RC15: పూణే షెడ్యూల్ కంప్లీటెడ్.. ఇదిగో అప్డేట్..
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి 'విశ్వంభర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూణేలో మొదలైంది. ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది.
Also Read:వెనక్కి తగ్గిన 'సర్కారు వారి పాట'.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..
ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. ఇందులో రామ్ చరణ్, శంకర్ తో పాటు టెక్నీషియన్స్ కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో హెలికాఫ్టర్ కూడా ఉంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించినట్లు సమాచారం. పూనే, సతారా, పాల్‌టన్ ప్రాంతాల్లో స్పెషల్ సీక్వెన్స్‌లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. శంకర్ అనగానే భారీతనం ఉన్న సినిమాలే గుర్తుకు వస్తాయి. వాటికి ధీటుగా స్టైలిష్‌గా సన్నివేశాలను చిత్రీకరించారు. గ్రాండ్‌గా చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి.
అలానే రామ్ చరణ్-కియారాలపై ఓ డ్యూయెట్ ను షూట్ చేశారట. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విధంగా ఈ పాట ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించినట్లు సమాచారం. శంకర్ సినిమాల్లో పాటలను ఎంత లావిష్ గా రూపొందిస్తారో తెలిసిందే. అలానే ఈ సినిమాలో డ్యూయెట్ కోసం భారీగా ఖర్చు చేశారట.
ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు నిర్మాత దిల్ రాజు. తన బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
It’s a wrap !!
— Sri Venkateswara Creations (@SVC_official) November 3, 2021
Completed first schedule of #RC15 in Pune, Satara and Phalton.
Megapower Star @alwaysramcharan and Maverick Director @shankarshanmugh are all set to deliver something very special !!@advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official#SVC50 pic.twitter.com/PF3FxowYze
Also Read: 'మేజర్' మూవీ రిలీజ్ డేట్ చెప్పిన మహేశ్ బాబుAlso Read:పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్కు వెళ్తున్న వీడియో వైరల్
Also Read: సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్... శ్రీరామచంద్రకు టార్చర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి