Trinayani Serial Today August 6th: 'త్రినయని' సీరియల్: నయనికి అండగా పోచమ్మ.. అమ్మవారి ప్రసాదంలో తిలోత్తమ ఏం కలపబోతుందో!
Trinayani Serial Today Episode నయని అమ్మవారికి బోనం సమర్పించకుండా అందులో రసాయనం కలపాలి అని తిలోత్తమ వల్లభకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode నయని వాళ్లు బోనం వండటానికి సిద్ధంగా ఉండగా అక్కడికి ఓ ముసలావిడ వస్తుంది. అందరూ ఎవరూ అన్నట్లు చూస్తారు. ఇక కర్రల కోసం వెళ్లిన విక్రాంత్ కర్రలు తడిచిపోవడం చూసి షాక్ అయిపోతాడు. అయినా సరే విశాల్ వాళ్లకి చూపించాలని తీసుకెళ్తాడు. ఇక ముసలావిడలా వచ్చినామె తన పేరు పోచమ్మ అని చెప్తుంది. సుమన మాత్రం చిరాకు పడుతుంది. ముసలావిడను వెళ్లిపోమని అంటుంది. విక్రాంత్ కట్టెలను చూపించి తడిచిపోయావని చెప్తాడు. పోచమ్మను చూసి సుమన, తిలోత్తమలు చిరాకు పడితే మిగతా వాళ్లు నువ్వే మా అతిథి అని అంటారు. ఇక పోచమ్మ చిన్నగా తిలోత్తమకు క్లాస్ ఇస్తుంది. ఇక తడిచిన కట్టెలను ఆరేలా చేస్తానని పోచమ్మ పొయ్య దగ్గరకు వెళ్తుంది. తన చీర కొంగుతో కర్రలను తుడిచి ఇస్తానని అప్పుడు అవి ఆరిపోతాయని చెప్తుంది.
నయని కర్రలను అందిస్తుంటే పోచమ్మ తుడిచి ఇస్తుంటుంది. ఇక తిలోత్తమ, వల్లభ, సుమనలు పోచమ్మ మీద సెటైర్లు వేస్తూ నవ్వుతారు. ఇక గాయత్రీ పాప, గానవి పాపలతో పొయ్యిలో కర్పూరం వేయిస్తారు. విశాల్‌కి నిప్పు పెట్టమని పోచమ్మ చెప్తుంది. విశాల్ వెలిగించడంతో తడి కట్టెలు మీద కర్పూరం వెలుగుతుంది. దీంతో అగ్ని దేవుడికి మంత్రం చెప్తే వెలుగుతుందని చెప్తుంది పోచమ్మ. ఇక గుర్తొచ్చిందని పోచమ్మ చెప్పి మంత్రం తాను చెప్తానని అలాగే చెప్పమని నయని వాళ్లతో చెప్తుంది. అందరూ నయని వాళ్లు చెప్పగా సుమన వాళ్లు సెటైర్లు వేస్తారు. ఇంతలో కట్టెలకు నిప్పు అంటుకుంటుంది. అందరూ సంతోషిస్తారు. తిలోత్తమ వాళ్లు షాక్ అయిపోతారు. నయని, హాసినిలు ప్రసాదం చేయడానికి అన్ని సిద్ధం చేస్తారు. పొయ్యపై మట్టి కుండ పెట్టి ప్రసాదం వండుతారు.
తిలోత్తమ: అమ్మవారికి బోనం తయారైపోతుందిరా. అసలు కట్టెలే మండకూడదని వాటి మీద నీరు చల్లితే ఆ ముసలి పోచమ్మ వచ్చి అగ్ని దేవుడు కరుణించి కట్టెలు అంటుకునేలా చేసింది.
సుమన: హో. మీరేనా అత్తయ్య ఆ కట్టెలు తడి చేసింది. మొత్తానికి మీరు బోనాల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టకూడదు అనుకున్నారు అన్నమాట.
వల్లభ: ఉన్న మాట ఏంటి అంటే మీ అక్కకి అన్నింట్లో విజయం వస్తుంది. ఈ సారి కూడా బోనం సమర్పించి అమ్మవారి దయ కలిగకూడదని ఇలాంటి కార్యక్రమానికి ఒడిగట్టాం.
సుమన: కానీ ఏంటి అత్తయ్య బోనం తయారైపోతుంది కదా.
తిలోత్తమ: దాన్ని మనం తినడం కాదు ఎవరూ తినకుండా చేయాలి.
సుమన: వెళ్లి బోనం కుండ పగలగొడతారా.
వల్లభ: అప్పుడు కానీ మనల్ని పగలగొట్టరు విశాల్, నయని మరదలు. నా భార్య కూడా తక్కువదేం కాదు.
సుమన: అత్తయ్య ఏదో ఆలోచిస్తున్నారు చెప్పనివ్వండి బావగారు.
తిలోత్తమ: ఆ నైవేద్యం పనికి రాకుండా చేయాలి అంటే నేలపాలు చేయకూడదు అందులో రసాయనం కలపాలి, వాళ్లకి అనుమానం రాకుండా మామూలుగా మాట్లాడుతూ ముసలి పోచమ్మ మాటలకు మనం నొచ్చుకుంటున్నాం అని ప్రసాదం తినకుండా మానేద్దాం.
ప్రసాదంలో రసాయనం కలపమని తిలోత్తమ సుమనకు చెప్తే సుమన చేయను అనేస్తుంది. దాంతో తిలోత్తమ వల్లభకే ఆ పని చేయమని అంటుంది. నయని వాళ్లు అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి దీపం వెలిగించి అందరూ దండం పెట్టుకుంటారు. మరోవైపు వల్లభ ప్రసాదంలో తిలోత్తమ చెప్పిన రసాయనం కలపడానికి వెళ్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.