదు అనే కదా నన్ను పెళ్లి చేసుకున్నది.
హర్ష పర్స్ చేతిలో పెట్టి షాపింగ్ చేసుకో అని అంటే నందిని ఎంత సేపు నీ గోల నీదే కానీ పెళ్లాన్ని అర్థం చేసుకోవా అని అంటుంది. ఇక పర్స్ హర్షకి ఇచ్చేసి వెళ్లిపోతుంది. మరోవైపు అత్త మాటలు తలచుకొని సత్య బాధ పడుతుంది. ఇంతలో జయమ్మ రావడంతో అమ్మమ్మా అనుకొని ఆవిడ ఒడిలో పడుకొని ఏడుస్తుంది. క్రిష్ నీకు అండగా నిలబడ్డాడు కదా అని ఎందుకు అనుమానం అని జయమ్మ అడుగుతుంది.
జయమ్మ: చూడమ్మా మా అందర్ని వదులుకొని నీతో రావడానికి సిద్ధపడ్డాడు కదా.
సత్య: అది అతని బాధ్యత అన్నట్లు వచ్చినట్లు ఉంది.
జయమ్మ: మనసులో నువ్వు అంటే ఇష్టం ప్రేమ లేకపోతే బాధ్యత ఎందుకు తీసుకుంటాడమ్మా.
సత్య: మీరు అన్నది నిజమే అయితే గదిలోకి వెళ్లాక నన్ను దగ్గరకు తీసుకొని ఎందుకు ఓదార్చలేదు. ఎందుకు అంటీ ముట్టనట్లు ఉంటున్నాడు. నన్ను ఇంట్లో వాళ్ల మాటలు బాధపెట్టలేదు అమ్మమ్మ క్రిష్ ప్రవర్తన బాధ పెట్టింది.
జయమ్మ: ఇప్పుడు నువ్వు కూడా క్రిష్ గురించి నిష్టూరంగా మాట్లాడుతున్నావ్ దాని వెనక నీ కోపం ఉందా ప్రేమ ఉందా. తనని అర్థం చేసుకుంటే నీకే తెలుస్తుంది. నువ్వు మా వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఇష్ట పడి కలిసి ఉండటం లేదు అవునా. వాడు నిన్ను మార్చుకోవడానికి తన ప్రేమ నీకు తెలుసేలా పడరాని పాట్లు పడ్డాడు. అయినా వాడు తన బాధని నాకు తప్ప ఎవరికీ చెప్పుకోలేడు. నేను నిన్ను తప్పు పట్టడం లేదు కానీ కలిసి జీవితం పంచుకోవాలి అంటే వాడి వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా. కావాల్సింది తీసుకోవడమే తప్ప అడగడం తెలియని వాతావరణంలో పెరిగాడు. అయినా నీ పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. ఏ మాత్రం బాధ పెట్టకూడదని అతి జాగ్రత్తగా ఉంటున్నాడు. అది నీకు బాగా తెలుసు. వాడు మంచి వాడు ఏ తప్పు చేయలేదు అని తెలుసుకున్నావ్ కాబట్టి ఇప్పుడు వాడి గురించి ఆలోచిస్తున్నావ్ అంతేనా. కానీ వాడి చేయి పట్టుకోవాలా లేదా అనే అయోమయంలో ఉన్నావ్. వాడిని దూరం చేసుకొని నువ్వు బతకగలవు కానీ వాడు మాత్రం నువ్వు దూరం అయితే బతకలేడు. నువ్వు మనసు పెట్టి మార్చడానికి ప్రయత్నించాలే కానీ వాడి కంటే గొప్ప వాడు ఉండడమ్మా. ఇనాళ్లు నీ వెనక వాడు తిరిగాడు ఇప్పుడు నీ మీద నమ్మకం తెచ్చుకోవడానికి నువ్వు ఎందుకు వాడి వెనక పడకూడదు.
రుద్ర ఫోన్‌లో సోని అని తన ప్రేయసితో మాట్లాడుతాడు. నిన్ను కలవాలి అనుకుంటున్నాను అని గంటలో నీ దగ్గర ఉంటానని రెడీగా ఉండని చెప్తాడు. రుద్ర మాటలు రేణుక వినేస్తుంది. సోనీ ఎవరని అడిగితే అది తాళి కట్టించుకోని పెళ్లాం అని చెప్తాడు. ఇలాంటి పని చేస్తే ఒప్పుకోను అని రేణుక అంటుంది. సోనీ గురించి మామయ్యకి చెప్తాను అంటే రుద్ర రేణుక గొంతు పట్టుకొని బెదిరిస్తాడు. నా మాట వినమని రుద్ర చెప్తే నేను నీ మాట వింటాను కానీ నువ్వు కడుపులో బిడ్డని తీయించుకో అని అంటాడు. రేణుక ఏడుస్తుంది. రుద్ర బయటకు వెళ్లే సరికి ఎదురుగా మహదేవయ్య ఉంటాడు. రుద్ర ప్రతాప్ తండ్రిని చూసి షాక్ అయిపోతాడు.
మరోవైపు క్రిష్ బాధగా గార్డెన్‌లో తిరుగుతుంటాడు. సత్య క్రిష్‌ని చూస్తుంది. ఇక జయమ్మ అరె ఏమైంది ఓ మనిషికి రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరింది అని పాట పెడుతుంది. అది క్రిష్, సత్యలకు సింగ్ అవుతుంది. సత్య క్రిష్ అంటూ దగ్గరకు వెళ్తే క్రిష్ వెళ్లిపోతాడు. మరోవైపు మహదేవయ్య కొడుకు రుద్రని కొడతాడు. సోని విషయం తెలిసిపోయిందేమో అని రుద్ర కంగారు పడతాడు.
మహదేవయ్య: ఇంట్లో అందరికీ ఒక్కసారి ఏమైందిరా నాకు పగవారిలెక్క తయారయ్యారు. చిన్నాగాడు అత్తింటి వాళ్లని నెత్తికెక్కించుకొని ఇబ్బంది పెడుతున్నాడు. నీ చెల్లి ఏమో పుట్టిళ్లు అంటే భగ్గుమంటుంది. నా రాజకీయ జీవితానికి ఉపయోగపడుతుంది అనుకున్న చిన్న కోడలు పెద్ద బండరాయిలా అడ్డుపడుతుంది. నువ్వు నాకు ఉపయోగపడుతుందని అనుకుంటే నువ్వు దాని మీదకు చేయి ఎత్తుతున్నావ్.
రుద్ర: అది పచ్చిక పుల్ల బాపు.
మహదేవయ్య: అది పచ్చిక పుల్లే కానీ దాని అయ్య గద్దలాంటోడురా. వాడు మంచి చేయకపోవచ్చు కానీ కొంప ముంచుతాడు. రాజకీయంతో లాభం చేయకపోయినా పర్లేదు కానీ నష్టం చేసేవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకు మరో వాయిదా, ఈసారి బలమైన సాక్ష్యం లేకపోతే శౌర్య నర్శింహ దగ్గరకే!