అన్వేషించండి

Karthika Deepam 2 Serial August 7th: కార్తీకదీపం 2 సీరియల్: దీపకు మరో వాయిదా, ఈసారి బలమైన సాక్ష్యం లేకపోతే శౌర్య నర్శింహ దగ్గరకే!

Karthika Deepam 2 Serial Episode దీప కోర్టులో విషయం తలచుకొని బాధగా వెళ్తుండగా చెప్పు తెగిపోవడంతో బయటకు విసిరేయగా అది అక్కడే ఉన్న నర్శింహకు తగలడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీపకు కార్తీక్‌కు సంబంధం ఉందని వివాహేతర సంబంధం కారణంగా పాపని నర్శింహకు అప్పగించాలని లాయర్ వీవీ జడ్జిని కోరుతాడు. ఇక దీప ఆరోగ్య రీత్యా ఒకరోజు గడువు ఇవ్వాలని లాయర్ జ్యోతి కోరుతుంది. దాంతో జడ్జి సరే అంటాడు. ఇక జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కార్తీక్ పరువు తీసేశాడని ఎన్ని చేసినా శౌర్యని నర్శింహకు ఇవ్వకుండా ఆపలేడని అనుకుంటారు. కోర్టు నుంచి బయటకు వెళ్లి దీప ఏడుస్తుంది. దీప పరిస్థితి బాలేదని ముందు ఇంటికి తీసుకెళ్లమని లాయర్ చెప్తుంది. దీపకు ధైర్యంగా ఉండమని అంటుంది. ఏ నమ్మకంతో ధైర్యంగా ఉండాలని దీప అడిగి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీప ఓ చోట కూర్చొని ఏడుస్తుంటే పక్కనే నర్శింహ వచ్చి కూర్చొని నీ కార్తీక్ బాబు ఏడీ అని సెటైర్లు వేస్తాడు.   

నర్శింహ: నిన్ను ఇలా చూస్తే అతని గుండె తరుక్కుపోదు. తరుక్కు పోవడం కాదు ఈ పాటికే మీ ఇద్దరి గుండెలు పేలిపోయి ఉంటాయి. అడిగినప్పుడే నువ్వు నా కూతుర్ని ఇచ్చేసి ఉంటే ఇన్ని ఇబ్బందులు ఉండవు కదా. ఇప్పుడు చూడు ముందు పరువు పోయింది. ఇక నీ బిడ్డ కూడా నా దగ్గరకి వచ్చేస్తుంది. నువ్వు పాపని వదులుకోవడానికి రెడీ అయిపో. 
అనసూయ: రేయ్ పద నోర్మూసుకొని పదరా.
కార్తీక్: ఏంటి దీప ఇక్కడ కూర్చొన్నావ్. ఏం కాదు దీప నేను లాయర్‌తో మాట్లాడుతాను. శౌర్య ఎక్కడికీ వెళ్లదు.
దీప: వెళ్లిపోండి కార్తీక్ బాబు నేను తర్వాత వస్తా. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడటం కూడా ఏ వైపు నుంచో ఫొటోలు తీసి మళ్లీ వాటిని లాగుతారు. ప్లీజ్ వెళ్లిపోండి బాబు. 
కార్తీక్: సరే దీప నేను వెళ్లిపోతా కానీ శౌర్య మీ నుంచి దూరం అవ్వదు ఈ మాట గుర్తు పెట్టుకోండి. 

శౌర్య, సుమిత్ర ఆరు బయట బాలుతో ఆడుకుంటూ ఉంటారు. దశరథ్ పేపర్ చదువుతుంటాడు. ఇంతలో జ్యోత్స్న, పారిజాతం వస్తారు. జ్యోని పాప పలకరిస్తే జ్యోత్స్న పాపతో హాయిగా ఆడుకుంటున్నావ్ శౌర్య రేపు నిన్ను మీ నాన్న తీసుకెళ్లిపోతాడు అని అంటుంది. శౌర్య భయపడుతుంది. అమ్మమ్మ నన్ను బూచోడు తీసుకెళ్లిపోతాడా అని ప్రశ్నిస్తుంది. ఏం కాదు నువ్వు ఆడుకో అని చెప్పి సుమిత్ర జ్యోత్స్న వెనక వెళ్తుంది.

సుమిత్ర: జ్యోత్స్న ఆగు శౌర్యతో ఎందుకు అలా అన్నావ్.
పారిజాతం: జరగబోయేది అదే. నీకు కాబోయే అల్లుడు కోర్టులో పరువు తీసేశాడు. దీపకు, కార్తీక్‌కి సంబంధం ఉందని నిరూపించారు. 
సుమిత్ర: నేను నమ్మను అత్తయ్య కార్తీక్ ఎలాంటోడో మనకు తెలీదా.
పారిజాతం: మన బిడ్డ మనకు ముద్దు కానీ వాళ్లకి కాదు కదా. నా భార్య వాడితో సంబంధం పెట్టుకుంది నా బిడ్డని నాకు ఇప్పించండి అని లాయర్‌తో చెప్పించాడు. ఇది చూసి జనం మనలా ఆలోచించరు కదా అదే నిజంఅని అనుకుంటారు.
దశరథ్: అసలు మీరెందుకు కోర్టుకు వెళ్లారు. అసలు జ్యోత్స్నని ఎందుకు తీసుకెళ్లావ్.
జ్యోత్స్న: డాడీ కోర్టులో నిందలు వేసింది పక్కింటోడి మీద కాదు నా బావ మీద నాకు ఏం జరిగినా ఐ డోంట్ కేర్ కానీ బావ మీద చిన్న గీత పడినా నాకు నచ్చదు. ఈ జడ్జిమెంట్ దీపకే కాదు నాకు చాలా ఇంపార్టెంట్ అందుకే వెళ్లాను. 
పారిజాతం: అంటే ఫీలవుతారు కానీ ఇలాంటి దరిద్రాలు నేను ఎప్పుడూ చూడలేదు.  

సుమిత్ర బాధ పడుతుంటే దశరథ్ ఓదార్చుతాడు. మరోవైపు కార్తీక్ తల్లిదండ్రులు కార్తీక్ గురించి ఎదురు చూస్తుంటారు. అందరూ దీపకి కార్తీక్‌కి సంబంధం ఉంది కదా అని ఫోన్లు చేస్తుంటారు. నా కొడుకు వాయిదాల్లో నా పరువు తీసేస్తున్నాడు అంటే పరువు గురించి మీరు మాట్లాడకండి అని కార్తీక్ అంటాడు. సమాజం అలాగే ఉంటుందని నేను ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు నమ్మాలి కదా అని అంటాడు. రెండో వాయిదా పూర్తి అయిన వరకు నన్ను నమ్మండని అంటాడు. ఇక కార్తీక్‌ తన తల్లి దగ్గర కూర్చొని ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దని అంటాడు.

దీప బాధగా కోర్టులో జరిగిన విషయం తలచుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. దీప చెప్పు తెగిపోతుంది. దాన్ని పట్టుకొని దీప తాళి బొట్టులో ఉన్న పిన్ను తీసి పెట్టబోతే పిన్ను గుచ్చేస్తుంది. ఇంతలో నర్శింహ వాళ్లు కారులో వెళ్తూ దీపని చూసి ఆగుతారు. దీపకి జలక్ ఇస్తానని నర్శింహ వెళ్తాడు. మరోసారి దీప చెప్పు తెగిపోవడంతో విసురేస్తుంది అది వెళ్లి నర్శింహకు తగులుతుంది. నా భర్తని చెప్పుతో కొట్టింది దానికి ఎంత పొగరు అని శోభ అంటుంది. నన్నే చెప్పుతో కొడతావా అని నర్శింహ దీపని తిట్టబోతే అనసూయ ఆపుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: గొంతు విప్పిన జయమ్మ, అదిరిపోయే శాసనం.. మనసులో మాటలు చెప్పి సత్యని దూరం పెడుతున్న క్రిష్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget