Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today August 6th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాతోనే వివేక్ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తానన్న సంయుక్త.. లక్కీ ప్లాన్ పసిగట్టేసిన లక్ష్మీ!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను, వివేక్‌ల పెళ్లి జరిపిస్తానని అందుకు జయదేవ్‌తో కలిసి నాటకం ఆడుతున్నానని సంయుక్త మిత్రకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode వివేక్‌ని తాను మర్చిపోయాను అని జాను దేవయానితో చెప్తుంది. లక్ష్మీ, జానుల నాటకం తెలియని దేవయాని అది నిజమని నమ్మేస్తుంది. వివేక్ కూడా వాళ్ల నాటకానికి వత్తాసు పలుకుతాడు. తన తల్లి చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తనతోనే షాపింగ్కి వెళ్తానని షికార్లకు వెళ్తానని అంటాడు. దేవయాని మురిసిపోతుంది. జానుని ఎప్పటిలా తనని చిన్నత్తయ్య అని పిలవమని దేవయాని చెప్పి ఇకపై నీ మీద అసహ్యం చూపించమని ప్రేమగా ఉంటానని చెప్పి సంయుక్తకి థ్యాంక్స్ చెప్పి వాళ్లు తెచ్చిన బట్టలు తీసుకొని వెళ్లిపోతుంది.
మనీషా: మా చుట్టూ మాకు తెలీకుండా ఏదో ఓ వింత జరుగుతుంది. దానికి ఆరంభం ఏంటో అంతం తెలీడం లేదు కానీ ఏదో అనుబాంబు పేలనుందని అర్థమవుతుంది. ఏమై ఉంటుంది.
మిత్ర: సామ్ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, జాను వివేక్‌లు అంత ప్రేమించుకొని ఇంత సులువుగా ఎలా విడిపోతున్నారు.
సంయుక్త: అంతలా ప్రేమించిన మీరు మీ భార్యని సులువుగా మర్చిపోలేదా ఇది కూడా అంతే.
మిత్ర: అది వేరు ఇది వేరు అయినా లక్ష్మీ గురించి పక్కన పెట్టండి అసలు ఇదంతా ఏంటి.
సంయుక్త: అయ్యో మిత్ర గారు మీకు అసలు విషయం తెలీదు వాళ్లు విడిపోవడం లేదు విడిపోయినట్లు నాటకం ఆడుతున్నారు. మీ నాన్నగారితో కలిసి మేమంతా నాటకం ఆడుతున్నాం. ఈ పెళ్లి ఆపుతాం.
మిత్ర: ఈ పెళ్లి ఆపితే సరిపోతుందా జానుతో వివేక్ పెళ్లి కూడా జరగాలి కదా. మా పిన్ని నేను చెప్తే వినలేదు. తను ఏమైనా అనుకుంది అంటే అది కచ్చితంగా చేసి తీరుతుంది. ఎవరు చెప్పినా వినదు.
సంయుక్త: మీ పిన్ని మొండి తనం వెనక మనీషా ఉంది. మనీషా వైపు నుంచి వెళ్లి ఆ పెళ్లి ఆపేలా చేస్తాం. కచ్చితంగా మీ పిన్ని మనీషా చెప్తే వింటుంది.
మిత్ర: మనీషా ఎందుకు ఈ పెళ్లి అపుతుంది అంత అవసరం మనీషాకు ఏముంది.
సంయుక్త: మనీషాకు అలాంటి అవసరం వచ్చేలా చేయడమే మా ప్లాన్. మా ప్రయత్నం వల్ల ఈ పెళ్లి ఆగిపోవచ్చు. వివేక్ జానుల పెళ్లి జరగొచ్చు. ఆ తర్వాత మీరు మీ భార్య లక్ష్మీ కలుసుకునే సమయం రావొచ్చు.
మిత్ర: ఇప్పుడు ఆ విషయం ఎందుకు. లక్ష్మీని నేను కలిసే అవకాశమే లేదు. అసలు కలిసే ఉద్దేశమే లేదు.
సంయుక్త: మీకు లక్ష్మీ అంటే ఎందుకు అంత ద్వేషం. మీరు అంటే తనకు ప్రాణం అయినందుకా మీ మీద అంత ప్రేమ చూపించినందుకా.. మీ కళ్లు మిమల్ని మోసం చేస్తున్నాయని అనిపిస్తుంది.
రాత్రి జాను, వివేక్, జయదేవ్, లక్ష్మీలు తమ ప్లాన్ వర్క్‌ట్ అయిందా లేదా అని ఆలోచిస్తున్నారు. మనీషాకు తమ ప్లాన్ మీద అనుమానం వస్తుందని మనీషా కారణంగానే ఈ పెళ్లి ఆగుతుందని లక్ష్మీ అంటుంది. జాను, వివేక్‌లకు ధైర్యం చెప్తుంది. ఇక జయదేవ్ లక్కీ గురించి చెప్తాడు. లక్కీ ఏదో నిజం చెప్తానని సర్‌ఫ్రైజ్ ఇస్తానని చెప్పిందని అంటాడు. లక్కీ గురించి లైట్ తీసుకోవద్దని తన మీద లక్కీకి అనుమానం వచ్చిందని లక్ష్మీ అంటుంది. ఇంతలో లక్కీ వచ్చి సర్‌ప్రైజ్ ఇస్తానని అంటుంది. లక్ష్మీ చేతికి తాను అంటించిన స్టిక్కర్ గురించి లక్కీ ఆలోచిస్తుంది. సంయుక్త దగ్గరకు వెళ్లి చేతిని తీసుకొని స్టిక్కర్ ఉందా లేదా అని చూస్తుంది. సంయుక్త చేతికి స్టిక్కర్ ఉండదు. దాంతో ఇద్దరూ ఒకటి కాదు అని లక్కీ అనుకుంటుంది. లక్కీ వెళ్లిపోతుంది. అయితే గతంలో లక్ష్మీ లక్కీ అతికించిన స్టిక్కర్ గురించి ఇంట్లో వాళ్లకి చెప్తుంది.
మనీషా జాను, సంయుక్తల మాటలు తలచుకొని ఆలోచిస్తుంది. దేవయాని అక్కడికి వస్తుంది. దేవయానిని కూడా మనీషా మీ ముందు జరుగుతున్న కుట్రలు ఆలోచించమని అంటుంది. జాను, వివేక్‌లు నాటకం ఆడుతున్నారని అర్థం చేసుకోమని అంటుంది. మనీషా మాటల్ని దేవయాని కొట్టిపడేస్తుంది. మరోవైపు లక్కీ లక్ష్మీ సంయుక్త ఒకరే అని నిరూపిస్తానని అనుకొని ఫెయిల్ అయినందుకు బాధ పడుతుంటుంది. ఇక వివేక్‌ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫ్యామిలీ కలిసి మిత్ర ఇంటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: నయనికి అండగా పోచమ్మ.. అమ్మవారి ప్రసాదంలో తిలోత్తమ ఏం కలపబోతుందో!