అన్వేషించండి

Satyabhama Serial August 6th: సత్యభామ సీరియల్: గొంతు విప్పిన జయమ్మ, అదిరిపోయే శాసనం.. మనసులో మాటలు చెప్పి సత్యని దూరం పెడుతున్న క్రిష్‌!

Satyabhama Serial Today Episode సత్యని అత్తింటిలో వదిలి తప్పు చేశారని తన తల్లి సత్యని చాలా ఇబ్బంది పెడుతుందని నందిని మామయ్యతో పాటు ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్యని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోతానని క్రిష్‌ అంటాడు. దాంతో మహదేవయ్య ఫుల్ ఫైర్ అవుతాడు. ఒకసారి గడప దాటితే మీకు మాకు సంబంధం తెగిపోయినట్లే మరోసారి ఈ ఇంటి వైపు కూడా చూడ్డానికి కుదరదని అని చెప్పి క్రిష్‌ని వెళ్లిపోమని అంటాడు. భైరవి కూడా ఇక మమల్ని మర్చిపో అని అంటుంది.

క్రిష్: నేను ఇంటితోనే సంబంధం కాదు అనుకుంటున్నా నువ్వు ఏకంగా పేగు బంధమే కాదు అనుకుంటున్నావా అమ్మ. నీ పెనిమిటి వైపు నువ్వు నిలబడటం న్యాయం అయితే నేను నా భార్య వైపు నిలబడటం న్యాయమే కదా అమ్మ. పద సత్య.
జయమ్మ: ఆగండి.. 
క్రిష్: బామ్మా నువ్వు మాట్లాడుతున్నావా.
జయమ్మ: అవున్నా మాట్లాడుతున్నాను. ఓ దేవతని అత్యంత అవమానకరంగా ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంటే తట్టుకోలేక కడుపు మండి మాట్లాడుతున్నాను రా. జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి మాట్లాడుతున్నానురా. ఇన్ని రోజులు ఈ ఇళ్లు ఓపాపపు కూపంలా మారిపోయింది. ఇక్కడ అన్యాయాలు చూడలేక ఇది తప్పు అని చెప్పినా నా మాట వినేవారు లేక మూగబోయాను. నోరు నొక్కేసుకొని కళ్లు మూసుకొని జరిగే పాపాలు అన్నీ చూస్తూ ఉండిపోయాను. ఈ జీవితం ఇలా అంతమైపోతుందని అనుకున్నాను. నన్ను మూగదానిలా ఉంచేశారు కానీ మీరు మనుషుల్లా మారి నన్ను మార్చాలి అనుకోలేదు. ఆ దేవుడు నా బాధ చూసి జాలిపడ్డాడు. ఈ ఇళ్లు బాగుపడటానికి సత్య లాంటి ఓ దేవతని పంపాడు. ఏదో ఒక రోజు సత్య ఈ ఇంటిని స్వర్గంలా మారుస్తుందని ఆశతో బతుకుతున్నాను. అలాంటి దేవతని కూడా మీరు నిందలు వేసి ఇంటి నుంచి పంపేస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. ఇప్పటికైనా నేను నోరు తెరవకపోతే నేను బతికి ఉండి లాభం ఏంటిరా. చూడరా ఆ ముఖం చూడు ఎంత బాధ గుండెల్లో దాచుకుందో తెలుస్తుంది. మీ అమ్మా నాన్నలకి అహంకారం తప్ప మంచి తనం అంటే ఏంటో తెలీదు. నువ్వు నీ భార్యని తీసుకొని ఇళ్లు వదిలి వెళ్లడం ఏంటిరా. ఇది జయమ్మ ఇళ్లు. ఇక్కడ ఏం జరిగినా ఈ జయమ్మ అనుమతితోనే ఈ జయమ్మ ఇష్టంతోనే జరగాలి. ఈ ఇంటి దేవత ఈ ఇళ్లు వదిలిపోదు ఈ ఇంట్లోనే నా కళ్లముందే ఉంటుంది. ఈ ఇంటిని బృందావనంగా మార్చుతుంది.
భైరవి: సత్య ఇంట్లో ఉంటే మేం ఒప్పుకోం.
జయమ్మ: ఇష్టం లేని వాళ్లు ఈ ఇంటి నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. 
భైరవి: చూశావా అయ్య అత్తమ్మ ఏమంటుందో మనల్ని గడ్డి పోచల్లా తీసేస్తుంది. ఇంటి నుంచి పొమ్మంటుంది.
మహదేవయ్య: పదేళ్ల తర్వాత నా తల్లి మాట్లాడుతుంది. నాకు సంతోషంగా ఉంది కానీ నన్ను ఎదురించింది అదే బాధగా ఉంది కానీ నీ పెద్దరికాన్ని నిలబెడతా నీ ఇష్టమే మా ఇష్టం.

జయమ్మ సత్య, క్రిష్‌లను తీసుకొని ఇంట్లోకి వెళ్లుంది. భైరవి, రుద్ర కోపంతో రగిలిపోతారు. మరోవైపు విశ్వనాథం ఇంటికి వస్తాడు. కొడుకుని చూసి శాంతమ్మ ఎమోషనల్ అయిపోతుంది. విశ్వనాథం సత్య అత్తారింట్లో జరిగినదంతా చెప్తాడు. ఇంతలో నందిని వచ్చి అసలు సినిమా ఇప్పుడు మొదలవబోతుందని ఆ ఇంట్లో మీ కూతురు కష్టపడుతుందని చెప్తుంది. మా అమ్మ ఏం చేసైనా సత్యని పుట్టింటికి పంపేయాలి అని చూస్తుందని చెప్తుంది. క్రిష్ ఆలోచిస్తూ బాధ పడుతూ గదిలో కూర్చొని ఉంటే సత్య వస్తుంది. క్రిష్ గులాబి మొక్కని చేతిలో పట్టుకొని మాట్లాడుతాడు అది సత్య వింటుంది. 

క్రిష్: నిన్ను ఎంత ఇష్టపడితే అంత అలుసు. ఎంత నమ్మి దగ్గరకు వస్తే అంత బాధ. 
సత్య: ఎందుకు నన్ను దూరం పెడుతున్నావ్ క్రిష్.
క్రిష్‌: నిన్ను దూరం పెట్టడం కాదు నేను ఉండాల్సిన జాగాలో నేను ఉంటున్నా.
సత్య: క్రిష్ ఎందుకు వెళ్లిపోతున్నావ్.
క్రిష్: వెళ్లిపోవడం లేదు పారిపోతున్నా. ఇప్పుడు నువ్వు అడగబోయిన ప్రశ్నలకు నా దగ్గర లేదు. పిచ్చోడి లెక్క నేను మనసులో ఉన్నది మీదకి చెప్పేస్తా. 
సత్య: నేను నీతో చెప్పని నిజాన్ని చెప్పాను అని ఇంట్లో అందరికీ అబద్దం ఎందుకు చెప్పావ్.
క్రిష్: ఒక నిజాన్ని దాచి పెట్టి నువ్వు చేసిన తప్పుని ఒక అబద్దంతో సరిచేద్దామని చెప్తాను.
సత్య: అంటే నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా.
క్రిష్: కచ్చితంగా నమ్ముతున్నా. 
సత్య: అలాంటప్పుడు అందరి  ముందు నువ్వు నన్ను ఎందుకు నిలదీయలేదు.
క్రిష్: నువ్వు ఏ తప్పు గురించి అనుకుంటున్నావో నాకు తెలీదు నేను అంటున్న తప్పు కిడ్నాప్ గురించి చెప్పకుండా నా దగ్గర దాచడం గురించి.
సత్య: ఎలా చెప్పమంటావ్ కాళీ నిన్నే కాదు నన్ను మోసం చేశాడు వాడి చేతిమీద సత్య అని రాసుకున్నాడు. తర్వాత చెప్పాలే అనుకున్నా కానీ చెప్పొద్దని నాన్న మాట తీసుకున్నాడు. చెప్తే నువ్వు అపార్థం చేసుకొని మన కాపురం పోతుందని.
క్రిష్: క్రిష్‌ అపార్థం చేసుకోడు మంచోడు అర్ధం చేసుకుంటాడని  నువ్వు ఎందుకు చెప్పలేదు. అంటే నీకు కూడా నా మీద నమ్మకం లేదు కదా. సత్యని కాళీ ఇబ్బంది పెట్టాడని వాడిని చితక్కొట్టా మా వాళ్లు వద్దన్నా నిన్ను పుట్టింటికి తీసుకెళ్లా కాళీని మీ నాన్న ఎందుకు చంపాడో మీ ఇంట్లో అందరికీ తెలిసి నన్ను దూరం పెట్టారు. నీ గురించి నాకు తెలిసి కూడా ఎలా అనుమానిస్తా అనుకున్నావ్ సత్య.
సత్య: అంత దూరం ఆలోచించలేకపోయా.
క్రిష్: నీకు ఇష్టం లేకుండా నిన్ను ప్రేమించా అని నీకు నా  మీద ఇంకా కోపం కదా. మళ్లీ మళ్లీ అదే చెప్తున్నా అది తప్పే తెలియక చేసిన తప్పు ఆ తప్పుని దిద్దుకొని నీ మనసు గెలుచుకోవాలని అప్పటి నుంచి తాపత్రయపడుతున్నా అది అయ్యే పని కాదు అని ఇప్పుడు అర్థమైంది. నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు కానీ నా బాధని గుర్తించు. ఓపికకి కూడా ఓ హద్దు ఉంటుంది కదా సత్య. నిన్ను మార్చుకోవాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నా కానీ అది జరగదు అని  క్షణం అర్థమైంది. అందుకే ఒంటరిగా ఉంటున్నా. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాతోనే వివేక్ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తానన్న సంయుక్త.. లక్కీ ప్లాన్ పసిగట్టేసిన లక్ష్మీ!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 24: కేదార్‌ను వారసుడిగా ప్రకటించిన సుధాకర్‌..తాగిన మత్తులో మాట్లాడాటంటూ అందరికీ చెప్పిన యువరాజు
జగద్ధాత్రి సీరియల్:కేదార్‌ను వారసుడిగా ప్రకటించిన సుధాకర్‌..తాగిన మత్తులో మాట్లాడాటంటూ అందరికీ చెప్పిన యువరాజు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి సంతకాన్ని ఆపేసిన పద్మాక్షి! అసలైన వారసుడు ఉన్నాడంటూ ట్విస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి సంతకాన్ని ఆపేసిన పద్మాక్షి! అసలైన వారసుడు ఉన్నాడంటూ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today November 24th: నిండు మనసులు: సంతోషంగా సిద్ధూ, ప్రేరణ! రాజశేఖరం మాస్ వార్నింగ్! ప్రేరణను విజయానంద్ చంపేస్తాడా!
నిండు మనసులు: సంతోషంగా సిద్ధూ, ప్రేరణ! రాజశేఖరం మాస్ వార్నింగ్! ప్రేరణను విజయానంద్ చంపేస్తాడా!
Godavari Serial Today November 24th: 'గోదావరి' సీరియల్: అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకున్న సంజు, జాను! మూడు ముళ్లని జాను ఒప్పుకుంటుందా!
'గోదావరి' సీరియల్: అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకున్న సంజు, జాను! మూడు ముళ్లని జాను ఒప్పుకుంటుందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
Embed widget