Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్ వీడియోలు చూస్తూ కాలక్షేపం
Guntur Crime News:పవిత్రంగా భావించే వివాహ బంధం అక్రమ సంబంధాల వ్యామోహంలో పడి ఎలా బలిపీఠం ఎక్కుతుందో ఈ ఘటన నిరూపిస్తోంది. తన స్వార్థం కోసం భర్తను పొట్టన పెట్టుకుంది మరో భార్య.

Guntur Crime News:సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి జిల్లాలో వెలుగు చూసిన ఒక దారుణ ఉదంతమే నిదర్శనం. వివాహేతర సంబంధం కోసమో, క్షణికావేశంలోనో నేరాలు జరగడం చూస్తుంటాం. కానీ కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపి, ఆపై ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన మహిళ ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన ఈ హత్య కేసులో నిందితురాలి మానసిక స్థితిని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు.
సంసారంలో చిచ్చురేపిన థియేటర్‌లో పరిచయం
చిలువూరు గ్రామానికి చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఆయనకు 2007లో లక్ష్మీ మాధురితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఆర్థిక అవసరాల కోసం మాధురి విజయవాడలోని ఒక సినిమా థియేటర్‌లో టికెట్ కౌంటర్ వద్ద పనికి చేరింది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారాన్ని నామోషీగా భావించిన మాధురి, ప్లాన్ ప్రకారం అతడిని ఆ వ్యాపారం మాన్పించేసింది. గోపికి హైదరాబాదాద్‌లో ట్రావెల్స్ వ్యాపారం ఉండటంతో, భర్తను అక్కడికే ఉద్యోగానికి పంపింది. తద్వారా తన ప్రియుడితో ఏకాంతంగా గడపవచ్చని ఆమె భావించింది. అయితే కొంత కాలం తర్వాత శివనాగరాజు హైదరాబాద్ నుంచి తిరిగి గ్రామానికి చేరుకోవడంతో మాధురి ప్లాన్ తలకిందులైంది.
బిర్యానీలో నిద్రమాత్రలు
ఇంటి వద్దే ఉంటున్న భర్త తన సంబంధానికి అడ్డుగా మారాడని మాధురి భావించింది. అతడిని శాశ్వతంగా వదిలించుకోవాలని ప్రియుడు గోపితో కలిసి కుట్ర పన్నింది. ఈ నెల 18న ఆమె ఇంట్లో బిర్యానీ చేసింది. అందులో సుమారు 20 నిద్రమాత్రలను పొడి చేసి కలిపింది. ఆ బిర్యానీ తిన్న శివనాగాజు స్పృహ కోల్పోయి గా నిద్రలోకి జారుకున్నాడు.
ముందుగా అనుకున్న ప్రకారం రాత్రి 11.30 గంటల సమయంలో గోపి వారి ఇంటికి చేరుకున్నాడు. నిద్రలో ఉన్న నాగరాజు చాతిపై గోపి కూర్చని అదిమి పట్టగా, మాధురి ఒక దిండును అతిడి ముక్కు, నోరుపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసింది. కొద్దిసేపటికి నాగరాజు మరణించినట్టు నిర్ధారించుకున్నా గోపీ అక్కడి నుంచి పరారయ్యాడు.
హత్య తర్వాత పోర్న్ వీడియోలు చూసిన భార్య
ఈ కేసులో పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసిన అంశం మాధురిక ప్రవర్తన. భర్తను చంపిన తర్వాత ఏ మాత్రం భయం గానీ, బాధ గానీ లేకుండా ఆమె ప్రవర్తించింది. శవం పక్కనే ఉండగా ఆ రాత్రంతా ఒంటరిగా కూర్చొని తన మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు సాధారణంగానే గడిపింది. ఆ తర్వాత ముసలి కన్నీరు కారుస్తూ ఇరుగుపొరుగును పిలిచింది. తన భర్తకు గుండెపోటు వచ్చిందని నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది.
స్నేహితుల అనుమానం- బయటపట్ట నిజం
తెల్లవారుజామున అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న టైంలో నాగరాజు స్నేితులు అక్కడికి చేరుకున్నారు. నాగరాజు చెవిలో నుంచి రక్తం రావడం చెవి వద్ద గాయం ఉండటాన్ని గమనించారు. ఇది గుండెపోటు కాదని, ఏదో జరిగిందని అనుమానించి మృతుడి తండ్రికి చెప్పారు. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాగరాజు తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాగరాజు గుండెపోటుతో కాకుండా శ్వాస ఆడకపోవడంతో మృతి చెందినట్టు నిర్దారించారు. చాతీ ఎముకలు కూడా విరిగి ఉన్నాయని తేలింది. దీంతో పోలీసులు మాధురిని విచారిస్తే తన పాపాలను బయటపెట్టింది.





















